Nikhil Siddhartha: హనుమంతుని భక్తునిగా నిఖిల్.. హనుమంతుడు ఆశీర్వదిస్తాడా..?
భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ భారీ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీకి చెందిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. స్వయంభు మూవీలో హనుమంతుని భక్తునిగా నిఖిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడట.

Nikhil Siddhartha: కార్తికేయ-2తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు యువ హీరో నిఖిల్. అయితే.. తన గత చిత్రం స్పై ఘోర పరాజయంతో నిఖిల్ డిజప్పాయింట్ అయ్యాడు. ఈసారి ఎలాగైనా మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవాలన్న కసితో.. స్వయంభు అనే పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ భారీ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీకి చెందిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.
TOLLYWOOD: టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్స్ ఎక్కువయ్యాయా..? ఎందుకీ దొంగ లెక్కలు..
స్వయంభు మూవీలో హనుమంతుని భక్తునిగా నిఖిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడట. ఆ పాత్ర కోసం హీరో నిఖిల్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడట. ఈ సినిమాలో తాను హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నానని స్వయంగా నిఖిలే తెలిపాడు. సినిమాలో తనకు ఇష్టమైన డైలాగ్ “జై శ్రీరాం” అని చెప్పాడు. ప్రస్తుతం కొన్ని అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామంటూ ఈ మూవీపై హైప్ క్రియేట్ చేశాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా లేదా దీపావళి సందర్భంగా థియేటర్లలోకి రానుంది.
స్వయంభు నిఖిల్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలివనుంది. రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. టాలీవుడ్‌లో తేజ సజ్జా తర్వాత నిఖిల్ కూడా ఆంజనేయ భక్తుడిగా అలరించనున్నాడన్న వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరి ఈ సినిమా నిఖిల్‌కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.
Shooting Non Stop for #SWAYAMBHU Coincidentally i am a HANUMAN devotee in the film too🙏🏽
Shooting some amazing sequences …. my favourite dialogue in the film #JaiShriRam
Will see u in theatres this Dusshera Diwali #Swayambhu pic.twitter.com/0UI4qkxBQZ— Nikhil Siddhartha (@actor_Nikhil) January 16, 2024