రెండు కాదు మూడు.. ఆరేళ్ళు మహేష్ పాస్పోర్ట్ జక్కన్న దగ్గరే..

రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఊపేస్తోంది. ఈ సినిమా గురించి ఏం న్యూస్ వచ్చిన సరే జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2025 | 05:10 PMLast Updated on: Feb 06, 2025 | 5:10 PM

Not Two Three Maheshs Passport Is With Jakanna For Six Years

రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఊపేస్తోంది. ఈ సినిమా గురించి ఏం న్యూస్ వచ్చిన సరే జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాజమౌళి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న… ఈ ప్రాజెక్టు విషయంలో మహేష్ బాబు కూడా అదే రేంజ్ లో కష్టపడుతున్నాడు. సినిమా షూటింగ్ ఇప్పటికే కెన్యాలో స్టార్ట్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కెన్యా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే అక్కడ షూటింగ్ లొకేషన్స్ కూడా రాజమౌళి ఫైనల్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఆఫీసులో అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. రాజమౌళి పెట్టిన పోస్ట్ కి ప్రియాంక చోప్రా ‘ఫైనల్లీ’ అంటూ రిప్లై ఇవ్వడంతో, కచ్చితంగా ఆమె సినిమాలో నటించడం ఖాయం అని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరిని తీసుకుంటారు అనేదానిపై క్లారిటీ లేకపోయినా… మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరును పరిశీలిస్తుంది మూవీ యూనిట్.

ఇక ప్రియాంక చోప్రాతో పాటుగా మరో హాలీవుడ్ బ్యూటీని కూడా ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా మరో విషయం బయటకు వచ్చింది. రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ 2027 సంక్రాంతి నాటికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ముందు నుంచి ప్రచారం ఉంది. అయితే ఈ కథ చాలా పెద్దదని, ఈ కథను పూర్తిగా ఒకే పార్ట్ లో రాజమౌళి చూపించడం కష్టం అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ కథను మూడు భాగాలుగా రాజమౌళి తీసేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మొదటి భాగం షూటింగ్ పూర్తికాగానే రెండో భాగం షూటింగ్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఎక్కువ షూటింగ్ చేయకుండా ఫస్ట్ పార్ట్ ను చాలా వేగంగా రిలీజ్ చేసేసి, ఆ తర్వాత సెకండ్ పార్ట్ వైపు ఫోకస్ పెట్టాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక మహేష్ బాబు మూడు పార్ట్ లకు డేట్లు ఇస్తాడా అనేదానిపై కూడా క్లారిటీ లేదు. గత కొన్ని రోజులుగా హిట్ లు లేక ఇబ్బంది పడుతున్న మహేష్ బాబు… ఈ సినిమా విషయంలో ఎలాంటి ఫోకస్ పెడతాడు అనేది చూడాలి. రాజమౌళి ఏ హీరో తో సినిమా చేసిన సరే ఆ హీరోని కనీసం ఐదేళ్ళు లాక్ చేస్తూ ఉంటాడు. దీనితో మహేష్ బాబు కూడా ఐదేళ్లపాటు రాజమౌళికి టైం ఇచ్చే ఛాన్స్ ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, రాజమౌళి విజన్ గురించి ఐడియా ఉన్నవాళ్లు మాత్రం ఇది నిజమే అనుకుంటున్నారు.