అమ్మలు హ్యాపీ బర్త్ డే.. భార్య బర్త్ డేను జపాన్‌లో సెలబ్రేట్ చేసిన ఎన్టీఆర్..!

ఒకప్పటి హీరోలకు సినిమాలు తప్ప మరో ప్రపంచమే తెలియదు. వచ్చామా.. వందల సినిమాలు చేసామా.. రోజుకు మూడు షిఫ్టులు పని చేసామా అన్నట్లు ఉండేవాళ్లు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 05:41 PMLast Updated on: Mar 26, 2025 | 5:42 PM

Ntr Celebrated His Wifes Birthday In Japan

ఒకప్పటి హీరోలకు సినిమాలు తప్ప మరో ప్రపంచమే తెలియదు. వచ్చామా.. వందల సినిమాలు చేసామా.. రోజుకు మూడు షిఫ్టులు పని చేసామా అన్నట్లు ఉండేవాళ్లు. అందుకే ఒకప్పటి హీరోలు తమ పిల్లలను పూర్తిగా మిస్ అయిపోయారు. కానీ ఇప్పుడున్న హీరోలు అలా కాదు.. ముందు కుటుంబం ఆ తర్వాతే సినిమాలు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలైతే కుటుంబానికి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సినిమాల కంటే ముందు వాళ్ల ప్రయారిటీ ఎప్పుడూ ఫ్యామిలీస్ మీదే ఉంటుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన భార్య బర్త్ డే వేడుకలను చేసిన తీరు చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్‌లో ఉన్నాడు. కుటుంబంతో పాటు అక్కడికి వెళ్లాడు తారక్. ఆర్ఆర్‌ఆర్‌‌తో వచ్చిన ఫాలోయింగ్‌ను దేవరతో మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు జూనియర్.

దానికోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. పైగా జపాన్‌లో ఇప్పటికే దేవర షోలు పడ్డాయి.. వాటికి రెస్పాన్స్ కూడా నెక్ట్స్ లెవల్‌లో వస్తుంది. ముఖ్యంగా సినిమాలోని ఆయుధ పూజ పాటకు జపనీయులు బాగా కనెక్ట్ అయిపోయారు కూడా. ఓవైపు సినిమా ప్రమోషన్స్ చేస్తూనే.. మరోవైపు ఫ్యామిలీ టైమ్ కూడా ఇస్తున్నాడు. మార్చి 26న భార్య లక్ష్మీ ప్రణతి బర్త్ డేను అక్కడే ఘనంగా సెలబ్రేట్ చేసాడు. సోషల్ మీడియాలో భార్యతో ఉన్న ఫోటో పోస్ట్ చేసి.. ‘అమ్మలు.. హ్యాపీ బర్త్‌ డే’ అంటూ పోస్ట్ చేసాడు. ప్రణతి పుట్టిన రోజును జపాన్‌లో అభిమానుల సమక్షంలో సెలబ్రేట్ చేసాడు తారక్. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారక్ అలా పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలలోనే లక్ష్మీ ప్రణతికి కొన్ని లక్షల మంది లైక్ చేయడంతో పాటు.. వేలల్లో బర్త్ డే విషెస్ చెప్తున్నారు. భార్య లక్ష్మీ ప్రణతిని అమ్మలు అంటూ ప్రేమగా పిలుస్తుంటాడు ఎన్టీఆర్‌. ఇప్పుడు సోషల్ మీడియాలోనే అదే పోస్ట్ చేసాడు. పైగా భార్యను ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఎన్టీఆర్ ఇచ్చిన పోజ్ చూస్తుంటే అభిమానులకే కాదు.. అందరికీ ముచ్చటేస్తుంది.

ఇప్పటికే కొన్ని వందలసార్లు తన భార్య గురించి గొప్పగా చెప్పాడు ఎన్టీఆర్. ప్రణతి లేకపోతే తన జీవితం సగం ఖాళీ అయిపోతుందని.. ఇంట్లో అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటుంది కాబట్టే తాను ఇంత హాయిగా కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నానని చెప్పాడు తారక్. అంతేకాదు అమ్మకు ఏం కావాలో కూడా అన్నీ తానే చూసుకుంటుందని చెప్పుకొచ్చాడు జూనియర్. మరో రెండు మూడు రోజులు జపాన్‌లోనే ఉండబోతున్నారు తారక్ జోడీ. ఇక సినిమాల విషయానికి వస్తే.. వార్ 2 సినిమా మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. దీని తర్వాత ప్రశాంత్‌ నీల్‌ సినిమాతో జాయిన్ కానున్నాడు తారక్. మొదటి షెడ్యూల్‌లోనే ఎన్టీఆర్ లేకుండా 3000 మందితో యాక్షన్ ఎపిసోడ్‌ షూట్ చేసాడు ప్రశాంత్ నీల్. ఆయన వచ్చిన మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. నవంబర్ లోపు షూటింగ్ పూర్తి చేసి.. 2026 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. మొత్తానికి అటు ఫ్యామిలీ.. అటు సినిమాలతో బిజీగా ఉన్నాడు నందమూరి చిన్నోడు.
https://www.instagram.com/jrntr/p/DHoe2O-zNX1/?hl=en