Happy Birthday : త్రివిక్రమ్ మాటే కాదు జీవితమూ స్ఫూర్తే.. ఎవరికీ తెలియని రహస్యాలు
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ. న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ సాధించిన ఆయన.. త్రివిక్రమ్ పేరుతో రచనలు ప్రారంభించాడు. కెరీర్ ప్రారంభంలో పోసాని కృష్ణ మురళి, ముత్యాల సుబ్బయ్య ,ఈవివి సత్యనారాయణ, బి.గోపాల్ లాంటి దిగ్గజాల దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేసాడు. 1992లో వేణు హీరోగా వచ్చిన స్వయంవరం అనే మూవీతో డైలాగ్ రైటర్ (Dialogue Writer) గా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.

Not only Trivikrams words but also life inspires Secrets that no one knows
హ్యాపీ బర్త్ ( Happy Birthday) డే గురూజీ..
మాటకు ఆయుధం కంటే పదును ఉంటుందని.. ఆ మాట కోట్ల మనసులను కదిలిస్తుందని.. అసలు తెలుగులో ప్రాస అనేది ఉంటుందని సామాన్యులకు మళ్లీ గుర్తు చేసిన రైటర్, డైరెక్టర్.. కాదు కాదు హీరో త్రివిక్రమ్. రామాయణం, మహాభారతాన్ని.. ఆ పురాణాల అర్థాన్ని.. అమ్మమ్మ కథ అందంగా.. అమ్మ ప్రేమ అంత స్వచ్ఛంగా.. నాన్న బాధ్యతంతా శ్రేష్టంగా.. ఇంకా చెప్పాలంటే స్వచ్ఛంగా ప్రతీ మనసుకు చేరవేసినవాడు వన్ అండ్ ఓన్లీ త్రివిక్రమ్. మనసు కూడా హాయిగా నవ్వుకునేదే నిజమైన హాస్యం అని నమ్మే త్రివిక్రమ్.. తన మాటలో, తను రాసిన మాటలో చిన్న బూతు దొర్లకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఈ జనరేషన్ జంధ్యాల ఈయన.
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ. న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ సాధించిన ఆయన.. త్రివిక్రమ్ పేరుతో రచనలు ప్రారంభించాడు. కెరీర్ ప్రారంభంలో పోసాని కృష్ణ మురళి, ముత్యాల సుబ్బయ్య ,ఈవివి సత్యనారాయణ, బి.గోపాల్ లాంటి దిగ్గజాల దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేసాడు. 1992లో వేణు హీరోగా వచ్చిన స్వయంవరం అనే మూవీతో డైలాగ్ రైటర్ (Dialogue Writer) గా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ సినిమా విజయానికి తివిక్రమ్ మాటలే ప్రధాన కారణం. అక్కడ నుంచి ఆయన మాటల గిలిగింతల ప్రవాహంలో తెలుగు సినిమాతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ప్రవహిస్తూనే ఉన్నారు. చిరునవ్వుతో, మల్లీశ్వరి, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ , జై చిరంజీవ, మన్మధుడు ఇలా ఎన్నో సినిమాలకు తన మార్క్ అద్ది లైఫ్లాంగ్ గుర్తుండేలా చేశాడు.
వెండితెర మీద ఆయన ప్రయాణం కేవలం మాటలతోనే ఆగకుండా దర్శకుడిగా మారాడు. 2002లో తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే అనే సినిమాతో డైరెక్టర్ గా ఆయన ప్రయాణం మొదలైంది. అక్కడ నుంచి త్రివిక్రమ్ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ అఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, అల వైకుంఠ పురంలో ఇలా ఎన్నో సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకుల కుటుంబ సభ్యుడుగా త్రివిక్రమ్ మారాడు. ఆయన సినిమా రిజల్ట్ తేడా కొట్టొచ్చు.. ఆయన కలం మాత్రం ఎప్పుడు డిజప్పాయింట్ చేయలేదు. థట్ ఈజ్ త్రివిక్రమ్. చివరిగా ఒక్క మాట. కొందరి మాటలు వింటే మనసు మురిసి పోతుంది. మరి కొందరి మాటలు వింటే ముచ్చటేస్తుంది.
నువ్ చెప్తే ఏంటి మనోడు అనిపిస్తుంది. అన్న, నాన్న.. తోబుట్టువు, చివరికి భార్యలో వినిపించే మాటలు నువ్ ఎప్పుడో చెప్పినవే కదా అనిపిస్తుంది. నిన్ను మాటల మాంత్రికుడంటారు. మంత్రాలేంటి స్వామి నీ మాటల్లో మన గురించి వినిపిస్తే ! అత్త అంటే అమ్మ అని చెప్పావ్.. చరిత్ర గుర్తించని పాత్ర నాన్న అని గుర్తుచేశావ్.. సాటి మనిషికి సాయం చేసే ప్రతీ ఒక్కడూ దేవుడే అన్నావ్. మాట మనిషిని మారుస్తుందని.. మాటకున్న శక్తి ఏ స్థాయిలో ఉంటుందోనని నీ వల్లే తెలిసింది మాకు ! అందుకే సామీ.. నువ్ శిఖరం.. మా గుండెల్లో.. ఈ చరిత్రలో.. హ్యాపీ బర్త్ డే గురూజీ..