FIRE కాదు.. WILD FIRE ఫైర్ కాదు.. 3 సీన్ల BORE..

పుష్ప 2 నైట్ ప్రివ్యూ పడగానే తోపు తురుమ్ ఖాన్ అన్నారు. యాంటీ ఫ్యాన్స్ లేదంటే మెగా అభిమానులే హేట్రేట్ ని స్ప్రెడ్ చేస్తున్నారన్నారు.. కట్ చేస్తే ఫస్ట్ డే ఈవెనింగ్ షో కల్ల పుష్పరాజ్ తగ్గాడు. టాక్ వీకైంది...పూర్తిగా భిన్నమైన పబ్లిక్ టాక్ మొదలైంది. కేవలం 6 వ షో నుంచే ఈ షాక్ తగలటం మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2024 | 08:55 PMLast Updated on: Dec 06, 2024 | 8:55 PM

Not Fire Wild Fire Not Fire 3 Scenes Of Bore

పుష్ప 2 నైట్ ప్రివ్యూ పడగానే తోపు తురుమ్ ఖాన్ అన్నారు. యాంటీ ఫ్యాన్స్ లేదంటే మెగా అభిమానులే హేట్రేట్ ని స్ప్రెడ్ చేస్తున్నారన్నారు.. కట్ చేస్తే ఫస్ట్ డే ఈవెనింగ్ షో కల్ల పుష్పరాజ్ తగ్గాడు. టాక్ వీకైంది…పూర్తిగా భిన్నమైన పబ్లిక్ టాక్ మొదలైంది. కేవలం 6 వ షో నుంచే ఈ షాక్ తగలటం మొదలైంది. డెఫినెట్ గా ఈ సినిమాకున్న హైప్ కి 100 కోట్లేంటి 200కోట్ల ఓపెనింగ్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు. కాని రెండో రోజు మాత్రం బాక్సాఫీస్ లో బన్నీ మూవీ బక్కెట్ తన్నేస్తుందా? ఈ డౌట్ రావటానికి కథ లేని వ్యథని పుష్ప2 గా తీశారన్న కామెంట్లు, కౌంటర్లు షాక్ ఇస్తున్నాయి. కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, ప్రీక్లైమాక్స్ సీన్లు తప్ప సినిమాలో ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇక వెయ్యి, 1250 పెట్టి ప్రివ్యూలు చూసిన వాల్లకోపానికి హద్దుల్లేవు… సీన్లు సీన్లుగా బాగున్న మూవీ సినిమాగామాత్రం నచ్చట్లేదా? లేదంటే ఇదంతా అసూయతో అన్న మాటలా? అసూయ ఎంతున్నా నిప్పులేందే పొగరాలు…ఇక్కడ ఏకంగా సెగే మొదలైంది…సో ఏది నిజం?

పుష్ప 2 ఫస్ట్ పార్ట్ కంటే వందరెట్లు ఊర మాస్ అన్నాడు బన్నీ. సుకుమార్ అయితే గెడ్డాన్ని రెండు సార్లు పుష్ప స్టైల్లో తిప్పాడు. ప్రివ్యూకి యూఎస్ల ో 3.2 మిలియన్ డాలర్లొచ్చాయి. రిలీజ్ కి ముందు వందకోట్ల వరకు వసూళ్లు అడ్వాన్స్ బుక్కింగ్స్ తోనే దక్కాయి. ఇక ప్రివ్యూ కూడా ఇక నుంచి నాన్ బాహుబలి రికార్డులుండవు… బాహుబలి 2 రికార్డుని కూడా పుష్ప రాజ్ బ్రేక్ చేసినట్టే అన్నారు
పుష్పరాజ్ యాటిట్యూడ్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ కి బాక్సాఫీస్ ఫిదానే అన్నారు. కాని ఏమైంది… కేవలం ఆరు షోలకే సీన్ రివర్స్ .

