Tollywood: చెర్రీ బర్త్ డే పార్టీలో కనిపించని తారక్.. ఇద్దరి మధ్య గ్యాప్ నిజమేనా!?
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరినీ ఇంటికి పిలిచి మరీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా ఈ పార్టీకి వచ్చారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
చరణ్‌తో ఎంతో క్లోజ్‌గా ఉండే ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అనే డిస్కర్షన్ మొదలైంది. చాలా రోజుల నుంచి చరణ్, తారక్ మధ్య గ్యాప్ వచ్చిందంటూ గాసిప్స్ వస్తున్నాయి. తారక్‌ను సైడ్ చేసి ట్రిపులార్ క్రెడిట్ మొత్తం చరణ్‌కు దక్కేలా చేస్తున్నారంటూ తారక్ ఫ్యాన్స్ డిస్కర్షన్ మొదలు పెట్టారు. దీనికంటే ముందు సేమ్ టాపిక్ రామ్ చరణ్ గురించి కూడా జరిగింది. ట్రిపులార్ సినిమా అంటే అంతా తారక్ గురించే మాట్లాడుతున్నారు.. చరణ్‌కు క్రెడిట్ ఇవ్వడంలేదని చరణ్ అభిమానులు తెగ ఫీలయ్యారు. జేమ్స్ కామెరూన్‌కు చిరంజీవి థాంక్స్ చెప్తూ చేసిన వీడియోలో, జనసేనాని పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్‌లో తారక్ పేరు లేదు. దీంతో మెగా ఫ్యామిలీ చరణ్‌కు హైప్ క్రియేట్ చేసి తారక్‌ను డీగ్రేడ్ చేస్తున్నారంటూ అంతా మట్లాడుకున్నారు. నిజానికి తారక్, చరణ్ చాలా మంచి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ చాలా సార్లు చెప్పారు.
అలాంటిది చెర్రీ బర్త్ డేలో తారక్ కనిపించకపోవడం ఇప్పుడు ఈ డిస్కర్షన్‌కు కారణమైంది. అయితే తారక్ ప్రస్తుతం ఎన్టీఆర్30 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడని ఫ్యాన్స్ చెప్తున్నారు. సినిమాలో ఎక్కువగా నైట్ సీన్స్ ఉండటంతో మోస్ట్‌లీ షూటింగ్ నైట్ టైంలోనే ప్లాన్ చేశాడట కొరటాల. ఈ కారణంగానే తారక్, కొరటాల ఇద్దరూ చెర్రీ బర్త్ డే పార్టీకి రాలేదని చెప్తున్నారు. అటు పుష్ప షూటింగ్ బిజీ కారణంగా బన్నీ కూడా బర్త్ డే పార్టీకి రాలేదు. ఫ్యాన్స్ క్లారిటీగానే ఉన్నా గాసిప్స్ మాత్రం సినీ వర్గాలను చుట్టేస్తున్నాయి.