స్టార్ అంటే అర్ధం పెంచేశాడు.? ఆవిషయంలో రెబల్ స్టార్ నే మించేశాడు..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఉద్దేశించే గతంలో ఆమీర్ ఖాన్ స్టార్ అంటే ఏంటనేది పరోక్షంగా వివరించాడు. ఇప్పుడు నిదానంగా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ డెఫినేషన్ మారుస్తున్నాడు. ఏకంగా రెబల్ స్టార్ నే పాన్ ఇండియా మార్కెట్ లోమించిపోయాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఉద్దేశించే గతంలో ఆమీర్ ఖాన్ స్టార్ అంటే ఏంటనేది పరోక్షంగా వివరించాడు. ఇప్పుడు నిదానంగా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ డెఫినేషన్ మారుస్తున్నాడు. ఏకంగా రెబల్ స్టార్ నే పాన్ ఇండియా మార్కెట్ లోమించిపోయాడు. ఐదు పాన్ ఇండియా హిట్లున్న రెబల్ స్టార్ ని కేవలం రెండంటే రెండు పాన్ ఇండియా హిట్లతో ఎన్టీఆర్ ఎలా దాటేస్తాడు…? ఈ ప్రశ్నకే దిమ్మతిరిగే సమాధానం బాలీవుడ్ మీడియా నుంచి వస్తోంది. అసలు దేవర 510 కోట్లు రాబట్టినా, 5 వేల కోట్ల స్టార్ అయిన ప్రభాస్ ని ఎలా మించిపోయాడో తేలింది. ఈవిషయంలో కేజీయఫ్ ఫేం యష్, పుష్పరాజ్ గా బన్నీ, త్రిబుల్ ఆర్ తో రామ్ ఇలా ఎవరూ ఎన్టీఆర్ కి పోటీ రాలేకపోతున్నారు.. దానికి బీటౌన్ మీడియా ఇస్తున్న కారణాలు మతిపోగొట్టేలా ఉన్నాయి.. అవేంటో చూసేయండి.
రెబల్ స్టార్ బాహుబలి1, బాహుబలి 2, సాహో, సలార్, కల్కీ మూవీలతో రెండు సార్లు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టాడు. ఐదు సినిమాల మొత్తం వసూళ్లని కలిపితే 5 వేల కోట్లుండటంతో, ఫైవ్ కే పాన్ ఇండియన్ కింగ్ గా మారాడు. తనతో పోలిస్తే, మల్టీ స్టారర్ మూవీ త్రిబుల్ ఆర్ తో 1250 కోట్లు రుచిచూశాడు ఎన్టీఆర్. దేవరతో 510 కోట్లు రాబ్టటాడు. ఓవర్ సీస్ వసూళ్లతో కలిపితే, ఈరెండు పాన్ ఇండియా హిట్లతో మొత్తంగా 2 వేల కోట్ల వసూల్ల రుచిచూశాడు మ్యాన్ఆఫ్ మాసెస్
ఎలా చూసినా రెబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మధ్య 3 వేల కోట్ల వసూళ్ల డిఫరెన్స్ఉంది. రెమ్యునరేషన్ పరంగా కూడా ప్రభాస్ 500 కోట్లు తీసుకుంటుంటే, ఎన్టీఆర్ వార్ 2 కి 350 కోట్లు తీసుకుంటున్నాడు. ఎలాచూసినా పాన్ ఇండియా నెంబర్ వన్ కింగ్ గా ప్రభాస్ దూసుకెళుతుంటే పాన్ ఇండియా రెండో కింగ్ గా ఎన్టీఆర్ పేరుమారుమోగుతోంది..
