PAWAN KALYAN: కావాలని పవన్ హిట్ మూవీలని టార్గెట్ చేశారా..?
ఖుషి అంటూ విజయ్ దేవరకొండ, తమ్ముడు అంటూ నితిన్.. పవన్ హిట్ మూవీస్ పేర్లు కొట్టేశారు. ఇప్పుడా లిస్ట్‌లో డీజే టిల్లు ఫేం సిద్దూ జొన్నలగడ్డ వచ్చి చేరాడు. పవన్ ఫేట్ మార్చిన బద్రి పేరుని తన సినిమాకు వాడుకోబోతున్నాడట.

PAWAN KALYAN: పవన్ కళ్యాణ్ హిట్ మూవీ టైటిల్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ టైటిల్స్ కోసమే యంగ్ హీరోలు క్యూ కట్టారు. ఆల్రెడీ ఖుషి అంటూ విజయ్ దేవరకొండ, తమ్ముడు అంటూ నితిన్.. పవన్ హిట్ మూవీస్ పేర్లు కొట్టేశారు. ఇప్పుడా లిస్ట్‌లో డీజే టిల్లు ఫేం సిద్దూ జొన్నలగడ్డ వచ్చి చేరాడు. పవన్ ఫేట్ మార్చిన బద్రి పేరుని తన సినిమాకు వాడుకోబోతున్నాడట. ఇలా వీళ్లంత కట్టకట్టుకుని పవన్ హిట్ మూవీల వెంటపడటానికి కారణం విజయ్ దేవరకొండే అంటున్నారు.
ఆల్రెడీ ఆ హీరోకి పవన్‌లానే యూత్‌లో ఓరేంజ్ ఫాలోయింగ్ ఉంది. మరో పవర్ స్టార్ అంటున్నారు. అంటే పవన్‌ని ఎందుకు.. ఎలా కనెక్ట్ అయ్యారో.. తెలియకుండానే ఫ్యానైపోయినట్టు, పవన్ ఎలా ఎనిగ్మానో అలా విజయ్ మారుతున్నాడని ప్రచారం జరుగుతోంది. హిట్, ఫ్లాప్స్‌కి అతీతంగా మారుతున్నవిజయ్‌కి మెగా హీరోలతో మంచి రిలేషన్‌షిప్ ఉంది. దానికి తోడు పవన్ ఖుషి మూవీ టైటిల్ వాడుకుని పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి మరింత దగ్గరవుతున్నాడు. ఈ చర్యలతో నితిన్ ఉలిక్కి పడ్డాడు. బేసిగ్గా పవన్ ఫ్యానైన నితిన్, పవర్ స్టార్ పాటలు, మాటల్ని తన సినిమాల్లో వాడేస్తూ రెడీమెడ్‌గా పవన్ ఫ్యాన్స్ వల్ల మార్కెట్ సొంతం చేసుకున్నాడు. అలాంటి హీరోని అర్జున్ రెడ్డితో విజయ్ ఎప్పుడో దాటేసినా, ఆంధ్రాలో పవన్ ఫాలోయింగ్‌కి పవనిజం వల్ల వచ్చే మైలేజ్ మామూలుగా ఉండదు.
దీంతో విజయ్ తన మూవీకి ఖుషి అని పెట్టుకోవటంతో, నితిన్ ఇన్‌సెక్యూరిటీలో పడ్డాడని, అందుకే ఉన్నపళంగా వేణు శ్రీరామ్ మూవీకి తమ్ముడు టైటిల్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. అంటే పవన్ తాలూకు ఏ మెటీరియలైనా నితిన్ తప్ప మరొకరు వాడుకోకూడదనే శాడిజం వల్లే ఇలా జరుగుతోందనే ఫన్నీ కామెంట్లు పెరిగాయి. ఏదేమైనా విజయ్, నితిన్ తర్వాత సిద్దూ కూడా పవర్ స్టార్ హిట్ మూవీ టైటిల్ వాడుకోవటం కొసమెరుపు.