Ramayanam : మహేష్‌, రాజమౌళి కాదు.. ఇదే మొదటి వెయ్యి కోట్ల సినిమా

రామాయణం (Ramayanam) ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు రామాయణంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తునే ఉన్నారు దర్శకులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 15, 2024 | 11:30 AMLast Updated on: May 15, 2024 | 11:30 AM

Not Mahesh Rajamouli This Is The First Thousand Crore Film

 

 

 

రామాయణం (Ramayanam) ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు రామాయణంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తునే ఉన్నారు దర్శకులు. చివరగా ఆదిపురుష్ రాగా.. ప్రస్తుతం బాలీవుడ్‌ (Bollywood) లో రామాయణం కథతో మరో సినిమా తెరకెక్కుతోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో (Kannada Star Hero) యష్ (Yash) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో మొదలైంది. ఆన్ సెట్స్ నుంచి రణ్‌బీర్, సాయి పల్లవి ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే.. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని ముందు నుంచి ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న చిత్రంగా రికార్డు సృష్టించనుందని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 830 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు ఇంత భారీగా ఖర్చు చేయలేదు. కానీ నెక్స్ట్ మహేష్‌ బాబుతో చేయబోతున్న సినిమాను వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి.

దీంతో.. ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) రికార్డ్ సృష్టించేందుకు రెడీ అవుతోంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతకంటే ముందే.. రామాయణం బడ్జెట్ హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా తొలి భాగానికే దాదాపు 830 కోట్లు అని అంటున్నారు. సినిమా రిలీజ్ వరకు వెయ్యి కోట్లు క్రాస్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇక మూడు భాగాలు కలిపి ఎంత ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అత్యున్నత సాంకేతిక హంగులతో విజువల్‌ ఫీస్ట్‌లా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మరి ఈసారి రామాయణం ఎలా ఉంటుందో చూడాలి.