Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసులో నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. వాట్ ఈజ్ దిస్ వరం..!
నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. వరలక్ష్మి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తి.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్ అయ్యాడు. కేరళలోని ఓ ప్రాంతంలో 3వందల కిలోల హెరాయిన్, ఒక ఏకే 47తో దొరికాడు ఆదిలింగం.

Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసులో సినిమా వాళ్ల పేర్లు వినిపించడం కొత్తేం కాదు. అప్పుడెప్పుడో ఐదేళ్లక్రితం టాలీవుడ్‌ను డ్రగ్స్ వ్యవహారం ఓ కుదుపు కుదిపేసింది. ఈ కేసులో డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు పేర్లు వినిపించాయి. ఒక్కొక్కరిని పిలిచి విచారించారు కూడా..! సిట్ ఏర్పాటు చేసి.. డ్రగ్స్ మూలాలు అంతం చేస్తామని.. అసలు గ్యాంగ్‌ను బయటకు తీస్తామని అధికారులు చేసిన ప్రకటనలు అన్నీ ఇన్నీ కావు. ఐతే ఆ తర్వాత సిట్ ఏమైంది.. ఏం తేల్చింది.. కొండను తవ్వి వజ్రాలు పట్టిందా.. ఎలుకలు పట్టిందా అన్న సంగతి పక్కనపెడితే.. డ్రగ్స్ వ్యవహారం చర్చకు వచ్చినప్పుడల్లా టాలీవుడ్ మాట వినిపిస్తూనే ఉంటుంది.
ఐతే ఇప్పుడు మరో నటి పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. వరలక్ష్మి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తి.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్ అయ్యాడు. కేరళలోని ఓ ప్రాంతంలో 3వందల కిలోల హెరాయిన్, ఒక ఏకే 47తో దొరికాడు ఆదిలింగం. ఐతే కూపీ లాగగా.. ఆదిలింగంతో వరలక్ష్మీకి కూడా సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. దీంతో ఆమెకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ విక్రయించగా వచ్చిన డబ్బులతో సినిమాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. వరలక్ష్మికి ఎన్‌ఐఏ నోటీసులతో.. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. తెలుగు, తమిళ్, కన్నడతో పాటు మళయాలంలోనూ వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది.
తెలుగులో లేడీ విలన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. క్రాక్ సినిమాతో టాలీవుడ్‌లో బ్రేక్ రాగా.. వీరసింహారెడ్డి సినిమాలోనూ బాలయ్యకు చెల్లిగా.. విలన్‌గా కిర్రాక్ పుట్టించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఐతే ఎన్ఐఏ నోటీసులతో ఇంకెన్ని వ్యవహారాలు వెలుగుచూస్తాయో అనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైంది.