బాబాయ్ కోసం అబ్బాయ్… సెట్ చేసిన ప్రొడ్యూసర్

నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతికి బాక్సాఫీస్ పై యుద్ధానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ పక్క ప్లానింగ్ తో దిగుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో బాలకృష్ణకు క్రేజ్ ఉండటంతో ఆ క్రేజ్ ను వాడుకునేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ రెడీ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 07:26 PMLast Updated on: Dec 27, 2024 | 7:26 PM

Ntr Attend Daku Maharaj Pre Release Event

నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతికి బాక్సాఫీస్ పై యుద్ధానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ పక్క ప్లానింగ్ తో దిగుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో బాలకృష్ణకు క్రేజ్ ఉండటంతో ఆ క్రేజ్ ను వాడుకునేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ రెడీ అవుతోంది. అఖండ సినిమాతో బాలకృష్ణకు నార్త్ ఇండియా లో మంచి పాపులారిటీ వచ్చింది. దీనితో ఇప్పుడు రాబోతున్న సినిమాలో కూడా నార్త్ ఇండియన్స్ కు నచ్చే విధంగానే కొన్ని సీన్లను మేకింగ్ చేశాడు.

ఇక డైరెక్టర్ బాబి కొల్లి సినిమా విషయంలో పక్కా జాగ్రత్తగా తీసుకోవడమే కాకుండా అసలు ఇప్పటివరకు తెలుగు సినిమాలో చూపించని కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపించేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కొన్ని సెన్సేషన్స్ కూడా ఉండే ఛాన్స్ కనబడుతోంది. నందమూరి కుటుంబానికి దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించే ప్లాన్ చేస్తున్నాడు సీతారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడినట్లుగా కూడా రూమర్ వైరల్ అవుతుంది.

దీనికి సంబంధించి మీమ్ పేజెస్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా లేదా అనే క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీకి దగ్గరయ్యే ఆలోచనలోనే ఎన్టీఆర్ ఉన్నట్లు రీసెంట్ గా వస్తున్న కొన్ని ఎన్టీఆర్ పోస్టులు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు.

ఆ తర్వాత బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఖరారు అయినప్పుడు కూడా సోషల్ మీడియాలో విషెస్ చెప్పాడు. ఇప్పుడు డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ వస్తే మాత్రం అది కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. అరవింద సమేత సినిమా వరకు ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీతో దాదాపుగా కలిసే ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని పరిణామాలు మరింత దూరం పెంచాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ వస్తే మాత్రం కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ మళ్ళీ కలిసి అవకాశం ఉంటుంది. అయితే దేవర సినిమాను మెగా ఫ్యామిలీ టార్గెట్ చేస్తుంటే బాలకృష్ణ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. అటు టిడిపి కార్యకర్తలు కూడా దేవర సినిమా విషయంలో ఎన్టీఆర్ కు సపోర్ట్ గా నిలబడ్డారు. అందుకే ఇప్పుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.