Kollywood stories : అరవ స్టోరీస్ కి బాలీవుడ్ లో సూపర్ డిమాండ్
కోలీవుడ్ కథలకు నార్త్ హీరోలు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. స్టోరీ డిఫరెంట్ గా ఉంటే చాలు రెడీ టు డు రీమేక్ అంటున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాపుల్ సూరరై పోట్రు. గోపీనాథ్ జీవిత కథగా తెరకెక్కిన ఈ మూవీ తమిళ్‌లోనే కాదు, తెలుగు వాళ్లను కూడా మెప్పించింది. ఇందులో ఉన్న ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్, యాక్షన్.. ప్రతిదీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అందుకే జాతీయ స్థాయిలో అవార్డ్స్ ని సొంతం చేసుకుంది.
అరవ స్టోరీస్ కి బాలీవుడ్ లో సూపర్ డిమాండ్
ఒకప్పుడు తెలుగు కంటెంట్ ఉత్తరాదిన హాట్‌కేకుల్లా అమ్ముడుపోయేది. ఇప్పుడు టర్మ్ మారింది. కోలీవుడ్ కథలకు బాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. సాలిడ్ హిట్ పడితే చాలు ఆ ప్రాజెక్ట్ ని రీమేక్ చేయడానికి సై అంటున్నారు నార్త్ హీరోలు.
కోలీవుడ్ కథలకు నార్త్ హీరోలు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. స్టోరీ డిఫరెంట్ గా ఉంటే చాలు రెడీ టు డు రీమేక్ అంటున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాపుల్ సూరరై పోట్రు. గోపీనాథ్ జీవిత కథగా తెరకెక్కిన ఈ మూవీ తమిళ్‌లోనే కాదు, తెలుగు వాళ్లను కూడా మెప్పించింది. ఇందులో ఉన్న ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్, యాక్షన్.. ప్రతిదీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అందుకే జాతీయ స్థాయిలో అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తోంది సుధా కొంగరా. అక్షయ్‌కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జవాన్‌తో బాలీవుడ్ లో సక్సెస్ కొట్టి చూపించాడు అట్లీ . సౌత్‌లో సూపర్‌హిట్ అయిన విజయ్ తెరి మూవీ ని నార్త్ లో నిర్మిస్తున్నాడు. వరుణ్‌ధావన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో కీర్తిసురేష్ హీరోయిన్. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ 2024 ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది.
కోలీవుడ్ లో చిన్న సినిమా గా వచ్చి కలెక్షన్స్ వర్షం కురిపించింది లవ్ టుడే. ప్రజెంట్ జెనరేషన్ లో ప్రేమికుల మధ్య సోషల్ మీడియా ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుందో చక్కగా చూపించింది. ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ ని నార్త్ లో జునైద్ ఖాన్ తో రీమేక్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి నటించిన. నవంబర్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక తమిళ్ లో సక్సెస్ అయినా కోమాలి కూడా నార్త్ లో రీమేక్ అవుతోంది. అర్జున్ కపూర్ హీరోగా ఈ సినిమా అక్కడ తెరకెక్కుతోంది. మొత్తానికి ఒక్కప్పుడు తెలుగు కంటెంట్ ఉత్తరాదిన హాట్ కేకుల్లా అమ్ముడుపోయేది. ఇప్పుడు ఆ ఛాన్స్ తమిళ్ సినిమాలకు వచ్చింది. కోలీవుడ్ లో ఓ సినిమా హిట్ అయితే చాలు రెడీ టు డు రీమేక్ అంటున్నారు బాలీవుడ్ హీరోలు. మరి ఈ ఈ వరుసలో ఇంకెన్ని సినిమాలు బాలీవుడ్ బాట పడుతాయో చూడాలి.