500 కోట్లు+ 500 కోట్లు.. ఒకే సారి 2 పాన్ ఇండియా సినిమాలు..

రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మళ్లీ 4 సారి మీటయ్యాడు. అంతే ఇక సలార్ 2 కి సర్వం సిద్దమంటున్నారు. కాని సీన్ చూస్తుంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాత్రం ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడన్న వార్తలు మొదలయ్యాయి. ఇంతకి ఏమౌతోంది? వార్ 2 షూటింగ్ జనవరి 10 లోగా పూర్తవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2024 | 07:36 PMLast Updated on: Dec 13, 2024 | 7:36 PM

Ntr And Prabhas Busy With Pan India Movies

రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మళ్లీ 4 సారి మీటయ్యాడు. అంతే ఇక సలార్ 2 కి సర్వం సిద్దమంటున్నారు. కాని సీన్ చూస్తుంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాత్రం ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడన్న వార్తలు మొదలయ్యాయి. ఇంతకి ఏమౌతోంది? వార్ 2 షూటింగ్ జనవరి 10 లోగా పూర్తవుతుంది. ఫిబ్రవరిలో డ్రాగన్ షూటింగ్ కి షెడ్యూల్ కూడా ప్లానింగ్ జరిగిపోయింది. మరి ఇంతలో ప్రభాస్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలవటం అంటే ఇది దేనికి సంకేతం… ప్రిపరేషన్లు అన్నీ ఎన్టీర్ మూవీ డ్రాగన్ కోసం జరుగుతున్నాయి. కాని ప్రభాస్ ని 30 రోజుల డ్యూరేషన్ లో రెండో సారి కలిశాడు ప్రశాంత్ నీల్… ఇక్కడే ఎక్కడలేని డౌట్లు పెరిగాయి. ఐతే ఎన్టీఆర్ డ్రాగన్ పనుల్ని ఆల్రెడీ మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది… రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి సలార్ 2 తాలూకు సాలిడ్ అప్ డేట్ రెడీ అవుతోంది… ఇంతకి పాన్ ఇండియా లెవల్లో ఎవరూ చేయని సాహసం మొదటి సారిగా ప్రశాంత్ నీల్ చేస్తున్నాడంటున్నారు.. ఏంటది?

రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఇద్దరితో సినిమాలంటూ ప్రశాంత్ నీల్ మీద కొన్ని వారాలుగా గుసగుసలొచ్చాయి. కట్ చేస్తే దేవర తర్వాత వార్ 2 షూటింగ్ తో తారక్ బిజీ అయ్యాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ తో వార్ 2 క్లైమాక్స్ ని షూట్ చేస్తోంది ఫిల్మ్ టీం. ఇకడిసెంబర్ లో వార్ 2 షూటింగ్ కి గుమ్మడి కాయ కొడతారు కాబట్టి, ఫిబ్రవరి నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది

డ్రాగన్ కోసం ఎన్టీఆర్ పెద్దగా తన లుక్ కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదనటంతో, తను కూడా రిలాక్స్ డ్ గా ఉన్నారన్నారు. కాని వార్ 2 షూటింగ్ చేస్తూనే తారక్ తన మజిల్స్ పెంచుతూ కొంత వరకు తన కొత్త లుక్ కోసం కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది. అంటే వార్ 2 షూటింగ్ అయిపోయాక కేవలం 20 రోజుల రెస్ట్ మాత్రమే తీసుకునే డ్రాగన్ సెట్స్ లో అడుగుపెడతాడనే మాటలే నిజమయ్యేలా ఉన్నాయి

తను వార్ 2 షూటింగ్ కి , డ్రాగన్ షూటింగ్ కి మధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకునేలా లేడు. అలాంటప్పుడు ప్రబాస్ ని ప్రశాంత్ నీల్ మల్లీ కలవటం వెనక ఆంతర్యం ఏంటో చాలా మందికి అర్ధం కాలేదు. ఐతే ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ నిర్ణయం ఏదో తీసుకున్నాడని తెలుస్తోంది.

అదే ఒకే సారి రెండు పాన్ ఇండియా మూవీలను పట్టాలెక్కించటం… నిజంగానే ఇది జరిగేలా ఉంది. డ్రాగన్ తో ప్యార్ లల్ గా సలార్ 2 కూడా పట్టాలెక్కబోతోంది. ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కూడా ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాల షూటింగ్స్ ని ప్లాన్ చేయలేదు. అదే ఇప్పుడు జరగబోతోంది

కాని 500 కోట్ల డ్రాగన్, 500 కోట్లతో సలార్ 2 ఒకేసారి ప్లాన్ చేయటం అంటే వెయ్యికోట్ల బడ్జెట్ ని రిస్క్ లో పెట్టడమే.. కాని సలార్ 2 స్క్రిప్ట్ మాత్రమే కాదు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. డ్రాగన్ ఏకంగా లాంచై షూటింగ్ కూడా మొదలైంది. ఐతే రెండీంటిని ఒకేసారి పట్టాలెక్కించాలనుకోవటం కాస్త ప్రాక్టికల్ గా కష్టసాధ్యం.. కాని 20శాతం సలార్ 2 ని మొదటి భాగం తీస్తున్నప్పుడే తీయటం, డ్రాగన్ ని 6 నెలల్లోనే టాకీ పార్ట్ పూర్తిచేసేలా ప్లాన్ చేయటంతో, 2025 ఫిబ్రవరిలో డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్, మార్చ్ నుంచి సలార్ 2 షూటింగ్ షురూ అవటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యిందట. సంక్రాంతికి సలార్ 2 షూటింగ్ లాంచ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.