Kalki tenets nil : కల్కి కి టికెట్స్ అయిపోయాయి
ఇప్పుడు భారతీయ సినీ ప్రేమికులు ఛత్రపతి సినిమాలోని ప్రభాస్ డైలాగ్ ని కొంచం అటు ఇటుగా చెప్పుకుంటున్నారు. ఎంతో ఆవేశంతో ఒక్క అడుగు ఒక్క అడుగు అని అంటాడు.

Now Indian movie lovers are talking about Prabhas dialogue from Chhatrapati movie.
ఇప్పుడు భారతీయ సినీ ప్రేమికులు ఛత్రపతి సినిమాలోని ప్రభాస్ డైలాగ్ ని కొంచం అటు ఇటుగా చెప్పుకుంటున్నారు. ఎంతో ఆవేశంతో ఒక్క అడుగు ఒక్క అడుగు అని అంటాడు. ఇప్పుడు అందరు ఒక్క వారం ఒక్క వారం అని అంటున్నారు. ఎందుకంటే జూన్ 27 న ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కే మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ కల్కి 2898 ad విడుదల కాబోతుంది. రిలీజ్ కి ముందే ఎన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న కల్కి తాజాగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.
కల్కి మన కంటే ముందే ఓవర్ సీస్ లో విడుదల కానుంది. అంటే జూన్ 26 న అక్కడి ప్రేక్షకుల్ని పలకరించనుంది.దీంతో ఓవర్ సీస్ డార్లింగ్ అభిమానుల్లో సినీ ప్రేక్షకుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది.పైగా ఎప్పుడెప్పుడు జూన్ 26 వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ 55,555 టికెట్స్ క్లోజ్ అయ్యాయి. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డుగా భావించవచ్చు. దీంతో కల్కి రేంజ్ ఏంటో మరోసారి అందరకి తెలిసొచ్చింది.
అదే విధంగా జూన్ 26 న చూడాలంటే ఓవర్ సీస్ ప్రేక్షకులకి కష్టమే. ప్రత్యంగిరా, ఏ ఏ క్రియేషన్స్ విడుదల చేస్తుంది. తెలుగు నాట కూడా కల్కి సందడి మొదలయ్యింది. ఇటీవల భల్లాలదేవ రానా వ్యాఖ్యాతగా ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునేదర్శకుడు నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు. అందరు కూడా కల్కి లో నటించడం తమ అదృష్టమని ఖచ్చితంగా ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తారని చెప్పారు.ఇక మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ కల్కి అని తెలుస్తుంది. వైజయంతి మూవీస్ పై అశ్వనీ దత్ 600 కోట్లతో నిర్మిస్తున్నాడు.