Niharika-Chaitanya : నిహారిక.. నువ్ ఇక మారవా.. విడాకులపై చైతన్య స్ట్రాంగ్‌ కౌంటర్‌…

మెగా డాటర్‌ (Mega Daughter) నిహారిక (Niharika) .. మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌ మ్యారేజ్‌తో మీడియా అటెన్షన్‌ డ్రా చేసిన నిహా.. ఆ తర్వాత డివోర్స్ (Divorce) విషయంలోనూ అలాంటి చర్చకే కారణం అయింది. చైతన్య (Chaitanya) ను పెళ్లి చేసుకున్న నిహారిక.. ఆ తర్వాత ఎందుకు విడాకులు తీసుకుంది అన్న విషయం ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉండేది. ఐతే ఈ బ్యూటీ ఇన్నాళ్లు ఓపెన్ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2024 | 03:36 PMLast Updated on: Jan 27, 2024 | 3:36 PM

Niharika Will You Change Again Chaitanyas Strong Counter On Divorce

మెగా డాటర్‌ (Mega Daughter) నిహారిక (Niharika) .. మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌ మ్యారేజ్‌తో మీడియా అటెన్షన్‌ డ్రా చేసిన నిహా.. ఆ తర్వాత డివోర్స్ (Divorce) విషయంలోనూ అలాంటి చర్చకే కారణం అయింది. చైతన్య (Chaitanya) ను పెళ్లి చేసుకున్న నిహారిక.. ఆ తర్వాత ఎందుకు విడాకులు తీసుకుంది అన్న విషయం ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉండేది. ఐతే ఈ బ్యూటీ ఇన్నాళ్లు ఓపెన్ అయింది. మా విడాకులకు కారణాలు ఇవే అంటూ చెప్పుకొచ్చింది. డివోర్స్ తీసుకున్న బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చానని.. విడాకులకు ముందు, తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలను పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.

తనది పెద్దలు కుదిర్చిన సంబంధం అని.. విడాకులు తీసుకున్నప్పుడు తనను చాలా మాటలు అన్నారని.. ఎంతో బాధేసింది, చాలా ఏడ్చానని కన్నీళ్లు పెట్టుకుంది నిహారిక. కాదు. ఎవరైనా జీవితాంతం కలిసుండాలనే పెళ్లి చేసుకుంటారు. ఏడాదిలో విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఖర్చుపెట్టి ఘనంగా జరుపుకోరు. రిలేషన్‌షిప్‌ కొనసాగాలనే అందరూ కోరుకుంటారు. తాను అలానే కోరుకున్నానని.. ఐతే పరిస్థితులు ఇంకోలా ఉన్నాయని చెప్పుకొచ్చింది. మనుషులను అంత ఈజీగా నమ్మకూడదనే విషయాన్ని అర్థం చేసుకున్నానంటూ ఇంటర్వ్యూలో నిహారిక చేసిన కామెంట్స్‌పై చైతన్య స్ట్రాంగ్‌గా రియాకట్‌ అయ్యారు. నిజాలు తెలుసుకోకుండా ఒకవైపే మాట్లాడటం చాలా తప్పని… రెండువైపులా ఆలోచించాలంటూ ఒక పోస్ట్ పెట్టాడు.

నిహారిక ఎదుర్కొన్న నెగటివిటీని దూరం చేసే ప్రయత్నం మంచిదే అంటూ సెటైరికల్‌గా రాసుకొచ్చిన చైతన్య.. పర్సనల్‌గా జరుగుతున్న తప్పుడు ప్రచారం తట్టుకోవడం అంత ఈజీ కాదని.. బాధితులను ట్యాగ్ చేయడంతోపాటు.. ఇలాంటి వేదికలను ఉపయోగించడం మానుకోవాలని సూచించారు. ఇలా జరగడం ఇది రెండోసారి అంటూ రాసుకొచ్చాడు. విడాకులకు పసంబంధించిన విషయాల్లో ఇద్దరికీ బాధ ఉంటుందని, ఎప్పుడూ ఒకవైపే మాట్లాడకూడదంటూ చైతన్య పెట్టిన పోస్ట్.. వైరల్ అవుతోంది. ఐతే ఇప్పుడీ పోస్ట్‌తో కొత్త చర్చ జరుగుతోంది. విడాకుల వ్యవహారంలో నిహారిక పూర్తి విషయాలు చెప్పలేదని క్లియర్‌గా అర్థం అవుతోందంటూ.. ఇప్పుడు కొత్త డిస్కషన్ నడుస్తోంది.