Nijam With Smita: చిరంజీవి ముఖ్యఅతిథిగా తొలి ఏపిసోడ్ ఫిబ్రవరి 10న ప్రారంభం..!

CHIRU WITH SMITH NIJAM SHOW
ప్రముఖ గాయని స్మిత(Smita) అనగానే మనకు వెంటనే రీమిక్స్ సాంగ్స్, పాప్ సాంగ్స్ ను ఆల్బమ్స్ చేసే మహిళగా గుర్తిస్తాం. గతంలో పాడుతా తీయగా అనే షోద్వారా తన కెరీర్ ను ప్రారంభించారు. చాలా కష్టనష్టాల నడుమ తన ప్రతిభను ప్రపంచానికి చూపించగలిగారు. గతంలో ఇషా పౌండేషన్ సంబంధించి అనేక ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఆల్బమ్స్ ని కూడా విడుదల చేశారు. కొంత కాలం సినిమాల్లో అనేక రకాలా పాటలను పాడి శ్రోతలను ఉత్సాహపరిచారు.
ప్రస్తుతం సోనీలివ్(Sony Liv)లో వ్యాఖ్యాతగా నిజం (Nijam) అనే పేరుతో ఒక షో చేయబోతున్నారు. సెలబ్రిటీస్ తో ఒక టాక్ షో చేయనున్నారు. ఫిబ్రవరి 10నుంచి ప్రసారం కానున్న ఈ షోలో చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. దీనికి సంబంధిచిన మొదటి ఏపిసోడ్ ప్రోమో వీడియో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఇందులో ఈమె చిరంజీవిని కొన్ని ఆసక్తికర ప్రశ్నలను సంధించారు. వాటికి మెగాస్టార్ తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ వచ్చారు. ఇంతకు స్మిత అడిగిన ప్రశ్నలు ఏంటో చూద్దాం.
మీకాలేజ్ డేస్ లో ఫస్ట్ క్రష్ ఎవరు? స్టార్ డమ్ అనేది కొంతమందికే వస్తుంది. ఆస్టేజికి వెళ్లాలంటే అవమానాలు, అనుమానాలు అన్నీ ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు ఎదుర్కొన్న సంఘటనలు ఏమిటి? మీ కెరీర్ ఎలా మొదలైంది? ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎలా ఉంది? అంటూ ‘నిజం విత్ స్మిత’ (Nijam With Smita) షో ఉత్కంఠభరితంగా సాగినట్లు అనిపిస్తుంది.
చిరు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఈ ప్రోమోలో చెప్పలేదు. అయితే తన జీవితంలోని ఒక ఇన్సిడెంట్ గురించి ఇలా చెప్పారు. జగిత్యాలలో తన అభిమానులు పూలవర్షం కురిపించగా అదే సమయంలో తనపై కొంతమంది కోడిగుడ్లు విసిరారని అంతరంగాన్ని ఆవిష్కరించారు.