అంటే ఏజ్ లో, ఇమేజ్ లో ,మార్కెట్ మైలేజ్ లో ఎన్టీఆర్ సెకండ్ పొజీషన్ లోనే ఉన్నాడని క్లియర్ కట్ గా తెలుస్తోంది. అయినా ప్రభాస్ కూడా అందుకోనంత ఎత్తుకి ఎన్టీఆర్ ఎదిగాడంటున్నారు. పుష్ప 2 తో బన్నీ వెయ్యికోట్ల వసూల్లని రాబట్టినా, రెండు పాన్ ఇండియా హిట్లు కొట్టినా తారక్ ని ఇప్పుడప్పుడే రీ,చ్ కాలేడు. యష్ తోపాటు రామ్ చరన్ కూడా ఎన్టీఆర్ రేంజ్ ని అందుకోడానికి టైం పడుతుంది..
ఒక విషయంలో ప్రభాస్ కూడా ఎన్టీఆర్ వెనకే ఉన్నాడు కాని, తనని దాటలేదని తేలింది. అదే పాన్ ఇండియా విచిత్రం… ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టొచ్చు.. కాని వెంటనే రెండో పాన్ ఇండియా మూవీతోనే దర్శక నిర్మాతల సాయం లేకుండా, అంతా తానై తన సినమాను పాన్ ఇండియా లెవల్లో దూసుకెళ్లేలా చేశాడు. ట్రోలింగ్స్, కామెంట్స్ కి ఎదురీదాడు. రాజమౌలి తో హిట్ వచ్చాక ఏ హీరోకైనా ప్లాప్ రావాల్సిందే అన్న సెంటి మెంట్ ని బ్రేక్ చేశాడు. ప్రభాస్, చరణ్ కూడా ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయలేకపోయారు
దీనికి తోడు రాజమౌళి అండ్ కో లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ల సాయం లేకుండా హిట్ మెట్టెక్కేందుకు ప్రభాస్ కి ఐదు సినిమాలు చేయాల్సి వచ్చింది. బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత సాహోతో సినిమా భారమంతా ప్రభాసే తన ఇమేజ్ తో నడిచేలా చేశాడు. కాని అది వెయ్యికోట్ల హిట్ కాదు. తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్ వచ్చినా అవి హిట్ కాలేదు. సలార్ హిట్టైనా దాన్ని తీసిన ప్రశాంత్ నీల్ అనామకుడు కాదు. ఇక కల్కీ హిట్టైందంటే అది సోలోగా ప్రభాస్ స్టామినా… అంటే బాహుబలి2 తర్వాత, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ నాలుగు సినిమాచేశాకే ఐదో మూవీతో పెద్ద దర్శకుల సపోర్ట్ లేకుండా సొంత ఇమేజ్ తో పాన్ ఇండియా హిట్ మెట్టెక్కే ఛాన్స్ దక్కింది ప్రభాస్ కి…
బన్నీ ఇంకా సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప2తోనే వస్తున్నాడు. అంటే ఆతర్వాత పాన్ ఇండియా ఇమేజ్ లేని దర్శకుడితో సినిమాచేసి హిట్ మెట్టెక్కితేనే తాను సొంత స్టామినాతో ఎదిగిన స్టారవుతాడు. చరణ్ కి ఆచార్యా పంచ్ ఇచ్చింది. గేమ్ ఛేంజ్ హిట్ అయినా శంకర్ అనామకుడు కాడు కాబట్టి, క్రెడిట్ మొత్తం చరణ్ కి దక్కడం కష్టమే. సో బుచ్చిబాబు మూవీ పాన్ ఇండియా హిట్టైతే, అప్పుడు చరణ్ పాన్ ఇండియా స్టామినా బయట పడుతుంది. యష్ కేజీయఫ్ తర్వాత అనామకులనుకున్ దర్శకురాలితో ప్రయోగం చేస్తున్నాడు. ఈ పరిక్షలో పాసైతే, ఎన్టీఆర్ తర్వాతీ స్థానం తనదే… సో కేవలం రెండో పాన్ ఇండియా మూవీతోనే దేశాన్ని ఊపేసిన రికార్డు మాత్రం ఎన్టీఆర్ కే దక్కింది… మెల్లి మెల్లిగా తన రికార్డులు, స్టామినా వెనకున్న కారణాలను బాలీవుడ్ మీడియా ఎనలైజ్ చేయటం మాత్రం సోషల్ మీడియాని ఊపేసేస్తోంది.