ఆ 3 డ్రింక్స్ తాగితే … మ్యాన్ ఆఫ్ మాసెస్ కి 1000 కోట్లు..?

ఎన్టీఆర్ సడన్ గా హాలీవుడ్ హీరో రేంజ్ లో వందలకోట్లు కాదు, వెయ్యికోట్ల స్టార్ గా మారాడు. వెయ్యికోట్లు వెనకేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఖాన్లు, కపూర్లకే కనిపించే వందలకోట్ల లెక్కలు, ఇప్పుడు తెలుగు హీరోలకు కామనైపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 24, 2024 | 12:10 PMLast Updated on: Nov 24, 2024 | 12:10 PM

Ntr Becoming Big Star After Devara Success

ఎన్టీఆర్ సడన్ గా హాలీవుడ్ హీరో రేంజ్ లో వందలకోట్లు కాదు, వెయ్యికోట్ల స్టార్ గా మారాడు. వెయ్యికోట్లు వెనకేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఖాన్లు, కపూర్లకే కనిపించే వందలకోట్ల లెక్కలు, ఇప్పుడు తెలుగు హీరోలకు కామనైపోయాయి. కాకపోతే ఇక్కడ వెరైటీ ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా దక్కని ఎమౌంట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ కి దక్కుతోంది. అది కూడా వందకోట్లో రెండొందలకోట్లో కాదు.. కనీసం 500 కోట్లు కూడా కాదు.. అక్షరాల వెయ్యి కోట్లు.. ఇంత పెద్ద డీల్ షారుఖ్, సల్మాన్ కి కూడా దక్కలేదు. సౌత్ హీరోలెవరూ ఈ రేంజ్ డీల్ లో భాగం కాలేదు. కేవలం మూడంటే మూడు డ్రింక్స్ తీసుకుంటే చాలు మ్యాన్ ఆఫ్ మాసెస్ కి వెయ్యికోట్లు సొంతమైనట్టే.. కేవలం ఇది డబ్బు వ్యవహారం కాదు… రేంజ్, ఇమేజ్, మార్కెట్ లో మైలేజ్ ని డిసైడ్ చేసే డీల్… అదేంటో చూసేయండి.

100 కోట్ల నుంచి 150 కోట్లకు పెరిగిన ఎన్టీఆర్ రెమ్యునరేషన్ వార్ 2 తో ఏకండా 200 కోట్లకు చేరిందన్న వార్త్ వైరలైంది. త్రిబుల్ఆర్, దేవర బ్లాక్ బస్టర్లతో పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా కింగ్ గా తనపేరే మారుమోగింది. అలాంటి తను ఇప్పుడు వెయ్యికోట్ల రికార్డుతో షాక్ ఇస్తున్నాడు. అది కూడా సినిమాలతో కాదు, హిట్ మూవీల వసూళ్లతో తనకి వెయ్యికోట్ల కలెక్సన్స్ కొత్త కాదు.

కాని ఇప్పడు 1000 కోట్లు మాత్రం తనకే కాదు, ఇండియన్ హీరోలందరిలో ఎవరికి దక్కనిది… అదే ఎన్టీఆర్ కి దక్కుతోంది. కేవలం మూడంటే మూడు డ్రింగ్స్ తీసుకుంటే చాలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎకౌంట్ లో వెయ్యికోట్లు పడిపోతాయట

కోకాకోలాకి వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్, డిమాండ్ అందరికీ తెలిసింది. ఆ కూల్ డ్రింక్ వచ్చాకే ప్రపంచ వ్యాప్తంగా అలాంటి కూల్ డ్రింక్స్ ఎన్నో వచ్చాయి. ఇప్పుడా కోక్ కి ఇండియా మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడు ఎన్టీఆర్

కేవలం కోక్ కి మాత్రమే కాదు, స్పిరిట్, ఫాంటా ని కూడా తనే ప్రమోట్ చేయబోతున్నాడట. ఇలాంటి బ్రాండ్ ఎండోర్స్ మెంట్లు ఎన్టీఆర్ కి కొత్త కాదు. నవరత్న ఆయిల్ నుంచి చాలా వరకు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉంటూ వచ్చాడు తారక్. ఇప్పడు కోక్ తోపాటు దాని అనుంబంధ కూల్ డ్రింక్స్ అయిన స్పిరిట్, ఫాంటాకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గామారబోతున్నాడట

కోక్ తో ఎన్టీఆర్ తాలూకు ఎండర్స్ మెంట్ డీల్ వెయ్యికోట్లని తెలుస్తోంది. ఏడాది కాంట్రాక్ట్ కి వెయ్యికోట్లు సమర్పించుకుంటోందట కూల్ డ్రింక్ కంపెని. గతంతో పవన్, చిరు, మహేశ్, అండ్ కో కూల్ డ్రింక్స్ కంపెనీలని ప్రమోట్ చేశారు. కాకపోతే, ఈసారి ఖాన్లూ కపూర్లు కూడా అందుకోనంత ఎమౌంట్ ఎన్టీఆర్ కి ఈ డీల్ వల్ల దక్కుతోందని తెలుస్తోంది. 1000 కోట్ల ఫిగరే కాస్త షాకింగ్ గా ఉంది. త్రిబుల్ ఆర్, దేవర బ్లాక్ బస్టర్ల ఇంపాక్ట్ ఇక్కడ కనిపిస్తోంది.