చిరంజీవి, పవన్, మహేష్ బాబుకే సాధ్యం కాలేదు.. నితిన్ చేసి చూపించాడు.. ఏంటో తెలుసా..?
ఇండస్ట్రీలో కొన్ని రికార్డులు భలే గమ్మత్తుగా ఉంటాయి. వాటిని తలుచుకున్నప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు అనుకుంటున్నారు కదా..! వస్తున్నాం అక్కడికే వస్తున్నాం..

ఇండస్ట్రీలో కొన్ని రికార్డులు భలే గమ్మత్తుగా ఉంటాయి. వాటిని తలుచుకున్నప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు అనుకుంటున్నారు కదా..! వస్తున్నాం అక్కడికే వస్తున్నాం.. మీకు తెలుసా టాలీవుడ్ లో 99 శాతం ఏ హీరోకు లేని ఒక రికార్డు నితిన్ దగ్గర ఉంది. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా, విచిత్రంగా అనిపిస్తుంది కదా. కానీ ఇదే నిజం. తెలుగు ఇండస్ట్రీలో నితిన్ సాధించిన ఈ ఘనత ఫ్యూచర్ లో కూడా అంత ఈజీగా అందదు. అంతగా ఊరిస్తున్నారు.. ఇంతకీ ఏంటా రికార్డు అనుకుంటున్నారు కదా..! ఒక్కసారి నితిన్ ట్రాక్ రికార్డు చెక్ చేయండి.. ఆయన పని చేసిన డైరెక్టర్లను ఒకసారి చూడండి.
నాటి రాఘవేంద్రరావు నుంచి నేటి రాజమౌళి వరకు తెలుగులో ఉన్న అగ్ర దర్శకులు అందరితోనూ పనిచేసిన ఘనత నితిన్ సొంతం. ముఖ్యంగా ఈ జనరేషన్ దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, వినాయక్.. ఈ నలుగురు దర్శకులతో పని చేసిన హీరో నితిన్. తెలుగులో చాలామంది హీరోలు ఈ నలుగురిలో కేవలం ముగ్గురితో మాత్రమే పని చేశారు. రామ్ చరణ్ ని తీసుకుంటే రాజమౌళి, పూరి, వినాయక్ తో సినిమాలు చేశాడు.. అలాగే అల్లు అర్జున్ త్రివిక్రమ్, పూరి, వినాయక్ తో సినిమాలు చేశాడు. ప్రభాస్ రాజమౌళి, పూరి, వినాయక్ తో పని చేశాడు.
ఈ లిస్టులో కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే నితిన్ రికార్డు సమం చేశాడు. అయితే అది కూడా 2018 తర్వాతే ఎన్టీఆర్ ఖాతాలోకి ఈ రికార్డు వచ్చింది. అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ ఖాతాలో చేరిపోయాడు. దానికి ముందు పూరి జగన్నాథ్, వినాయక్, రాజమౌళిలతో సినిమాలు చేశాడు ఎన్టీఆర్. కానీ నితిన్ మాత్రం కెరీర్ మొదట్లోనే వినాయక్ తో దిల్.. రాజమౌళితో సై సినిమాలు చేశాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో హార్ట్ ఎటాక్, త్రివిక్రమ్ తో అ ఆ సినిమాలు చేశాడు. లిస్టులోకి ఎన్టీఆర్ వచ్చేవరకు ఈ రికార్డు నితిన్ దగ్గర పదిలంగా ఉంది. కృష్ణవంశీ, రాఘవేందర్రావ్ లాంటి సీనియర్ దర్శకులతో ఇటు జూనియర్ ఎన్టీఆర్.. అటు నితిన్ సినిమాలు చేశారు. ఏదేమైనా కెరీర్ లో ఇప్పుడు కాస్త వెనకబడ్డాడు కానీ ఇప్పటికీ నితిన్ టాప్ టెక్నీషియన్స్ తోనే పని చేస్తున్నాడు.