Rsmcharan : గేమ్‌ ఛేంజర్‌లో నెక్స్ట్ లెవల్ ఎంట్రీ సీన్..

గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer).. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత చెర్రీ నటిస్తున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌పై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2024 | 10:06 AMLast Updated on: Feb 25, 2024 | 10:06 AM

Next Level Entry Scene In Game Changer

గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer).. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత చెర్రీ నటిస్తున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌పై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. దీంతో మెగా ఫ్యాన్స్‌ చాలా డిజప్పాయింట్మెంట్ లో ఉన్నారు. దీంతో.. అయితే ఈ సినిమా విషయంలో వస్తున్న చిన్న చిన్న అప్‌డేట్స్‌ కూడా ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీపై క్రేజీ బజ్ తెలుస్తోంది.

పాన్ ఇండియా (Pan India) లెవెల్‌లో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీని శంకర్‌ ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శంకర్‌ సినిమాల్లో భారీతనం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో అయితే రామ్ చరణ్ కోసం శంకర్ తన మార్క్ లో ఒక డైనమిక్ ఎంట్రీ ని డిజైన్ చేసినట్లు లేటెస్ట్ టాక్‌ వైరల్‌ అవుతోంది. చెర్రీపై ఇది వరకే కొన్ని ఐకానిక్ ఎంట్రీ సీక్వెన్స్ లు షూట్ చేశారట శంకర్‌.. ఇది చెర్రీ కెరీర్‌లోనే మరో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ సీన్ గా నిలుస్తుంది అని తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కు ఫుల్‌ ఖుషీ ఇస్తోంది.
శంకర్ మేకింగ్.. చెర్రీ స్టైలింగ్ కలిసి ఎంట్రీ సీన్ ఏ రేంజ్‌లో అదిరిపోతుందో అని ఇప్పటి నుంచే రచ్చ చేస్తన్నారు.

కాగా.. ఇటీవలే గేమ్‌ ఛేంజర్‌ నుంచి రిలీజ్ అయిన చరణ్‌ లుక్ సోషల్ మీడియాలో దుమ్ము రేపింది. చెర్రీ పంచ కట్టుకొని ఉన్న లుక్, పొలిటికల్ మీటింగ్ కు సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ లుక్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరో వైపు ఒక మార్కెట్ లో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతున్న సీన్ ను షూట్ చేస్తుండగా.. ఈ వీడియో కూడా లీక్ అయ్యి.. తెగ వైరల్ అయ్యింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా లేట్ అయినా పరవాలేదు నెక్స్ట్ లెవల్లో ఉండాలి శంకర్ సార్. ఆ హెలికాఫ్టర్ లో రాయల్ రామ్ చరణ్ ఎంట్రీకి థియేటర్స్ బద్దలైపోవాలి సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మెగా ఫ్యాన్స్‌ అంచనాలను శంకర్‌ ఏ రేంజ్‌కు తీసుకెళ్తాడో చూడాల్సిందే.