విశ్రాంతి లేదు మిత్రమా… 2000 కోట్ల బాధ్యత…ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విశ్రాంతి లేదంటున్నాడు. సమ్మర్ బ్రేక్ తీసుకోనన్నాడు. పూర్తిగా డ్రాగన్ షూటింగ్ తోనే ఈనెల, వచ్చేనెల పూర్తిగా సెట్స్ కే పరిమితం కాబోతున్నాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విశ్రాంతి లేదంటున్నాడు. సమ్మర్ బ్రేక్ తీసుకోనన్నాడు. పూర్తిగా డ్రాగన్ షూటింగ్ తోనే ఈనెల, వచ్చేనెల పూర్తిగా సెట్స్ కే పరిమితం కాబోతున్నాడు. విచిత్రం ఏంటంటే ఈనెల 22న డ్రాగన్ సెట్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఎంట్రీ సీనే కాదు, క్లైమాక్స్ సీన్ కూడారెడీ చేశాడు. 22 నుంచి 30 వరకు డ్రాగన్ ఎంట్రీ యాక్షన్ సీక్వెన్స్ తో యుద్ద ట్యాంక్ తో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్, మేనెలంతా డ్రాగన్ క్లైమాక్స్ ని ప్లాన్ చేశాడు. విచిత్రం ఏంటంటే రామ్ చరణ్ తో బుచ్చి బాబు తీస్తున్న పెద్ది మూవీ క్లైమాక్స్ కూడా వచ్చేనెల్లోనే తీయబోతున్నారు. ముందుగా క్లైమాక్స్ తీసి, తర్వాత మిగతా టాకీ పార్ట్ తీయటం వెనక గ్రాఫిక్స్ వర్క్ తాలూకు సీక్రెట్ ఉంది. అందుకే ప్రతీ ఏడాది సమ్మర్ కి మహేశ్ బాబు లానే, ఎన్టీఆర్, చరణ్ కూడా ఫ్యామిలీస్ తో వెకేషన్ కి వెళ్లటం లాంటిది ఈ సారి లేదట. సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం ఫ్యామిలీతో వెకేషన్ కివెళ్లాడు… తారక్, చరణ్ మాత్రం వేసవికి బ్రేక్ లేకుండా ముందే క్లైమాక్స్ కోసం కష్టపడబోతున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఏకంగా రాజమౌళి మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన ఫ్యామిలీతో సహా వెకేషన్ కి వెల్లాడు. కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాత్రం సమ్మర్ పూర్తయ్యే వరకు హైద్రబాద్ విడిచిపెట్టేదేలేదని తేల్చాడు. కారణం డ్రాగన్ షూటింగ్… వచ్చే వారం 22న డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నాడు. 10 వేల మందితో ఫైట్ సీన్ ని ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్, యుద్ద ట్యాంక్ ఫైట్ సీన్ తో హీరో ఎంట్రీ ప్లాన్ చేశాడు.
ఇది కేవలం ఎంట్రీ సీన్ మాత్రమే. ఇది కాకుండా మేలో క్లైమాక్స్ ని షూట్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. హెవీ ఫైట్ సీన్స్, తో పాటు గ్రాఫిక్స్ అవసరం ఉండటంతో, ముందు ఈసీన్లు తీసి, తర్వాత మిగతా టాకీ పార్ట్ ప్లాన్ చేశారట. దీని వల్ల టాకీ పార్ట్ షూటింగ్ అయిపోయేలోపు క్లైమాక్స్ సీన్స్ తాలూకు గ్రాఫిక్స్ వర్క్ పూర్తై టైం కలిసొస్తుంది.
అచ్చంగా ఇదే పని రామ్ చరణ్ మూవీ పెద్ది సినిమాకు ఫాలో అయ్యాడు డైరెక్టర్ బుచ్చిబాబు. పెద్ది మూవీ ఆల్రెడీ 20 శాతం షూటింగ్ పూర్తి చేశాడు. ఇందులో 15 శాతం పూర్తిగా క్లైమాక్స్ అని తెలుస్తోంది. అంటే క్లైమాక్స్ ని పెద్ది మూవీ టీం ముందే పూర్తి చేసినట్టు క్లియర్ అవుతోంది.
పాన్ ఇండియా సినిమాలకు ఇది ఇప్పుడు ట్రెండ్ గా మారినట్టుంది. డ్రాగన్ క్లైమాక్స్ ని ముందుగానే మేలో నే షూట్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ లో ప్రీ క్లైమాక్స్ తీయబోతున్నారు. వెకేషన్ నుంచి మహేశ్ రాగానే, ఈ నెల 21 కి ప్రెస్ మీట్, ఆతర్వాత కెన్యాలో ప్రీ క్లైమాక్స్ షూటింగ్… ఆతర్వాత క్లైమాక్స్ ని మే, జూన్ మధ్యలో తెరకెక్కిస్తారని తెలుస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడీ తీస్తున్నఫౌజీ మూవీ కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయ్యింది. ముందే క్లైమాక్స్ ని తీసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ టాకీ పార్ట్ తీస్తున్న మూవీ టీం, ఒక వైపు క్లైమాక్స్ గ్రాఫిక్స్ వర్క్స ని పూర్తిచేస్తూనే, మిగతా టాకీ పార్ట్ తీస్తోంది. ఇక ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి కూడా జులై ఫస్ట్ వీక్ లో ప్లాన్ చేసింది కూడా క్లూమ్యాక్స్ షూటింగ్ నే… సో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీలు వేగంగా పూర్తి కావాలంటే, ముందు క్లైమాక్స్ తీసేయాలి… లేదా హెవీ గ్రాఫిక్స్, ఫైట్ సీన్స్ ఉన్న సీన్లు ముందుగానే తీసేయాలి…. ఇదే అంతా ఫాలో అవుతున్నారు.