దేవర బూస్ట్: ఇక ఫ్లాప్ డైరెక్టర్లు ఎన్టీఆర్ గుమ్మం ముందు కూర్చోవచ్చు..?

టాలీవుడ్ లో ఎన్టీఆర్ లెక్క మారింది. కామెంట్లు చేసిన నోళ్ళు అన్నీ ఫెవికాల్ తో మూసుకునేలా దేవర తో దెబ్బ కొట్టాడు ఎన్టీఆర్. సినిమాపై పగబట్టి కొన్ని శక్తులు వెంటాడినా... వాళ్ళను వేటాడుతూ రికార్డులను యెర్ర సముద్రంలో కలిపాడు ఎన్టీఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 5, 2024 | 05:19 PMLast Updated on: Oct 05, 2024 | 5:19 PM

Ntr Build Confidence For Flop Directors

టాలీవుడ్ లో ఎన్టీఆర్ లెక్క మారింది. కామెంట్లు చేసిన నోళ్ళు అన్నీ ఫెవికాల్ తో మూసుకునేలా దేవర తో దెబ్బ కొట్టాడు ఎన్టీఆర్. సినిమాపై పగబట్టి కొన్ని శక్తులు వెంటాడినా… వాళ్ళను వేటాడుతూ రికార్డులను యెర్ర సముద్రంలో కలిపాడు ఎన్టీఆర్. సినిమా సినిమాకు తన దమ్ము ఏంటో లెక్కలతో పక్కాగా చూపించాడు బుడ్డోడు. ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మందికి ఎన్టీఆర్ ఫస్ట్ ఆప్షన్ అయ్యాడు. మీరు నా మీద ఎంత విషం కక్కినా నా రికార్డుల సముద్రంలో అడుగు పెట్టడం మీ తరం కాదని తొడకొట్టి బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక ఫ్లాప్ డైరెక్టర్ లకు ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద దిక్కు అయ్యాడు. సినిమాల్లో డైరెక్టర్లకు ఒక్క ఫ్లాప్ పడితే నిలబడటం కష్టం. హీరోకి ఫ్లాప్ పడితే ఎలాగోలా బయటకు రావచ్చు. అలాంటి ఫ్లాప్ డైరెక్టర్ లు ఎన్టీఆర్ తో సినిమా చేస్తే పక్కా హిట్ కొడతారని ఓ కొత్త సెంటిమెంట్ ను క్రియేట్ చేసాడు. ఏంటీ ఆ సెంటిమెంట్ అనేది ప్రూఫ్స్ తో చూద్దాం. మున్నా సినిమాతో దారుణమైన ఫ్లాప్ చూసిన వంశీ పైడిపల్లికి బృందావనం సినిమాతో బిగ్ హిట్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ తర్వాత వన్ నేనొక్కడినే సినిమాతో ఫ్లాప్ ఎదుర్కొన్న సుకుమార్ కు నాన్నకు ప్రేమతో సినిమాతో హిట్ ఇచ్చాడు.

ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో బాబీ కెరీర్ అయిపోయింది అనుకున్నారు అందరూ. కాని జై లవ కుశ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు తారక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు కూడా ఎన్టీఆర్ సూపర్ హిట్ ఇచ్చాడు. అజ్ఞాతవాసి సినిమాతో ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్ కు… అరవింద సమేత సినిమాతో బంపర్ హిట్ కొట్టి చూపించాడు. ఇక ఇప్పుడు ఆచార్య సినిమాతో కొరటాల కెరీర్ అయిపోయింది అనుకున్న సమయంలో దేవరతో బిగ్ హిట్ కొట్టాడు. కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్ ల కెరీర్ కు ఎన్టీఆర్ భరోసా ఇస్తూ దూసుకుపోతున్నాడు.