New Film Directors: ఇండస్ట్రీని ఏలుతున్న కొత్త డైరెక్టర్లు.. చెప్పిన మాట వింటున్న సీనియర్ హీరోలు..
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జూనియర్ల హవా కొనసాగుతోంది. డెబ్యూ సినిమాలతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు కొత్త డైరెక్టర్లు. సీనియర్ల దగ్గర తాము నేర్చుకున్న సబ్జెక్ట్‌ను రంగరించి.. యూత్ ఆకట్టుకునేలా కొత్త ప్రాజెక్లు చేస్తున్నారు. వరుసబెట్టి స్టార్ హీరోలకు హిట్ల మీద హిట్లు అందిస్తున్నారు. దీంతో సీనియర్ హీరోలు కూడా జూనియర్ డైరెక్టర్ల మాట తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
రీసెంట్‌గా వస్తున్న సినిమాలో.. 10 సినిమాల్లో 7 సినిమాలకు దర్శకత్వం వహిస్తోంది కొత్త దర్శకులే. డెబ్యూతో వచ్చే వాళ్లు కొందరైతే.. ఒకటి రెండు సినిమాల తీసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్లు కొందరు. ఇప్పటి జెనరేషన్ యూత్‌కు నచ్చే సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఫ్యామిలీ సినిమా కావచ్చు, యాక్షన్ సినిమా కావచ్చు.. జోనర్ ఏదైనా ప్రజెంటేషన్ మాత్రం అద్భుంతంగా ఇస్తున్నారు. దీంతో సీనియర్ హీరోలు కూడా జూనియర్ డైరెక్టర్లనే నమ్ముకున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా డేట్స్ ఇచ్చేస్తున్నారు. దీంతో వరుసబెట్టి సీనియర్ హీరోల లైనస్ మొత్తం కొత్తగా వచ్చిన డైరెక్టర్లతోనే ఉంది.
అంటే సుందరానికి సినిమా ఫేమ్ వెంకట్ అత్రేయా చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయా లాంటి ఎంటర్టైనింగ్ హిట్ ఇచ్చిన ఆర్‌ఎస్‌జే స్వరూప్ కూడా మెగాస్టార్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేయబోతున్నాడు. రాజ రాజ చోర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ గోలి కూడా విక్టరీ వెంకటేష్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. కేరాఫ్ కంచెరపాలెం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకటేష్ మహా నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది లాంటి ఎటర్టైనింగ్ హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా తీస్తున్నాడు. నేచురల్ స్టార్ నానికి శ్యామ్ సింగ రాయ్ లాంటి పేట్రియాటిక్ హిట్ ఇచ్చిన రాహుల్ సంక్రిత్యాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. జాంబీ రెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను లైన్‌లో పెట్టాడు.
ఇలా పెద్ద హీరోలు వరుసగా చేస్తున్న చాలా సినిమాలు దాదాపు కొత్త డైరెక్టర్లతోనే అవ్వడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా మారింది.