NBK : బోయపాటి తో కాదా… హరీష్ శంకర్ తో నా…
నందమూరి నటసింహం (Nandamuri Natasimham) బాలకృష్ణ (Balakrishna) ఎన్బీకె 109 (NBK 109) ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. బాబీ (Bobby) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది.

Not with Boyapati...with Harish Shankar but me...
నందమూరి నటసింహం (Nandamuri Natasimham) బాలకృష్ణ (Balakrishna) ఎన్బీకె 109 (NBK 109) ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. బాబీ (Bobby) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో క్లారిటీ రావడం లేదు. గత కొద్ది రోజులుగా బోయపాటి శ్రీనుతో అఖండ2 ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బోయపాటి స్క్రిప్టు వర్క్‌తో బిజీగా ఉన్నాడని.. త్వరలోనే అఖండ2 అనౌన్స్మెంట్ ఉంటుందని.. దసరా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. కానీ ఇప్పుడు బాలయ్యతో లైన్లోకి హరీష్ శంకర్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాడు హరీష్ శంకర్. అయితే ఎలక్షన్స్ కారణంగా ఉస్తాద్ కాస్త డిలే అవడంతో.. ఈలోపు రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు హరీష్. ఆ తర్వాత ఉస్తాద్ పూర్తి చేసి బాలయ్యతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఫిల్మ్‌వర్గాల సమాచారం ప్రకారం అఖండ 2 కంటే ముందే హరీశ్‌శంకర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇటీవలే బాలకృష్ణకి హరీశ్‌శంకర్ ఓ కథ వినిపించారని, బాలయ్య సూచనల మేరకు కథలో చిన్నచిన్న మార్పులు చేసే పనిలో ఉన్నట్టుగా చెబుతున్నారు
ఎన్నికల వేడి తగ్గాక, ఎన్బీకె 109 షూటింగ్‌లోకి జాయిన్ అవనున్నారు బాలకృష్ణ. ఆ సినిమా పూర్తి చేసిన తర్వాత హరీష్ శంకర్ సినిమా మొదలవుతుందని టాక్. ఇదే నిజమైతే.. ఎన్బీకె 110 ప్రాజెక్ట్ అఖండ 2 కాకుండా.. హరీష్ శంకర్ సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ క్రేజీ కాంబో సెట్ అయితే మాత్రం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.