నిహారిక కొణిదెల రెండో పెళ్ళి.. కాబోయే వరుడు ఎవరో తెలుసా..?
మెగా ఇంట త్వరలోనే పెళ్లి సంబరాలు మోగనున్నట్టు తెలుస్తుంది. నిహారిక త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది.

మెగా ఇంట త్వరలోనే పెళ్లి సంబరాలు మోగనున్నట్టు తెలుస్తుంది. నిహారిక త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఈమె పెళ్లి గురించి వార్తలు వైరల్ కొన్ని రోజులుగా ఒంటరిగానే ఉంటుందని నిహారిక తన చిన్ననాటి స్నేహితుడిని ఒకరిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న నాగబాబు కూడా చాలా రోజులుగా కూతురికి మంచి సంబంధం దొరికితే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే నిహారిక నచ్చినవాడు దొరకడంతో పెళ్లి ముహూర్తం ఖాయం చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే భర్త చైతన్యతో విడాకులు తీసుకుంది నిహారిక. 2020 డిసెంబర్ లో వీళ్ళ వివాహం వైభవంగా జరిగింది. మెగా కుటుంబం అంతా కలిసి ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనా సమయంలో కూడా ఖర్చుకు వెనకాడకుండా కోటలో వీళ్ళ పెళ్లి జరిగింది.
అప్పట్లో నిహారిక చైతన్య పెళ్లి గురించి నేషనల్ మీడియా కూడా కవరేజ్ చేసిందంటే ఏ రేంజ్ లో వీళ్ళ పెళ్లి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు బానే ఉన్నా.. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఎక్కువైనట్టు తెలుస్తుంది. చైతన్య సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావడం.. నిహారిక సినిమా ఇండస్ట్రీ నుంచి రావడంతో ఇద్దరికీ అభిప్రాయ బేధాలు ఎక్కువగా వచ్చాయని ప్రచారం జరుగుతుంది. అందుకే కొన్ని రోజులు కూర్చొని మాట్లాడుకోవాలని అనుకున్నా కూడా పరిష్కారం కాకపోవడంతో చివరికి విడాకుల బాట పట్టారు ఈ ఇద్దరు.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను.. ఇండస్ట్రీలోనే ఉంటాను అనే ఒప్పందం పైనే చైతన్య, నిహారిక పెళ్లి జరిగిందని అప్పట్లో ఇండస్ట్రీలో ప్రచారం బాగానే జరిగింది. కొన్ని రోజులు అది బాగానే ఉన్నా.. ఆ తర్వాత అదే తీవ్ర మనస్పర్ధలు రావడానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు చైతన్య కూడా మీడియాకు దూరంగానే ఉంటున్నాడు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత మెగా కుటుంబంలో మళ్లీ పెళ్లిభాజలు మోగే సమయం దగ్గర పడినట్టు తెలుస్తుంది. తన స్కూల్ ఫ్రెండ్ ఒకరిని నిహారిక పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతుంది. మరి అందులో నిజం ఎంత ఉంది అనేది వాళ్లే చెప్పాలి. కాగా.. గతంలో ఇదే కుటుంబం నుంచి చిరంజీవి కూతురు శ్రీజ, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అమ్మగారు కూడా విడాకులు తీసుకున్నారు.