New Love Story : మెగా కాంపౌండ్ లో కొత్త లవ్ స్టోరీ.. అప్పుడు లావణ్య.. ఇప్పుడు రీతూ వర్మ

మెగా ఫ్యామిలీలోకి మరో హీరోయిన్ కోడలిగా రాబోతోందా? లావణ్య త్రిపాఠి తర్వాత ఆ ఇంట అడుగుపెట్టబోయేది ఆ బ్యూటీయేనా? ఈ విషయాన్ని ఆ మెగా హీరో సీక్రెట్ గా ఉంచాడా? ఇలాంటి క్వశ్చన్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోయాయి..వీటన్నింటికీ సింగిల్ లైన్ లో క్లారిటీ ఇచ్చేశాడు ఆ మెగా హీరో..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2023 | 05:30 PMLast Updated on: Nov 20, 2023 | 5:30 PM

New Love Story In Mega Compound Then Lavanya Now Ritu Varma

మెగా ఫ్యామిలీలోకి మరో హీరోయిన్ కోడలిగా రాబోతోందా? లావణ్య త్రిపాఠి తర్వాత ఆ ఇంట అడుగుపెట్టబోయేది ఆ బ్యూటీయేనా? ఈ విషయాన్ని ఆ మెగా హీరో సీక్రెట్ గా ఉంచాడా? ఇలాంటి క్వశ్చన్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోయాయి..వీటన్నింటికీ సింగిల్ లైన్ లో క్లారిటీ ఇచ్చేశాడు ఆ మెగా హీరో..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఈ మధ్యే గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీతో పాటు అల్లు కుటుంబం కూడా హాజరై సందడి చేశారు. అయితే అల్లు అర్జున్-స్నేహ రెడ్డి ఇచ్చిన ప్రీ వెడ్డింగ్ పార్టీలో టాలీవుడ్‌ హీరోయిన్ రీతూవర్మ కనిపించింది. ఈ పార్టి పిక్స్ నెట్టింట్లో వైరల్ కావడంతో అందరి దృష్టీ రీతూవర్మపై పడింది. ఆ కుటుంబ పార్టీలో ఈమె ఎందుకు పార్టిసిపేట్ చేసింది? ఇప్పటివరకూ మెగా హీరోలతో కలసి నటించని ఆ పిల్ల.. ఆ ఫ్యామిలీ ఫంక్షన్లో కనిపించిందంటే ఏదో ఉందనే డిస్కషన్ మొదలైంది. లావణ్య.. కొణిదెల వారింటి కోడలైనట్టే రితూవర్మ కూడా మెగా హీరోలు ఎవరితోనో రిలేషన్లో ఉందని.. త్వరలోనే క్లారిటీ రానుందని డిస్కస్ చేసుకున్నారంతా. పైగా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఎవరికీ తెలియకుండా రిలేషన్ మెంటైన్ చేసిన వరుణ్-లావణ్య..పెద్దల సమక్షంలో నవంబరు 1న ఒక్కటయ్యారు. ఇప్పుడు రీతూవర్మ కూడా ఆ ఇంట అలాగే అడుగుపెట్టబోతోందని ఫిక్సైపోయారు.

Srileela : వామ్మో శ్రీలీల గంటకు అంత తీసుకుంటుందా..

ఇంతకీ రితూవర్మ తో రిలేషన్లో ఉన్నాడని ప్రచారం జరిగిన మెగా హీరో ఎవరంటే వైష్ణవ్ తేజ్. పైగా బన్నీ-స్నేహ ఇచ్చిన పార్టీలో వైష్ణవ్.. రీతూతో క్లోజ్ గా కనిపించడంలో అలా ఫిక్స్ చేసేశారు నెటిజన్లు. ప్రస్తుతం ఆదికేశవ ప్రమోషన్లో ఉన్న వైష్ణవ్ తేజ.. ఈ విషయంపై స్పందించాడు.. నేను ఎవరిని ప్రేమించడం లేదు.. ఎవ్వరితోనూ రిలేషన్లో లేను.. నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. రితూవర్మ.. లావణ్య త్రిపాఠికి మంచి ఫ్రెండ్ కాబట్టే పార్టీకి వచ్చింది. పార్టీలో అంతా కలసి సరదాగా స్పెండ్ చేయడం కామన్ అలాగే ఉన్నాం. అంతే కానీ అంతకుమించి ఎలాంటి రిలేషన్ లేదని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశాడు. వైష్ణవ్ తేజ్ ప్రేమ వార్తలు వైరల్ అవడం ఇదే మొదటిసారేం కాదు.. గతంలో ఉప్పెనలో తనతో కలసి నటించిన కృతి శెట్టితో రిలేషన్ షిప్ లో ఉన్నాడనే హడావుడి జరిగింది. అప్పుడు కూడా ఆన్యూస్ ఫేక్ అంటా క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల హీరోయిన్. మలయాళ యాక్టర్స్ భోజు జార్జ్, అపర్ణ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. నవంబర్ 24న ఆదికేశవ థియేటర్లో సందడి చేయనుంది.