రీషూట్ లేదు.. టైం వేస్ట్ లేదు.. 2026 సంక్రాంతికి “గరుడ” బొమ్మ పడాల్సిందే
రాజమౌళితో సినిమా అంటే అంత ఈజీగా ఉండదు. ఆ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎవరికి తెలియదు. రాజమౌళికి కూడా తన సినిమా ఎప్పుడు కంప్లీట్ చేయాలో క్లారిటీ ఉండదు. సినిమా నచ్చేవరకు సినిమాను రీ షూట్ చేస్తూనే ఉంటాడు.

రాజమౌళితో సినిమా అంటే అంత ఈజీగా ఉండదు. ఆ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎవరికి తెలియదు. రాజమౌళికి కూడా తన సినిమా ఎప్పుడు కంప్లీట్ చేయాలో క్లారిటీ ఉండదు. సినిమా నచ్చేవరకు సినిమాను రీ షూట్ చేస్తూనే ఉంటాడు. అవసరమైతే షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని సీన్స్ యాడ్ చేయడానికి కూడా వెనకాడడు. ఇక సగం షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ షూటింగ్ మొత్తం క్యాన్సిల్ చేసి, మళ్ళీ సినిమా షూటింగ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన ఆశ్చర్యం లేదు.
ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇటువంటి కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు. తన సినిమా ఎలాగైనా హిట్టు కొట్టాలనుకునే రాజమౌళి.. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తనకు ఏ విధంగా నచ్చితే, ఆ విధంగా షూటింగ్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ఇక కొన్ని సీన్స్ అయితే పదేపదే రీషూట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం రాజమౌళి ఈ ప్లానింగ్ లో లేడు అని క్లారిటీ వచ్చేస్తుంది. గతంలో కంటే సినిమాలను చాలా స్పీడ్ గా చేయాలని టార్గెట్ పెట్టుకుంటున్నాడు రాజమౌళి.
ఈ సినిమాను ఎలాగైనా సరే రెండేళ్లలో కంప్లీట్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాడు. బాహుబలి సినిమాకు దాదాపు ఐదేళ్లపాటు తీసుకున్న రాజమౌళి ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా కూడా అదే టైమ్ తీసుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా టైంలో కొన్ని సీన్స్ రీ షూట్ చేయడంతో సినిమా ఆలస్యం అయింది అనే కామెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా వద్దని టార్గెట్ పెట్టుకుని మరీ పని చేస్తున్నాడు. ఎలాగైనా సరే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిపోవాలని టార్గెట్ పెట్టుకున్నారు.
ముందు ఎనౌన్స్ చేస్తే ఆలస్యం అవుతుందని… సినిమాను… కంప్లీట్ చేసి.. నెలరోజుల తర్వాతనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నాడు ఇక త్వరలోనే సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నాడని టాక్. ఈ సినిమాతో డైరెక్ట్ గా హాలీవుడ్ కు వెళ్ళిపోవాలని టార్గెట్ పెట్టుకున్న రాజమౌళి… ప్రమోషన్స్ విషయంలో ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఈ సినిమాలో తీసుకున్న రాజమౌళి ఆమెకు విలన్ రోల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా మరో హాలీవుడ్ బ్యూటీని తీసుకునే ప్లాన్ లో ఉన్నాడు. అలాగే మహేష్ బాబు తండ్రిగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ నాన్న పటేకర్ ను సెలెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా కోసం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ తో కూడా రాజమౌళి సంప్రదింపులు జరుపుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.