2 కాదు మూడంటే మూడినట్టే… 3000 కోట్లు 2030 వరకు…
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తోన్న సినిమా పాన్ వరల్డ్ ని షేక్ చేసే రేంజ్ ఉన్న మూవీనే... బాహుబలి తో నార్త్ మార్కెట్ గోడలు బద్దలు కొట్టిన రాజమౌలి, ఇప్పుడు వరల్డ్ మార్కెట్ అడ్డుగోడల్ని కూల్చబోతున్నాడు. అంతవరకు బానే ఉన్నా, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం కంగారు పడాల్సిన టైం వచ్చినట్టుంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తోన్న సినిమా పాన్ వరల్డ్ ని షేక్ చేసే రేంజ్ ఉన్న మూవీనే… బాహుబలి తో నార్త్ మార్కెట్ గోడలు బద్దలు కొట్టిన రాజమౌలి, ఇప్పుడు వరల్డ్ మార్కెట్ అడ్డుగోడల్ని కూల్చబోతున్నాడు. అంతవరకు బానే ఉన్నా, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం కంగారు పడాల్సిన టైం వచ్చినట్టుంది. ఇంతవరకు రాజమౌళి చేయని ప్రయోగం, సాహసం ఇప్పుడే చేస్తున్నాడని కన్ఫామ్ అయ్యింది. 1000 కోట్ల భారీ బడ్జెట్ పెద్ద మ్యాటర్ కాదు… ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందన్న ప్రచారం పెద్ద విషయం కాదు… అసలు మ్యాటర్ ఏంటంటే 2030 వరకు సూపర్ స్టార్ మహేశ్ బాబుకి అసలు స్వేచ్చే ఉండేలా లేదు. జైల్లో ఖైదీలా సెట్లోనే 5 ఏళ్లు గడపబోతున్నాడు మహేశ్ బాబు. బాహుబలి లాంటి మూవీనే రెండేళ్ళకో భాగం చొప్పున తీశాడు రాజమౌైళి. మరెందుకు మహేశ్ ని 5 ఏళ్లు తన కంట్రోల్ లోపెట్టుకుంటున్నాడు… ఇది గాసిప్ కాదు, ప్రచారానికి ఛాన్సేలేదు.. ఆల్ మోస్ట్ అఫీషియలే… అదే విషయం ఉగాదికి తేలబోతోందా? ఇంటర్నేషనల్ మీడియా ముందు రాజమౌళి మనసు విప్పబోతున్నాడా..? హావేలుక్
ప్రభాస్ 4 ఏళ్లు కష్టపడి రాజమౌలి డైరెక్షన్ లో బాహుబలి1, బాహుబలి 2 చేశాడు. పాన్ఇండియా కింగ్ గా మారాడు. త్రిబుల్ ఆర్ కి మూడేళ్లు తీసుకున్న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్స్ గా మార్చాడు. సో దేశవ్యాప్తంగా మార్కెట్ తోపాటు ఇమేజ్ మారిపోతుందనే, రాజమౌలి సినిమాకోసం, ప్రభాస్, ఎన్టీఆర్, తారక్ ఏళ్లకేళ్లే డేట్లిచ్చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు వంతొచ్చింది.
ఏకంగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ని 1000 కోట్ల తో భారీగా ప్లాన్ చేస్తున్నాడని, రాజమౌలికి ఏకంగా 390 కాల్ షీట్స్ ఇచ్చాడు మహేశ్ బాబు… కాని రాజమౌలి మాత్రం అది సరిపోదంటున్నాడు. ఏకంగా తన ఐదేళ్ల కాలాన్ని ఈ ప్రాజెక్ట్ కే కేటాయించాలని డీల్ కూడా ఫైనల్ చేశాడట. మరీ ఐదేళ్ల వరకు ఈ ప్రాజెక్ట్ తోనే మహేశ్ బాబు బిజీ అవతాడా? అన్నేళ్లు దేనికోసం లాంటి డౌట్లు మామూలుగా రేయిజ్ అవుతాయి
అయితే వాటికి సాలిడ్ రిప్లేలు లీకుల రూపంలో షాకులిస్తున్నాయి.2030 వరకు సూపర్ స్టార్ మహేశ్ బాబు పూర్తిగా రాజమౌలి మూవీకే పరిమితం కావాల్సి వచ్చేలా ఉంది. వర్కింగ్ టైటిల్ గోల్డ్ లేదంటే మహారాజా అని ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఐతే ఇది అంతా అనుకున్నట్టు, లేదంటే ప్రచారం జరుగుతున్నట్టు రెండు భాగాల మూవీ కాదని తేలింది.
కనీసం మూడు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశాడట. ఏడాదిన్నరకొక్క భాగం చొప్పున నాలుగున్నరేళ్లు మేకింగ్ కే సరిపోతుందట. సో సగటునా రెండేళ్లకో మూవీని రిలీజ్ చేస్తూ, ఐదేళ్లు మహేశ్ ని ఈ ప్రాజెక్ట్ కే పరిమితం చేసేలా ఉన్నాడు రాజమౌళి. ఇదంతా ఓకే అనుకున్నాకే, నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు.ఏకంగా ఐదేళ్లు ఒకే ప్రాజెక్ట్ తో ట్రావెల్ అవ్వాలి కాబట్టి, అన్నేళ్ల కష్టం వ్రుధా కాకూడదంటే,సినిమా కు సంబంధించిన ఏ ఒక్క విషయం బయటికి లీక్ కాకుండా నాన్ డిజ్ క్లోజర్ అగ్రిమెంట్ రాసుకున్నారట
బాహుబలికి ముందు వరకు రాజమౌలి అన్నీ సింగిల్ మూవీలే తీశాడు. బాహుబలితోనే పార్ట్ 1, పార్ట్ 2 కల్చర్ ని తీసుకొచ్చాడు. మార్కెట్ ని షేక్ చేశాడు. ఇప్పుడు పార్ట్ 3 కల్చర్ ని కూడా ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తున్నాడు. రక్త చరిత్ర జమానాలోనే పార్ట్1, పార్ట్ 2 కల్చర్ ఉన్నా, దాన్ని కమర్శియల్ గా పాన్ ఇండియా లెవల్లో ట్రెండ్ సెట్ చేసింది రాజమౌళినే. అందుకే మహేశ్ బాబుతో మూడు భాగాల సినిమా తీస్తున్నాడనగానే, ఇది పాన్ వరల్డ్ లెవల్లో ఇండియన్ సినిమా స్థాయిని పెంచే లాంగ్ జర్నీ అని తేలుస్తున్నారు. ఏదేమైనా ఇది రాజమౌళి, మహేశ్ బాబుకి గుడ్ న్యూసే అయినా, తన ఫ్యాన్స్ కి మాత్రం చేదు వార్తే… అభిమాన హీరో తాలూకు మూవీ కోసం వాళ్లు ఇక మీదట ఏళ్లకేళ్లు వేయిట చేయాల్సిందే.