KAJAL: షెడ్డుకి వచ్చేసిన కాజల్… ఇంకా ఎన్నాళ్లంటున్న జనం !
ఒకప్పుడు వరుసగా హిట్లు వచ్చాయి. పెళ్ళయింది... పిల్లలు పుట్టడంతో అలనాటి చందమామ కాజల్ ను ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదు. లావైంది... ఫేస్ లో గ్లో తగ్గిపోయింది... ఆ... ఇంకా ఎన్నాళ్ళు చూస్తాం అని జనం అంటున్నారు.
భగవంత్ కేసరి మూవీలో కాజల్ ని చూసిన వాళ్ళెవరూ మొదటి గుర్తుపట్టలేకపోయారు. కరెంట్ తీగలా ఉండే కాజల్ కరెంటు స్తంభంలో కనిపించింది. ఫేస్ లో గ్లో పోయింది. మనిషి లావు అయింది. బాలయ్య బాబు పక్కన గనక… చలో దేఖేంగే అనిపించింది. నిజానికి కాజల్ సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ ఏమీ కాదు. తన కెరీర్ లో కూడా అలా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రయోగాలు చేయలేదు. వీలైనంత సినిమాలు చేశామా… నాలుగు డబ్బులు వెనకేసుకున్నామా అన్న మార్కెటింగ్ మెథడాలజీ లోనే కాజల్ కెరీర్ అంతా సాగింది. పెళ్లి, డెలివరీ వల్ల గ్యాప్ వచ్చినా… ఎప్పుడు టైం దొరికితే అప్పుడు… ఎప్పుడు వీలైతే అప్పుడు…ఏదో ఒక రోజు చేస్తూనే ఉంది. కానీ ఇంక రాబోయే రోజుల్లో కాజల్ ని చూడటం కష్టమే అంటున్నారు జనం. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌పై కాజల్ చాలా ఆశలు పెట్టుకున్నా.. చందమామను ఎవరూ పట్టించుకోవట్లేదు. గ్లామర్ హీరోయిన్ ముద్ర చెరిగిపోయింది. ఎట్టకేలకు బాలయ్య ఆఫర్ ఇచ్చినా.. చందమామ లైన్లో ఎందుకు పడలేదు?
ఆఫర్స్ తగ్గడంతో ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడింది. బాబు ఆలనా పాలనా చూసుకుంటుంటే.. మధ్యలో ఆగిపోయిన భారతీయుడు2 సెట్స్‌పైకి రావడంతో… వెయిట్ తగ్గడానికి కసరత్తులు చేసి ఫూటింగ్లో పాల్గొంది కాజల్. ఆ తర్వాత ఛాన్సుల వేటలో… అనిల్ రావిపూడి భగవంత కేసరిలో సీనియర్ హీరో బాలయ్య పక్కన ఛాన్స్ దక్కించుకుంది కాజల్.
పెళ్లి తర్వాత ఫేసులో ఆంటీ కళ రావడంతో.. యంగ్ హీరోలు.. స్టార్స్ కాజల్‌ను పట్టించుకోలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చిన భగవంత్ కేసరి ఆఫర్ కాజల్‌కు ఉపయోగపడలేదు. సినిమా హిట్టయినా.. ఈ అమ్మడికి క్రేజ్‌తోపాటు ఛాన్సులు రాలేదు. బాలయ్య.. నాగార్జునతో జత కట్టడంతో.. ఆటోమెటిక్‌గా సీనియర్ హీరోయిన్ ప్రమోషన్ వచ్చేసింది. నాగార్జున, వెంకటేశ్‌తో నటిస్తే… సీనియర్స్ అందర్నీ కవర్ చేసినట్టే. కానీ ఈ ఇద్దరు సీనియర్స్… కాజల్‌ను పట్టించుకోవట్లేదు. చేతిలో ఉన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ సక్సెస్ అయితే.. మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూడాలి .