Kalki : కల్కి2 లో చంద్రముఖి

ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో జ్ఞానం ఉన్న ఒక పర్సన్. ఎలాంటి ప్రశ్న అడిగినా అనర్గళంగా మాట్లాడగల సత్తా ఉన్న అమ్మాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 7, 2024 | 11:25 AMLast Updated on: Jul 07, 2024 | 11:25 AM

Not To Mention Trans Woman Chandramukhi

 

 

 

ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో జ్ఞానం ఉన్న ఒక పర్సన్. ఎలాంటి ప్రశ్న అడిగినా అనర్గళంగా మాట్లాడగల సత్తా ఉన్న అమ్మాయి. అలాంటి ఆమె కల్కిలో ఒక భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. “నాకు కల్కి మూవీ నుంచి ఒక మెయిల్ కూడా వచ్చింది. నేను నిజం చెప్తున్నానా, అబద్దం చెప్తున్నానా అంటూ జనాల్లో ఒక ప్రశ్న అనేది వస్తుంది. అందుకే నా కల్కి మూవీ ఆఫర్ లెటర్ కూడా అందరికీ చూపిస్తున్న. సినిమాలో నాకు సీన్ అంటూ ఏమీ లేదు.

నేను కల్కి కోసం పని చేశా. ఒక సీన్ కోసం అన్ని జెండర్స్ వాళ్ళను చూపించాలని నాగ్ అశ్విన్ అనుకున్నారు. వారం రోజులు కల్కి మూవీ షూటింగ్ కూడా చేశా. నేను ఎంత డిమాండ్ చేసానో అంత పేమెంట్ కూడా ఇచ్చారు. కల్కి అంటే అదేమీ చిన్న బ్యానర్ కాదు. పెద్ద బ్యానర్ కాబట్టి అందులో ఒక భాగం కావడం చాల ఆనందంగా ఉంది. కానీ స్క్రీన్ మీద నేను కల్కిలో కనిపించలేదు. క్లోజప్ షాట్స్ తీశారు వర్షం వస్తున్నప్పుడు. కల్కి 2 లో ఉండొచ్చు అని అనుకుంటున్నా కానీ పూర్తిగా ఇంకా తెలీదు.

కానీ కల్కి షూటింగ్ లో అందరూ కూడా మమ్మల్ని చాలా హ్యాపీగా ఎలాంటి భేదభావం లేకుండా చూసుకున్నారు.” అంటూ చెప్పింది చంద్రముఖి. “కొంతమంది ఆడపిల్ల గెటప్స్‌ని వృత్తిగా ఎంచుకుని డబ్బుకోసం ట్రాన్స్ జెండర్‌గా మారుతున్నారు. ఆడపిల్ల గెటప్ వేస్తేనే ఇన్ని డబ్బులు వస్తున్నాయి.. పూర్తిగా ఆడపిల్లగా మారిపోతే ఇంకా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో ట్రాన్స్ జెండర్స్‌గా మారుతున్నారు.” అని కూడా చెప్పింది చంద్రముఖి.