Pushpa 2: పుష్ప-2లో మెగా డాటర్‌.. సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..!

పుష్ప-2 సినిమాలో మెగా డాటర్‌ నిహారిక నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓ కీలకమైన పాత్ర కోసం నిహారికను తీసుకున్నాడట డైరెక్టర్‌ సుకుమార్‌. కొన్ని నిమిషాల పాటే ఉన్నప్పటికీ పుష్ప-2 సినిమాలో నిహారిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందంటు టాక్‌ నడుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2023 | 06:54 PMLast Updated on: May 06, 2023 | 6:54 PM

Niharika Konidela In Pushpa 2 Here Is The Details

Pushpa 2: ప్రజెంట్‌ టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్‌ అవైటెడ్‌ ప్రాజెక్ట్స్‌లో పుష్ప-2 టాప్‌లో ఉంటుంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ వచ్చినా అది నిమిషాల్లోనే వైరల్‌గా మారిపోతుంది. అలాంటిది ఏకంగా బ్లాస్టింగ్‌ అప్‌డేట్‌ ఒకటి సినీ వర్గాలను చుట్టేస్తుంది. ఈ సినిమాలో మెగా డాటర్‌ నిహారిక నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓ కీలకమైన పాత్ర కోసం నిహారికను తీసుకున్నాడట డైరెక్టర్‌ సుకుమార్‌. కొన్ని నిమిషాల పాటే ఉన్నప్పటికీ పుష్ప-2 సినిమాలో నిహారిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందంటు టాక్‌ నడుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో జరుగుతోంది. అడవుల్లో కూడా మంచి లోకేషన్స్‌ను సెలెక్ట్‌ చేసి షూటింగ్‌ చేస్తున్నాడట సుకుమార్‌. ఫస్ట్‌ పార్ట్‌ క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌తో సెకండ్‌ పార్ట్‌ మీద ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇప్పటి వరకూ రిలీజైన టీజర్‌, పోస్టర్‌, ఫస్ట్ లుక్‌కు ఫ్యాన్స్‌ నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది. సౌత్‌ ఇండియాతో కంపేర్‌ చేస్తే నార్త్‌ ఇండియాలో పుష్పకు వచ్చిన రెస్పాన్స్‌ డబుల్‌. జుకేగా నై అంటూ పుష్ప బొమ్మకు ఊర్రూతలూగిపోయారు నార్త్‌ ఆడియన్స్‌. పుష్ప సినిమాతో బాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో సమానంగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్‌. ఇండియాలోనే కాదు.. ఇంటర్నేషనల్‌గా కూడా పుష్ప సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పాన్‌ ఇండియా లెవెల్‌లో స్టార్ట్‌ అయిన పుష్ప సినిమా ఊహించని విధంగా పాన్‌ వరల్డ్‌గా మారిపోయింది.

ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టుగా పార్ట్‌-2 సినిమాను ఓ లెవెల్‌లో ప్లాన్‌ చేస్తున్నాడు సుకుమార్‌. ఒడిశాలోని దట్టమైన అడవుల్లో ప్రస్తుతం షూటింగ్‌ చేస్తున్నాడు. అల్లు అర్జున్‌, సునీల్‌ గ్యాంగ్‌ మధ్య జరిగే వార్‌ను షూట్‌ చేస్తున్నట్టు సమాచారం. పార్ట్‌-2లో అల్లు అర్జున్‌ ఇండియాలోనే కాకుండా వరల్డ్‌ వైడ్‌గా రెడ్‌ శాండల్‌ స్మగ్లర్‌గా ఎలా ఎదిగాడు అనే లైన్‌తో స్టోరీ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ స్టోరీలోనే మెగా డాటర్‌ నిహారిక కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్‌ ఉందని టాక్‌ నడుస్తోంది.