రెబల్ స్టార్ మిస్… కాని ఎన్టీఆర్ మాత్రం అక్కడ తగ్గేదే లే
రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కీ రెండీంటితో ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఐతే పాన్ ఇండియా తర్వాత పాన్ ఆసియాను షేక్ చేసే ఛాన్స్ తనకు దక్కింది. కాని రెబల్ స్టార్ కి మాత్రం ఇప్పుడు టైం కుదరట్లేదు. అసలు కుదిరేలా లేదు. కట్ చేస్తే సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కీ రెండీంటితో ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఐతే పాన్ ఇండియా తర్వాత పాన్ ఆసియాను షేక్ చేసే ఛాన్స్ తనకు దక్కింది. కాని రెబల్ స్టార్ కి మాత్రం ఇప్పుడు టైం కుదరట్లేదు. అసలు కుదిరేలా లేదు. కట్ చేస్తే సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చాడు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ఆల్రెడీ దేవరతో ప్రూవ్ చేశాడు. ఇప్పుడు జపాన్ లో దుమ్ముదులుపబోతున్నాడు. ఒకవైపు చేతిలో రెండు సినిమాలు, మరో వైపు పట్టాలెక్కబోతున్న సీక్వెల్… ఇలాంటి టైంలో ఏకంగా 10 రోజులు జపాన్ ఫ్యాన్స్ కోసం టైం కేటాయించాడు తారక్. కంప్లీట్ గా పదిరోజులు జపాన్ గల్లీల్లో హల్చల్ కి రెడీ అయ్యాడు. ఐతే అరవింద సమేత వీరరాఘవకి, త్రిబుల్ ఆర్ కి, ఎన్టీఆర్ లో ఎలాంటి మార్పు వచ్చిందో… త్రిబుల్ ఆర్ కి, దేవరకి మధ్య అంతకు మించి మార్పు కనిపించింది. ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ గా జర్నీ షురూ అయినట్టే కనిపిస్తోంది. అందుకే ఈ మార్పు అనంటున్నారు. అంతగా తనేం మారాడు..? తనేం చేస్తున్నాడు…? టేకేలుక్
రెబల్ స్టార్ ప్రభాస్ యాంకిల్ ఇంజూరి వల్ల, రెస్ట్ తీసుకుంటున్నాడు. చికిత్సలో భాగంగా సంక్రాంతి వరకు తను రెస్ట్ మోడ్ లోనే ఉంటాడు. ఆతర్వాతే ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ తాలూకు లాంగ్ షెడ్యూల్ మొదలౌతుంది. ఆ వెంటనే ఫౌజీ సెట్లో తను అగుగు పెట్టడం కుదురుతుంది. సో మొత్తానికి తన యాంకిల్ ఇంజురీ వల్ల ఈ సినిమాల షెడ్యూల్స్ వాయిదా పడటమే కాదు, జపాన్ కి వెళ్లాల్సిన తన ప్లానింగ్ కూడా మారిపోయింది
సలార్ ని జపనీస్ లో రిలీజ్ చేస్తున్నటైంలో అక్కడ సందడి చేసిన ప్రభాస్, కల్కీ ని ఇప్పుడు అక్కడ రిలీజ్ చేస్తుంటే, ప్రమోషన్ కోసం వెళ్తాడనుకున్నారు. కాని అది జరగలేదు. ఐతే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వంతొచ్చింది. తను జపాన్ వెళ్లేందుకు రంగం సిద్దమైంది. తన దేవర ప్రమోషన్ కోసం ఇప్పడు జపాన్ లో ల్యాండ్ కాబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
నిజానికి జమానాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి మాత్రమే జపాన్ లో ఫ్యాన్స్ ఉండేవాల్లు. ఆతర్వాత జపాన్ లో ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే. మరే ఇతర స్టార్లకు ఇలా జరగలేదు. బాహుబలి తో ప్రభాస్ కి కూడా జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కాని అంతకుముందే బాద్ షా నుంచే తనకి జపాన్ లో ఫాలోయింగ్ పెరగటం విచిత్రం
ఎందుకంటే త్రిబుల్ ఆర్ రిలీజ్ వరకు ఎన్టీఆర్ సినిమాలేవి జపాన్ వరకు పోయింది లేదు. అక్కడ డబ్ అయ్యింది లేదు. అలాంటిది ఓ తెలుగు సినిమా చూసి జపనీస్ ఫ్యాన్స్ గా మారారంటే, ఇలాంటి వింత ఎన్టీఆర్ లైఫ్ లోనే జరిగింది. బాద్ షా మూవీ టైం నుంచే ఎన్టీఆర్ సాంగ్స్ కి కవరప్ డాన్స్ లు చేస్తూ చాలా మంది జపనీస్ డాన్సర్స్, తన మీద అభిమానం కురిపించారు
ఇక టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, జనత గ్యారేజే కాదు, అరవింద సమేత వీరరాఘవ పాటలు కూడా జపాన్ లో తూటాల్లా పేలాయి. అంతెందుకు త్రిబుల్ ఆర్ మూవీ యూఎస్ లో ప్రమోషన్ కోసం ఎన్టీఆర్, చరణ్ అండ్ కో వెళితే, అక్కడికి ఫ్లైట్ లో వెళ్లింది జపాన్ ఫ్యాన్స్ బ్రుందం… సో ప్రభాస్ కంటే ముందుగానే జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న తారక్, అప్పటి నుంచే వాళ్ల అభిమానానికి ఫిదా అవుతున్నాడు.
అందుకే త్రిబుల్ ఆర్ తర్వాత జపాన్ లో రిలీజ్ అవుతున్న తన దేవర మూవీ కోసం, ఆ దేశం లోకి ల్యాండ్ అవుతున్నాడు. ఏకంగా పదిరోజులు దేవర ప్రమోషన్ కోసంమే కేటాయించాడు. దాదాపు జపాన్ లోని ఐదు నగరాల్లో దేవరని ప్రమోట్ చేయబోతున్నాడట తారక్. నిజానికి ఈవారమే కల్కీ ప్రమోషన్ కోసం రెబల్ స్టార్ అక్కడికి వెళ్ళాలి. కాని యాంకిల్ యాక్సిడెంట్ తో తన ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది. ఎన్టీఆర్ జర్నీ షురూ కాబోతోంది.