ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..? 2000 కామెంట్స్ తో రచ్చ రచ్చ..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి రక్తం ఉడికిపోయేలా ఉంది... ఆల్రెడీ మండిపోయున్నారని సోషల్ మీడియాలో వాళ్ల కామెంట్ల దాడితో తేలింది.. ఇక మిగిలింది రెబల్ స్టార్ ఫ్యాన్స్.. వాల్లు కూడా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్యని, తన కొత్త మూవీ కంగువని తగులుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2024 | 02:09 PMLast Updated on: Oct 26, 2024 | 2:09 PM

Ntr And Prabhas Fans On Fire

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి రక్తం ఉడికిపోయేలా ఉంది… ఆల్రెడీ మండిపోయున్నారని సోషల్ మీడియాలో వాళ్ల కామెంట్ల దాడితో తేలింది.. ఇక మిగిలింది రెబల్ స్టార్ ఫ్యాన్స్.. వాల్లు కూడా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్యని, తన కొత్త మూవీ కంగువని తగులుకున్నారు. కామెంట్లు, ట్రోలింగ్ తో పిచ్చెక్కిస్తున్నారు. కంగువా తెలుగు ఈవెంట్ కి రెండువేల మంది సూర్య కోసం ఫ్యాన్స్ వస్తే, ఇక్కడ తనకి అంత ఫాలోయింగ్ ఉందా అని చాలా మందిషాక్ అయ్యారు. కాని పదివేల కామెంట్లు, ట్రోలింగ్స్ మించేలా సోషల్ మీడియాలో కంగువ మీద ప్రశ్నల దాడి మొదలైంది. ఆలెక్కన ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎటాక్ ఏరేంజ్ లో ఉందో ఊహించొచ్చు… ఇక్కడ ఈ మొత్తం అంశంలో వివాదం అంటే రెండు వేల కోట్ల కామెంట్లే… ఈ కామెంట్లు పాన్ ఇండియా లెవల్లో సూర్య కంగువా మీద తారక్, ప్రభాస్ ఫ్యాన్స్ కన్నెర్రచేసేలా చేస్తున్నాయి.. ఒక్కసారి కూడా పాన్ ఇండియా హిట్ కొట్టని సూర్య ఇప్పుడు దేవర, సలార్, కల్కీ ని తక్కువ చేసే మాట వదిలితే ఎవరు ఊరుకుంటారు.. అందుకే ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారా?

కంగువా రెండు వేల కోట్ల వసూళ్లు రాబట్టేసినిమా అన్నాడు, ఆసినిమా ప్రొడ్యూసర్ గ్నాన్ వేల్… ఇది కోలీవుడ్ లోనే మిస్ ఫైర్ అయిన మాట… ఎందుకంటే ఇంతవరకు వెయ్యికోట్ల వసూళ్లు తెలుగు, కన్నడ, హిందీ మూవీలకు తప్ప, తమిళ,మలయాల సినిమాలకు రాలేదు. ఆ రేంజ్ ని అరవ మూవీలు అందుకోలేదు.. అందుకే అరవ జనమే కంగువ గురించి గ్నాన్ వేల్ చేసిన కామెంట్స్ మీద జోకులేసుకుంటున్నారు.

ఇలాంటి టైంలో సూర్య ఇచ్చిన స్టేట్ మెంట్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి రెబల్ స్టార్ ఫ్యాన్స్ వరకు కోట్లల్లో గుండెలని మండేలా చేసింది. రక్తం మరిగి, వాళ్లంతా కామెంట్లు, ట్రోలింగ్స్ తో రెస్పాండ్ అయ్యేలా చేసింది…తమిళ హీరో సూర్య మంచి నటుడే.. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాని అరవ అడ్డాలోనే నటుడిగా తప్ప మాస్ హీరోగా రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఏదో సింగం లాంటి సీరీస్ తప్ప మరే మాస్ మూవీతో తను హిట్ మెట్టెక్కలేదు… జై భీమ్, ఆకాశమే నీ హద్దురా లాంటి ప్రయోగాలతో మంచి నటుడనిపించుకున్నాడు. అంతవరకే…

