500 కోట్ట ఎన్టీఆర్ సెటైర్.. రూమర్లు ఇప్పుడు నిజమైనట్టే.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగినా, కొత్తగా బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ లో తన నామస్మరన పెరిగేలా ఉంది. మొన్నటి వరకు తెలుగు వాళ్ల ఎదుగుదలని చూసిఓర్వని అవర జనం, ఆ కోణంలో అయిష్టత ఉన్నా, మార్కెట్ పరంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ కి జై కొట్టాల్సి వస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2024 | 04:45 PMLast Updated on: Nov 27, 2024 | 4:45 PM

Ntr Complete Target On South States

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగినా, కొత్తగా బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ లో తన నామస్మరన పెరిగేలా ఉంది. మొన్నటి వరకు తెలుగు వాళ్ల ఎదుగుదలని చూసిఓర్వని అవర జనం, ఆ కోణంలో అయిష్టత ఉన్నా, మార్కెట్ పరంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ కి జై కొట్టాల్సి వస్తోంది. మొన్నటి వరకు వచ్చిన రూమర్లు, గుసగుసలు, ఇంకా చెప్పాలంటే జరిగిన ప్రచారాలే ఇప్పడు నిజమయౌతున్నాయి. ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యాయి. జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లోఎన్టీఆర్ పాన్ ఇండియా కాదు పాన్ ఆసియా మూవీనే చేయబోతున్నాడు. అది కూడా 500 కోట్ల భారీ బడ్జెట్ తో.. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా లొకేషన్ మొత్తం 90 శాతం మలేషియాకే పరిమితం కాబోతోంది. ఇంతకి ఈ కాంబినేషన్ వెనకున్న సెన్సేషన్ ఏంటి?

త్రిబుల్ ఆర్ 1350 కోట్లు, దేవర 510 నుంచి 650 కోట్లు రాబట్టాక, మొత్తంగా 2 వేల కోట్ల వసూల్ల వీరుడిగా మారాడు ఎన్టీఆర్. తర్వాతే వార్ 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు. అదవ్వగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ గా భారీ యుద్ధానికే సిద్దమయ్యాడు. ఇంతలో ధూమ్ 4 తో పాటు మరో హిందీ మూవీని సిద్దార్థ్ ఆనంద్ మేకింగ్ లో సైన్ చేసేలా ఉన్నాడని వార్తలొచ్చాయి..

కాని ఈ గుసగుసలకంటే ముందు నుంచే జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారమే ఇప్పుడు వందశాతం నిజమవ్వబోతోంది. రీసెంట్ గా మూడోసారి ఎన్టీఆర్ ని కలిసి కథ వినిపించాడు నెల్సన్ దిలీప్. అది కూడా ముంబై లోని వార్2 షూటింగ్ బ్రేక్ లో… అలా ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చింది

అంటేకాదు వార్ 2 తర్వాత డ్రాగన్ తో ఎన్టీఆర్, రజినీకాంత్ జైలర్ తో నెల్సన్ బిజీ కాబోతున్నారు. ఈరెండు పూర్తైన వెంటనే నెల్సన్ తో ఎన్టీఆర్ సినిమా మొదలయ్యే ఛాన్స్ఉంది. ఆల్రెడీ హిందీలో ధూమ్ 4, తోపాటు సిద్దార్థ్ ఆనంద్ మూవీకి కూడా ఎన్టీఆర్ కమిటవ్వటంతో, మరో రెండేళ్లు ఐతే బాలీవుడ్, లేదంటే కోలీవుడ్ ప్రాజెక్టులతోనే తారక్ బిజీ అయ్యే ఛాన్స్ఉంది

ఇవన్నీ తెలుగు,హిందీ లేదంటే తెలుగు, తమిళ్ లో తెరకెక్కే బైలింగువల్ ప్రాజెక్ట్స్.. అయితే ఇందులో డ్రాగనే పాన్ ఆసియా మూవీగా తెరకెక్కే అవకాశముందని నెలరోజులుగా ప్రచారం పెరిగింది. కట్ చేస్తే మలేసియా విలన్, మలేసియా హీరోయిన్ ఇలా 60శాతం మలేషియన్స్ ని పెట్టి నెల్సన్ దిలీప్ ఎన్టీఆర్ తో కంప్లీట్ పాన్ ఆసియా ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది

ఆల్రెడీ జైలర్ 2 లో ఇద్దరు కొరియన్లను, ఒక జపాన్ పాత్ర పెట్టి అక్కడ సూపర్ స్టార్ రజినీ ఫ్యాన్స్ ని కూల్ చేసే పనిలో ఉన్న నెల్సన్, ఎన్టీఆర్ ప్రాజెక్స్ ని కూడా పాన్ ఇండియా కాకుండా పాన్ ఆసియాగానే మార్చే పనిలో ఉన్నాడు

ఒకరకరంగా చెప్పాలంటే కొరియన్ విలన్ తో రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్ తెరకెక్కబోతోందన్నారు. సందీప్ రెడ్డి ఆల్రెడీ ఆ పనుల్లో బిజీ అయ్యాడనేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు అయితే రాజమౌళి డైరెక్షన్ లోపాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇలాంటి టైంలో ఒకేసారి డ్రాగన్ అలానే నెల్సన్ దిలీప్ మూవీ తో పాన్ ఆసియా మార్కెట్ మీద దండెత్తేలా మ్యాన్ ఆఫ్ మాసెస్ మైండ్ బెండింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ కి రౌండ్ ఫిగర్ 500 కోట్ల బడ్జెట్ ని ఇనీషియల్ గా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. హంబలే తోపాటు ఆదిత్య చోప్రా కూడా ఈ ప్రాజెక్ట్ ని సంయుక్తంగా నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట.