Avantika Vandanapu: ఈ పాపను గుర్తు పట్టారా.. హాలీవుడ్‌లో అదరగొడుతున్న టాలీవుడ్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌..!

తెలుగులో బ్రహ్మోత్సవం, ప్రేమమ్‌ వంటి సినిమాల్లో కూడా నటించింది. అప్పటి నుంచి తెలుగు స్క్రీన్‌ మీద పెద్దగా కనిపించని ఈ అమ్మాయి ఒక్కసారి హాలీవుడ్‌ సినిమాలో తళుక్కుమంది. మీన్ గర్ల్ అనే ఓ సినిమాలో నటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 16, 2024 | 06:59 PMLast Updated on: Jan 16, 2024 | 7:00 PM

Netizens Shocked To See Avantika Vandanapus Transformation From Little Girl In Brahmotsavam To Mean Girls

Avantika Vandanapu: రోజూ మనం టీవీలో చాలా యాడ్స్‌ చూస్తుంటాం. పదే పదే ఆ యాడ్స్‌ చూడటం వల్ల వాళ్ల ముఖాలు, వాయిస్‌ మైండ్‌లో అలా ఫిక్స్‌ ఐపోతుంటాయి. అలా తెలుగు ప్రేక్షకులకు చాలా రిజిస్టర్‌ అయిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అవంతిక వందనపు. ఓ ఆయిల్‌ యాడ్‌లో నటిచింన ఈ చిన్నారి చాలా మందికి తెలుసు. అమ్మ చేసింది మిస్‌.. లైట్‌గానే ఉంటుంది అనే డైలాగ్‌ మనలో చాలా మందికి రెజిస్టర్‌ అయ్యి ఉంటుంది.

Allu Arjun: స్టార్‌ పని మనిషి.. అల్లు అర్జున్‌ పని మనిషి ఇన్‌స్టా ఫాలోయింగ్‌ చూశారా..?

ఈ యాడ్‌తో పాటు తెలుగులో బ్రహ్మోత్సవం, ప్రేమమ్‌, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో కూడా నటించింది. అప్పటి నుంచి తెలుగు స్క్రీన్‌ మీద పెద్దగా కనిపించని ఈ అమ్మాయి ఒక్కసారి హాలీవుడ్‌ సినిమాలో తళుక్కుమంది. మీన్ గర్ల్ అనే ఓ సినిమాలో నటించింది. ఇప్పుడు ఆ సినిమాకు, అందులో నటించిన అవంతికకు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అవంతిక చేసిన ఓ డ్యాన్స్ అయితే ఫుల్ వైరల్ అవుతుంది. అందులో ఈ ముద్దుగుమ్మ తన అందాలన్నీ చూపిస్తూ చిన్న డ్రెస్ వేసుకుని చిందులు వేసింది. ముఖ్యంగా అవంతిక చేసిన స్కిన్‌ షోకు.. టాలీవుడ్‌ ఆడియన్స్‌ షాకైపోయారు.

ఏంటి అమ్మాయి.. ఆ అమ్మాయేనా అంటూ నోర్లు వెళ్లబెట్టేస్తున్నారు. చాలా పద్ధతిగా కనిపించే తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత హాట్‌గా తయారై మరీ ఈ రేంజ్‌లో షో చేస్తూ, డ్యాన్స్ చేస్తుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే అవంతిక పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. అవంతిక మాట్లాడే విధానం కూడా అచ్చు అమెరికన్స్‌లానే ఉంది. కొత్తవాళ్లు ఎవరైనా చూస్తే ఈమె ఇండియన్‌ అంటే నమ్మరు. ఆ రేంజ్‌లో ఇంగ్లీష్‌ అదరగొట్టేస్తోంది అవంతిక. ఏది ఏమైనా టాలీవుడ్ నుంచి వెళ్లిన ఈ చిన్నారి.. ఇప్పుడు హాలీవుడ్‌లో ఈ రేంజ్‌తో టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకోవడం నిజంగా చాలా గ్రేట్‌. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం అంటున్నారు తెలుగు ఆడియన్స్‌.

 

View this post on Instagram

 

A post shared by avantika (@avantika)