Nita Ambani : కొత్త కోడలికి నీతా అంబానీ రూ.640 కోట్ల గిఫ్ట్‌…

అపర కుబేరుడు అంబానీ ఇంట్లో వేడుకలు అంటే మీడియాకు సోషల్‌ మీడియా (Social Media) కు ఉండే ఇంట్రెస్ట్‌ వేరే లెవెల్‌. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు అనిపించే రీతిలో వేడుకలు నిర్వహిస్తారు కాబట్టే అంబానీ ఇంటి వేడుకలు అంత స్పెషల్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 29, 2024 | 05:00 PMLast Updated on: May 29, 2024 | 5:00 PM

Nita Ambanis Gift Of Rs 640 Crore To New Daughter In Law

అపర కుబేరుడు అంబానీ ఇంట్లో వేడుకలు అంటే మీడియాకు సోషల్‌ మీడియా (Social Media) కు ఉండే ఇంట్రెస్ట్‌ వేరే లెవెల్‌. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు అనిపించే రీతిలో వేడుకలు నిర్వహిస్తారు కాబట్టే అంబానీ ఇంటి వేడుకలు అంత స్పెషల్‌. ఇప్పటికే అనంత్‌ అంబానీ (Anant Ambani) ప్రీ వెడ్డింగ్‌ ఫస్ట్‌ పార్టీతో అందరి మతి పోగెట్టేశారు అంబానీ. ఇప్పుడు సెకండ్‌ పార్టీ కూడా అంచనాలకు అందకుండా సముంద్రలో చేస్తున్నారు. జూలై 12న అనంత్‌ నీతాల పెళ్లి జరగబోతోంది. ఈ సందర్భంగా నీతా అంబానీ కాబోయే కోడలికి భారీ గిఫ్ట్‌ ఇవ్వబోతున్నట్టు సోషల్‌ మీడియాలో టాక్‌ నడుస్తోంది. దీని విలువ ఏకంగా 640 కోట్ల రూపాయలని సమాచారం.

నీతా అంబానీ కాబోయో చిన్న కోడలు రాధికా మర్చంట్‌ కోసం.. దుబాయ్‌లో 640 కోట్ల విల్లాను గిఫ్ట్‌గా అందించనున్నారట. ఇందులో 10 విలాసవంతమైన బెడ్‌రూమ్‌లు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ మార్బుల్స్‌, అద్భుతమైన కళాకృతులు ఉండనున్నాయట. ఇంకా ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉంబడబోతోందట. ఈ బీచ్‌ కేవలం ఈ విల్లాకు మాత్రమే. దుబాయ్‌లో ఉన్న ఈ విల్లా ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వీళ్ల నిశ్చితార్థం సందర్భంగా ముఖేష్‌ అంబానీ అనంత్‌ అంబానీకి 4 కోట్ల 5 లక్షలు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్‌గా అందించారు. అలాగే కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కి ఖరీదైన వెండి గణేషుడి విగ్రహం, కలశాలు సహా లాంటి నగలు కానుకగా అందించారు. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నెక్లెస్ సైతం రాధికాకు బహుమతిగా అందించినట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పుడు పెళ్లికి ఏకంగా 640 కోట్ల రూపాయల విలువైన విల్లాను బహుమతిగా ఇవ్వనున్నారట. 2022లో అనంత్‌ రాధికల ఎంగేజ్‌మెంట్‌ కాగా.. ఇప్పటికే ఓ ప్రీ వెడ్డింగ్‌ పార్టీ నిర్వహించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు ఇటలీ టూ ప్యారిస్‌.. సముద్రంలో సెకండ్‌ పార్టీ నిర్వహిస్తున్నారు. వచ్చే నెలలో వీళ్లి పెళ్లి జరగబోతోంది. జస్ట్‌ ప్రీ వెడ్డింగ్‌ పార్టీలే ఇలా నిర్వహిస్తే.. పెళ్లి ఇంకా ఏ రేంజ్‌లో చేస్తారో చూడాలి మరి.