Remake Film: ఎదురింటి మొగుడే నితిన్.. పక్కింటి పెళ్లాం రష్మిక..
పాన్ ఇండియా లేడీ రష్మిక కి ఇప్పుడు నితిన్ ఎదురింటి మొగుడిగా మారాడు. నిజంగానే ఎదురింట్లోనే ఉండబోతున్నాడు. దూరంగా తనతో కలిసి కాపారం చేయబోతున్నాడు. ఇదంతా సినిమాలో జరగబోతోంది. వెంకీ కుడుముల మేకింగ్ లో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం రీమేక్ కాబోతోందట.

Rashmika nithin combo movie
మెగా స్టార్ చిరంజీవితో సినిమా తీయాల్సిన దర్శకుడు వెంకీ కుడుముల. కాని కథతో చిరు ని ఇంప్రెస్ చేయలేకపోయాడు. సర్లే నితిన్ ఇంప్రెస్ అయ్యాడని, మరో కథని మూవీ గా తీయబోతున్నాడు. అలాని కొత్త కథని ఎంచుకోలేదట.. రాజేంద్ర ప్రసాద్ హిట్ మూవీ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం కథని పోలిన కథనే ఎంచుకున్నాడట
ఓ వ్యక్తి నెలరోజుల్లో చనిపోయే జబ్బు వస్తే, తనలోని పిసినారి కాస్త మంచి వాడిగా ఎలా మారుతాడు.. తన తోటి వాళ్లతో ఆ నెలరోజులు సరదాగా గడపాలని ఎలా అనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో కొందరుతన మీద చూపించే జాలికి ఎలా ఇబ్బంది పడతాడనే పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కబోతోంది. అంతే ఈ మ్యాటర్ బయటికి రాగానే ఇది అప్పుడెప్పుడో వచ్చిన రాజేంద్రప్రసాద్ మూవీ ఎదురింటి మొగడు పక్కింటి పెళ్లాం కథే అని కామెంట్ పెరిగింది. దీంతో ఇది రీమేకో, ఫ్రీమేకో తేలకపోవటంతో కాపీ విమర్శలు పెరుగుతున్నాయి.