Niharika Konidela: వాట్‌ ద ఫిష్‌’.. మెగా డాటర్ సర్‌ప్రైజ్‌ అదిరిపోలా..!

డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన నిహారిక.. లేటెస్ట్‌గా మరో మూవీతో వచ్చేందుకు సిద్ధమైంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తోన్న వాట్ ద ఫిష్ మూవీలో నటిస్తోంది. లేటెస్ట్‌గా విడుదలైన నిహారిక లుక్ మెగా ఫ్యాన్స్‌కి బిగ్ సర్‌ ప్రైజ్ ఇచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2023 | 05:19 PMLast Updated on: Dec 19, 2023 | 5:19 PM

Niharika Konidelas What The Fish Movie First Look Released On Her Birthday

Niharika Konidela: పెళ్లి తర్వాత కెరీర్‌లో స్మాల్ బ్రేక్ తీసుకున్న నిహారిక కొణిదెల.. డైవోర్స్ తర్వాత మళ్లీ సినిమా కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన నిహారిక.. లేటెస్ట్‌గా మరో మూవీతో వచ్చేందుకు సిద్ధమైంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తోన్న వాట్ ద ఫిష్ మూవీలో నటిస్తోంది. లేటెస్ట్‌గా విడుదలైన నిహారిక లుక్ మెగా ఫ్యాన్స్‌కి బిగ్ సర్‌ ప్రైజ్ ఇచ్చాయి. దాదాపు 11 నెలలు బ్రేక్ తీసుకున్న మంచు మనోజ్..‘వాట్ ద ఫిష్’ అనే సినిమా ప్రకటించాడు.

BIGG BOSS 7: బిగ్‌బాస్‌ విజేతలు ఎక్కడ ? విన్నర్లు ఇప్పుడేం చేస్తున్నారు..? 

‘మనం మనం.. బరంపురం’ అనే ట్యాగ్ లైన్ ఈ టైటిల్‌కు పెట్టాడు. ఓ నాలుగు నెలల పాటు మళ్లీ సైలెంట్ అయినపోయిన మనోజ్.. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చాడు. ట్యాగ్ లైన్‌ని ‘వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజీయర్’ అని మార్చడంతో పాటు ‘వాట్ ద ఫిష్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల చేశాడు. ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తోంది. నిహారిక బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మేకర్స్ మీడియాకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో ఎక్కడా మనోజ్ ప్రస్తావన లేదు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులలోనూ మంచు మనోజ్‌ను ఎవ్వరూ ట్యాగ్ చేయలేదు. నిహారిక ఈ సినిమా ద్వారా కమర్షియల్ కమ్ బ్యాక్ ఇస్తోందని, ఈ మూవీలో ఆమెదే మెయిన్ రోల్ అని మేకర్స్ చెప్పారు. నిహారిక లుక్ మాత్రం సర్‌ప్రైజింగ్‌గా ఉంది. నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. ఆమె స్టైలిష్‌గా నడుస్తూ కనిపించింది. ఆమె వెనుక డాలర్ ఇమేజ్‌ ఉంది. ఆమె పాత్ర పేరు అష్టలక్ష్మి అలియాస్ ASH.

ఈ క్యారెక్టర్‌ని యునిక్‌గా డిజైన్ చేశాడట డైరెక్టర్. తెలుగు సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నిహారిక కనిపించబోతోందట. 2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లిచేసుకున్న నిహారిక ఈ ఏడాది ప్రారంభంలో అతడికి విడాకులు ఇచ్చేసింది. వాట్ ద ఫిష్ మూవీ ద్వారా వరుణ్ కోరుకొండ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో సినిమా రూపొందుతోందట. 6ix సినిమాస్‌ బ్యానర్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్నాడు. 2024లో ఈ మూవీ రిలీజ్ కానుంది. మంచు మనోజ్ సినిమాలో నిహారిక ఇలాంటి ఒక పాత్ర చేస్తుంది అని ఎవరు ఊహించలేదు. మరి చిన్న బ్రేక్ తర్వాత వస్తోన్న నిహారికకు వాట్ ద ఫిష్ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ..