Prabhas NTR : ప్రభాస్ కి ఎన్టీఆర్ అడ్డమో, ఎన్టీఆర్ కి ప్రభాస్ అడ్డమో

వేడి వేడిగా ఉన్న తాజా సినీ వార్తలు గురించి చెప్పుకోవాలంటే కల్కి 2898 ఏడి కలెక్షన్స్ ల గురించి చెప్పుకోవాలి. జూన్ 26 నుంచి ఇదే పరిస్థితి. మన దగ్గర జూన్ 27 న రిలీజ్ అయినా ఓవర్ సీస్ మాత్రం ఒక రోజు ముందుగానే విడుదలయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 3, 2024 | 11:30 AMLast Updated on: Jul 03, 2024 | 11:30 AM

Ntr Blocked Prabhas Prabhas Blocked Ntr

వేడి వేడిగా ఉన్న తాజా సినీ వార్తలు గురించి చెప్పుకోవాలంటే కల్కి 2898 ఏడి కలెక్షన్స్ ల గురించి చెప్పుకోవాలి. జూన్ 26 నుంచి ఇదే పరిస్థితి. మన దగ్గర జూన్ 27 న రిలీజ్ అయినా ఓవర్ సీస్ మాత్రం ఒక రోజు ముందుగానే విడుదలయ్యింది. వరల్డ్ వైడ్ అన్ని చోట్ల కూడా రికార్డు కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుపోతుంది. అదే విధంగా ఎన్టీఆర్ దేవర సెప్టెంబర్ 27 న రావడానికి శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. పాన్ ఇండియా లెవల్లో సరికొత్త రికార్డులు సృష్టించడానికి ముస్తాబు అవుతుంది. అదేంటి సడన్ గా ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ కి వెళ్ళారేంటని అనుకుంటున్నారా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దగ్గరకి కూడా వెళ్లాల్సిన పరిస్థితి. మ్యాటర్ అలాంటిది మరి..

ప్రభాస్, ప్రశాంత్ నీల్ ల సలార్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. కలెక్షన్ల పరంగా కూడా అనేక రికార్డులని నెలకొల్పింది. దీంతో సలార్ 2 ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. మొన్న మే లోనే షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ కల్కి వల్ల కుదరలేదు. దీంతో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడొచ్చిన అసలైన చిక్కేంటంటే ఎన్టీఆర్, ప్రశాంత్ ల న్యూ మూవీ కూడా అగస్ట్ లో షూటింగ్ కి వెళ్లనుంది. ఈ విషయాన్నీ ఆ కాంబో ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వెల్లడి చేసింది. ఇంకేంటి సలార్ 2 దాని తర్వాత ప్రారంభం అవుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సలార్ 2 మేలో ప్రారంభం కావాలనే ఒప్పందం కూడా జరిగింది. దాంతో సలారే ముందు ప్రారంభం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు బలాన్ని చేకూర్చేలా ప్రభాస్ తన రాజా సాబ్ ని పక్కన పెట్టాడు. మరిప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ముందు షూటింగ్ కి వెళ్తాడా లేక ప్రభాస్ తో వెళ్తాడా అనే టెన్షన్ ఇద్దరి అభిమానుల్లో ఉంది.

అదే టైంలో ఈ విషయం ప్రశాంత్ నీల్ కి పెద్ద సమస్య గా కూడా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఉంది హీరోలని దైవంగా కొలిచే అభిమానులు. ఏ హీరోతో ముందుగా స్టార్ట్ చేసినా కూడా ఆ తర్వాత మరో హీరో అభిమానుల చేతుల్లో ప్రశాంత్ ట్రోల్ కి గురి కావలసి ఉంటుంది. కాకపోతే ఒక హీరో అభిమానుల మద్దతు మాత్రం ఊరటనిచ్చే అంశం. ప్రభాస్ ప్రస్తుతం ఫారెన్ లో సినిమా హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ దేవరతో ఆన్ డ్యూటీలో ఉన్నాడు.