పాన్ ఇండియా రిలీజ్ అంటేనే హీరోలకి, ఐఐటీ ఎంట్రెన్స్ టెస్ట్ లాంటింది.. దేశ వ్యాప్తంగా మొత్తం మార్కెట్ తో పోటీ పడాలి.. ఒక్కసారి పాన్ ఇండియా స్టార్ అయితే, ఇక ప్రతీ మూవీతో పాన్ ఇండియా హీరో అని ప్రూవ్ చేసుకోవాలి.. ఆవిషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సాహోతో స్లోగా, గట్టెక్కే ప్రయత్నం చేశాడు. సలార్, కల్కీ హిట్ తో డిస్టింక్షన్ లోపాన్ ఇండియా పరిక్షలో ర్యాంకర్ గా మారాడు. తర్వాత వంతు ఎన్టీఆర్ ది అన్నారు.. తను రాజమౌళి సాయం లేకుండానే దేవరతో పాన్ ఇండియా లెవల్లో పరిక్ష పాస్ అవటం కాదు, ర్యాంక్ హోల్డర్ అనిపించుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు కన్నడ స్టార్ యష్ వంతొచ్చింది. అంతకంటే ముందే గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ కి అగ్ని పరిక్ష మొదలైంది. ట్రైలర్ తప్ప ఇంకేది పేలలేదు. ప్రివ్యూ కాని,బెనిఫిట్ షో కష్టం కాబట్టి, శుక్రవారం వరకు గేమ్ ఛేంజర్ రిజల్ట్ తేలదు.. విచిత్రం ఏంటంటే ఈ హీరో పరిక్ష రాసిన 3 నెలలకు కేజీయఫ్ రాకీ భాయ్, ఇదే ఎగ్జామ్ రాయబోతున్నాడు. టాక్సిక్ ప్రోమో పేలినా, బాక్సాఫీస్ పేలకపోతే అడ్రస్సే గల్లంతయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చరణ్, యష్ ఇద్దరికీ ఇది పూర్తిగా పరీక్షా కాలమ్.. మరి పాస్ అవుతారా? ర్యాంక్ కొడతారా? గేమ్ ఛేంజర్, టాక్సిక్ ఈ రెండు సినిమాలే రామ్ చరణ్, యష్ ని కంగారు పెట్టిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు కలిసొచ్చిన త్రిబుల్ ఆర్, కేజీయఫ్ తర్వాత తమని తాము ప్రూవ్ చేసుకునే మూవీతో వస్తున్నారు పాన్ ఇండియా లెవల్లో త్రిబుల్ ఆర్ హిట్ తో గ్లోబల్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. ఇక ఇదే సినిమాతో హిట్ మెట్టెక్కి ఎన్టీఆర్, రాజమౌలి సపోర్ట్ లేకుండానే, దేవర లాంటి హిట్ తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. పాన్ ఇండియా పరీక్షలో డిస్టింక్షన్ లో పాసయ్యాడు.. 670 కోట్ల వసూళ్లే తన ర్యాంక్ అయితే, 1200 కోట్ల ర్యాంక్ తో ప్రభాస్ కూడా పాన్ ఇండియా పరీక్షల్లో మూడు సార్లు ర్యాంకులు తెచ్చుకున్నాడు ఇక మిగిలింది చరణ్, యష్ వంతే... గేమ్ ఛేంజర్ తో చరన్ పాన్ ఇండియా పరిక్షలో ర్యాంక్ తెచ్చుకోవటం అటుంచితే, పాస్ అయితే చాలనే పరిస్థితి... శంకర్ మీద జనాలకు పోయిన నమ్మకాన్ని గేమ్ ఛేంజర్ ట్రైలర్ మళ్లీ తీసుకొస్తోంది. కాని థియేటర్ లో బొమ్మ పడేవరకు బాక్సాఫీస్ లో చరణ్ సీన్ మారుతుందో లేదో చెప్పలేం ఇక యష్ విషయానికొస్తే, తను కేజీయఫ్ రెండు భాగాలతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాడు. పాన్ ఇండియా కింగ్ గా మారాడు. కాని ప్రశాంత్ నీల్ లేకుండా, కేజీయఫ్ ఇమేజ్ లేకుండా తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. టాక్సిక్ మూవీతో పాన్ ఇండియాలెవల్లో తనకి ఏప్రిల్ లో అగ్నిపరీక్ష ఎదురు కాబోతోంది తనకంటే ముందే గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ పాన్ ఇండియా పరిక్ష రాస్తుంటే, మూడునెల్ల తర్వాత ఏప్రిల్ పదికి టాక్సిక్ తో సేమ్ ఎగ్జామ్ ఫేస్ చేయబోతున్నాడు యష్. మరి ఈ ఇద్దరిట్లో ఎవరు పాన్ ఇండియా ర్యాంకర్లవుతారో, ఎవరు పాస్ మార్కులతో సరిపెడతారో అన్నది... వచ్చే వారం కొంత, ఏప్రిల్ లో ఇంకొత తేలబోతోంది. లక్కీగా గేమ్ ఛేంజర్ కి భారీ హైప్ వస్తోంది. టాక్సిక్ ప్రోమో పేలింది..ఇక పేలాల్సింది బాక్సాఫీసే[embed]https://www.youtube.com/watch?v=gZYvbIxgzkA[/embed]