కాని మాస్ లో ఫ్యాన్ బేస్ ఓరేంజ్ లో రావటం తేలిక కాదు.. అదే జరగలేదు. ఇంతవరకు పాన్ ఇండియా హిట్ పడలేదు. వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టే సీన్ తన మూవీకే కాదు, తమిళ్ లో ఏసినిమాకు రాలేదు… అలాంటప్పుడు ఏకంగా బాహుబలి 2, సలార్, కల్కీ, దేవర, త్రిబుల్ ఆర్ ఇలా వీటన్నీంటిని కంగువా మించిపోతుందన్న స్టేట్ మెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ గా రిఫ్లెక్ట్ అవుతోంది

సరే ప్రొడ్యూర్ కంగువా మూవీ భారీగా వసూళ్లు రాబట్టాలని, దంగల్ తాలూకు 2 వేల వసూళ్ల రికార్డుని ఈ సినిమా మించుతుందన్నాడంటే అర్ధం చేసుకోవచ్చు… పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చు.. కాని ఈ కామెంట్స్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరిగాక కూడా, సూర్య తనకి ఎదురైన ప్రశ్నలకు చాలా న్యాక్ గా ఆన్సర్ ఇవ్వటం తారక్, ప్రభాస్ ఫ్యాన్స్ కి మండేలా చేసింది..

ప్రొడ్యూసర్ మాటలకు మీరేమంటారని తెలుగు మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా సూర్య కూడా… అంత ఎక్కవ కలెక్షన్లు రావాలని కోరుకోవడంలో తప్పు ఏముంది? పెద్ద టార్గెట్లను పెట్టుకుంటే నష్టం ఏమీ లేదు కదా అని అన్నాడు. బాహుబలి, కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాలను ప్రేమతోనే తీసి ఉంటారు. డబ్బు కోసం తీసి ఉండరని అనుకుంటున్నా అనేశాడు. ఇక తాము కూడా అదే ఆలోచనలో ఉన్నారని, కలెక్షన్లు తమకు కూడా అలాగే వస్తాయని ఆశించాడు.. కొంతవరకు ఈ మాటల్లో పాజిటివిటే ఉండొచ్చు..

కాని బాహుబలి 2 తాకూలు 1850 కోట్ల వసూళ్ల వెనక బాహుబలి 1 తాలూకకు 550 కోట్ల సక్సస్ ఉంది.. కేజీయఫ్ తర్వాతే కేజీయఫ్ 2 వచ్చి 1250 కోట్లు రాబట్టింది. తారక్, ఎన్టీఆర్ పడ్డ ఉమ్మడి కష్టానికి రాజమౌళి విజన్ తోడై 1350 కోట్ల వసూళ్లు, నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చింది. ఇక సలార్ 750 కోట్ల వెనకు ప్రభాస్ స్టామినా ఉంటే, కల్కీ కి కథ కూడా తోడై 1200 కోట్ల వసూళ్లొచ్చాయి. త్రిబుల్ ఆర్ లో కష్టం తర్వాత, దేవరగా సోలోగా వచ్చి ఎన్టీఆర్ దుమ్ముదులిపాడు.. సో ఎలా చూసినా తారక్, ప్రభాస్ లాంటి స్టార్లు ఎంతో కష్టపడి, ఎన్నో రిస్క్ లు తీసుకున్నాక కాని వందలకోట్ల లెక్కలు, వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టేలా మారాయి.

అలాంటిది కంగువా అని ఓ మూవీ తీసి, 2వేల కోట్ల వసూల్లని బ్రేక్ చేస్తామనటం ఓవర్ కాన్ఫిడెన్సే అవుతుంది. అలాని ఏ మూవీ దంగల్ రికార్డుని బ్రేక్ చేయలేవనలేం. కాని దానికి తగ్గ ఎఫర్ట్స్ , కంటెంట్ మూవీలో ఉండాలి… అది రిలీజ్ అయ్యాకే తేలుతుంది. కీనీసం ట్రైలర్ , సాంగ్స్ వచ్చే రెస్పాన్స్ తో అయినా అది తేలుతుంది. కాని ఇక్కడ అదేంలేకుండానే, గాల్లో మేడలు కట్టడం కాదు, ఎన్టీఆర్, ప్రభాస్ మూవీల ప్రస్తావన తెచ్చి వాటికే సాధ్యమైనప్పుడు, తమకెందుకు కాదు అంటూనే, టార్గెట్ మాత్రం దంగల్ తాలూకు 2 వేల కోట్లన్నారు.. అక్కడే ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ కి తమ హీరో రికార్డులని, సినిమాలను పొగుడుతున్నట్టే చేసి, పరోక్షంగా తక్కువ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారనే కామెంట్స్ పెరిగాయి.