పుష్ప 2 మూవీలో కథే లేదంటున్నారు. కేవలం మూడంటే మూడు సీన్లు, నాలుగు డైలాగ్స్, రెండు పాటలు వీటికోసమే 1000, లేదంటే 500 పెట్టడం దండగంటున్నారు. యానిమల్ మూడున్నర గంటలుంటే, ఇది మరో యానిమల్ కాబట్టి పుష్ప2 కూడా మూడున్నర గంటల్లో దుమ్ముదులుపుతుందన్నారు

కాని అటు డబ్బు, ఇటు టైం రెండూ వేస్ట్ అయినట్టే అంటూ కామెంట్ల దాడి పెరిగింది. ప్రివ్యూకి వచ్చిన నెగెటీవ్ టాక్ చూస్తే, ఇది యాంటీ ఫ్యాన్స్ లేదంటే మెగా ఫ్యాన్స్ నిరసన అన్నారు. కాని ప్రివ్యూ తర్వాత ఫస్ట్ డే మొదటి ఆటకి, రెండ ఆటకి టాక్ మారింది.మిక్స్ డ్ టాక్ వచ్చింది. సాయంత్రం కల్లా కంప్లీట్ రివర్స్ టాక్ మొదలైంది

కథే లేకుండా కేవలం బిల్డప్ సీన్లతో, ఫైట్లతో చుట్టేస్తే నార్త్ ఇండియన్స్ కి ఎక్కుతుందేమో కాని, సౌత్ లోఫ్లాపే అనేస్తున్నారు. పుష్ప 1 కి ముందు ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత సినిమా హిట్ అయ్యింది. అలానే పుష్ప2 కూడా ముందు నెగెటీవ్ గా మొదలై తర్వాత పాజిటివ్ కిక్ ఇస్తుందనుకుంటున్నారు. కాని రియాలిటీ అందుకు రివర్స్ లో భయంకరంగా ఉంది

పుష్ప 2 ఓపెనింగ్ ఫైట్, క్లైమాక్స్ ఎందుకుపెట్టారో తలా తోకలేకుండా ఉందనే టాక్ కి తోటు కిస్సక్ సాంగ్ లో బన్నీ తేలిపోయాడన్నారు. ఇక సునిల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ పాత్రలని డమ్మీలుగా మార్చి కేవలం హీరో యాటిట్యూడ్, బిల్డప్ సీన్లతో సినిమాను నింపేయటం ఆడియన్స్ కి తలనొప్పిగా మారింది. ఏదో పుష్ప చూసిన జనానికి పుష్ప2 మీద భారీ అంచనాలుంటాయి కాబట్టి, ఆ అంచనాలు అందుకోకే ఇలాంటి టాక్ వస్తోందా అంటే, అలాంటిదేం కనిపించట్లేదు. చాలా వీక్ స్టోరీ, వీక్ నెరేషన్ అన్నా కామెంట్స్ భయంకరంగా పెరిగాయి.

నిజానికి పుష్ప1 లో రివేంజ్ కోసం ఎదురు చూసే ఫాహద్ ఫాజిల్ పాత్ర, పార్ట్ 2 లో విజ్రుంబిస్తే, బన్నీ తేలిపోతాడనే, కావాలని విలన్ పాత్రని డమ్మీగా చేశారనే కామెంట్లు పెరిగాయి. ఇక పుష్ప2 లో సెకండ్ హాప్ మీద అయితే కామెంట్లు తూటాలు పేలుతూనే ఉన్నాయి. మొత్తంగా పుష్ప2 ప్రివ్యూతో హిట్ టాక్ తెచ్చుకుని సాయంత్రం కల్లా ప్లాప్ టాక్ గా మారిపోవటమే కాస్త వింతగా ఉంది. రెండు మూడో రోజుల ఇంకా ఎలాంటి షాకింగ్ టాక్స్ వస్తాయో చూడాలి.