Nithiin: నితిన్ సినిమాకు పవన్ టైటిల్.. పాజిటివ్ బజ్ ఖాయమా..?
ఎంతైనా హీరో అయి ఉండి కూడా సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ మీద తనకున్న అభిమానం అలాంటిదనుకోవచ్చు. కాని మెగా ఫ్యామిలీలో చెర్రీ కాని, సాయి తేజ్ కాని, ఆఖరికి వరుణ్ తేజ్ కూడా పవన్ పేరుని నితిన్ వాడుకున్నంతగా వాడుకోలేదనే అభిప్రాయముంది.

Nithiin: నితిన్ పవన్ ఫ్యాన్‌గా వచ్చాడు. జయం, దిల్, ఇష్క్.. ఇలా డజన్ సినిమాలకోసారి హిట్ మెట్టెక్కాడు. ఇలా తనకి హిట్లకంటే ఫెయిల్యూర్స్ కామన్. కానీ, అంతకు మించి మరో కామన్ ఫాక్టర్ పవనిజం. పవన్ ఫ్యాన్స్‌లో ఎవరూ తన పేరుని నితిన్ వాడుకున్నంతగా వాడుకోలేదనే కామెంట్ ఉంది. ఎంతైనా హీరో అయి ఉండి కూడా సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ మీద తనకున్న అభిమానం అలాంటిదనుకోవచ్చు.
Virat Kohli: రింకూ సింగ్‌కు కోహ్లీ సర్‌ప్రైజ్ గిఫ్ట్..
కాని మెగా ఫ్యామిలీలో చెర్రీ కాని, సాయి తేజ్ కాని, ఆఖరికి వరుణ్ తేజ్ కూడా పవన్ పేరుని నితిన్ వాడుకున్నంతగా వాడుకోలేదనే అభిప్రాయముంది. ఫ్యాన్స్ అన్నాక ఇవన్నీ కామన్ అని కూడా సర్ధిచెప్పొచ్చు. కాని ఇది ఎంతకాలం అనే ప్రశ్న ట్రోలర్స్ నుంచి పెరిగింది. దిల్ టైంలో పవన్‌ని వాడుకున్నాడంటే ఒక అర్ధముంది. ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు ఇష్క్ మూవీ ప్రమోషన్ కోసం పవర్ స్టార్ సాయం తీసుకున్నాడంటే అర్ధం ఉంది. 40లో పడుతున్నా, ఇంకా నితిన్ పవర్ స్టార్ ఇమేజ్‌ని, పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ తీసుకోవటం మరీ అతిగా ఆధారపడటంలాంటిదనే కామెంట్స్ ఉన్నాయి. పవన్ కొడుకు అకీరా నందన్ ఇప్పుడే హీరో కాకపోయినా, కొన్నేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. తన తల్లి అఖీరాకు సినిమాల మీద ఇంట్రస్ట్ లేదన్నా, హీరోగా తన ఎంట్రీ మాత్రం పక్కా.
ఆల్రెడీ తనకి మీసాలు గెడ్డాలు వచ్చాయి. జూనియర్ పవర్ స్టార్‌గా వచ్చి తన తండ్రి వారసత్వం వాడుకుంటే పర్లేదు. కాని, తను వచ్చాక కూడా ఇలానే నితిన్ పవన్ ఫ్యాన్‌గా పవన్ పేరుని, తన హిట్ మూవీల సీన్లని, టైటిళ్లని వాడుకుంటే ఎలా అనే మాటలే వినిపిస్తున్నాయి. తన కొత్త మూవీ తమ్ముడు పోస్టర్ వచ్చాకే ఈ కామెంట్స్ పెరిగాయి.