1000 కోట్ల బలం ఎక్కడిది..? 2 వింతల తర్వాత 3వ వింత..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు, సౌత్ నార్త్ అని తేడా లేకుండా మాస్ ఆడియన్స్ లో పూనకాలు తెప్పించే స్టార్ గా మారాడు. ఖాన్లూ, కపూర్ల వల్ల కూడా కాంది దేవరకే సాధ్యమైంది. త్రిబుల్ ఆర్ పూర్తిగా సోలో మూవీ కాదు కాబట్టి, ఎన్టీఆర్ స్టామినాని అంచనా వేసే పరిస్థితి కనిపించలేదు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు, సౌత్ నార్త్ అని తేడా లేకుండా మాస్ ఆడియన్స్ లో పూనకాలు తెప్పించే స్టార్ గా మారాడు. ఖాన్లూ, కపూర్ల వల్ల కూడా కాంది దేవరకే సాధ్యమైంది. త్రిబుల్ ఆర్ పూర్తిగా సోలో మూవీ కాదు కాబట్టి, ఎన్టీఆర్ స్టామినాని అంచనా వేసే పరిస్థితి కనిపించలేదు. కాని దేవర థౌసెండ్ వాలాలా పేలటం, సౌత్, నార్త్ బాక్సాఫీస్ షేక్ అవటంతో తనేంటో ప్రూవ్ అయ్యింది. అసలు రాజమౌళి లాంటి దర్శకుడి సాయం లేకుండా పాన్ ఇండియాని షేక్ చేసిన తొలి హీరోగా తనకే ఆ రికార్డు దక్కింది. రెబల స్టార్ ప్రభాస్ కూడా జక్కన్న తోడు లేకుండా పాన్ ఇండియాని మూడు నాలుగు సార్లు షేక్ చేశాడు.. కాని ఆరేంజ్ చేరటానికి ముందు రెండు మూడు ఫెల్యూర్స్ ని ఫేస్ చేశాడు రెబల్ స్టార్. కాని ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ వెంటనే దేవరతో సెకండ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సొంతమైంది. ఇప్పుడు హ్యాట్రిక్ విషయంలో తన వల్ల హిందీ హీరో ఫేట్ మారేలా ఉంది. కాకపోతే మరో హీరోకి కూడా వెయ్యికోట్ల కలని తీర్చేంత స్టామినా పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ కి ఎలా సాధ్యమైంది…? కేవలం త్రిబుల్ ఆర్ క్రేజే నా అంటే, మరి అదే క్రేజ్ చరణ్ విషయంలో ఏమైంది? ఇది కాకుండా ఇంకేమైనా కారణాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి.. అవేంటో చూసేయండి…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 పెండింగ్ షూటింగ్ కోసం ముంబై వెళ్లాడు. 40 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం ముంబై వెల్లిన తారక్, వార్ 2 షూటింగ్ ని ఈ ఇయర్ ఎండ్ కల్లా పూర్తి చేస్తాడని తెలుస్తోంది. అయితే వార్ 2 షూటింగ్ మొదలైన కొత్తలో ఎన్టీఆర్ ని ముంబై టీం రిసీవ్ చేసుకున్న విధానానికి, దేవర విడుదల తర్వాత తనని రిలీవ్ చేసుకున్న విధానానికి డిఫరెన్స్ కనిపిస్తోంది. క్లియర్ కట్ గా ఆ ఛేంజ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది
అప్పుడు కూడా త్రిబుల్ ఆర్ హిట్ తో పాన్ ఇండియా హీరోగా వార్ 2 టీం గౌరవంగానే వెల్ కమ్ చెప్పింది. నాటు నాటు సాంగ్ తో దుమ్ముదులిపిన హీరోగా వార్ 2 లో ఎన్టీఆర్ ఎంట్రీ అదిరింది..కాని ఇప్పుడు లెక్కలు మారాయి. దేవరతో రాజమౌళి సపోర్ట్ లేకున్నా, సౌత్ ని మించేలా నార్త్ ఇండియాని షేక్ చేసిన హీరోగా తనమీద బీటౌన్ లో గౌరవం వందల రెట్లు పెరిగినట్టుంది
ఎందుకంటే లోకల్ హీరోస్ అయిన బాలీవుడ్ ఖాన్లు, కపూర్లు, హ్రితిక్ రోషన్ తో సహా, ఎవరూ కూడా చేయని పని ఎన్టీఆర్ చేశాడు. నార్త్ ఇండియాలో టైర్ 2 సిటీలే కాదు, మారుమూలు టౌన్లలో ఉండే థియేటర్స్ కి జనాలు వచ్చేలా చేశాడు. నార్త్ ఇండియాలో మాస్ అటెన్షన్ లాక్కున్నాడు. అక్కడ ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. ఇది ఓరకంగా బాలీవుడ్ మీడియాని, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది.
త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ కి అంత క్రేజ్ వచ్చిందనే దాంట్లో కొంత నిజముంది. కాని దేవర విషయంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లెక్కే వేరు.తను అనుకున్నదే జరిగింది. నార్త్ ఇండియాలోని కామన్ ఆడియన్స్ కి కావాల్సిన మాస్ ఫైట్లు, మతిపోగొట్టే మాస్ ఎలిమెంట్లు హిందీ సినిమాల్లో కనిపించట్లేదు.
ఆ లోటుని తన సినిమాలో భీటున్న డాన్సులతో, నాటు ఫైట్లతో తీర్చాడు
ఆకలి మీదున్న వాడికి ఫుల్ మీల్స్ లా, ఆకలి మీదున్న నార్త్ మాస్ ఆడియన్స్ కి, పంజాబీ తాలీ భోజనాలు పెట్టాడు. అందుకే దేవర 510 కోట్ల షేర్ వసూళ్లు, 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు రాజమౌళిసెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూనే, తన సాయం లేకుండా పాన్ ఇండియానుషేక్ చేసిన తొలి తెలుగు హీరో అనిపించుకున్నాడు
ప్రభాస్ బాహుబలి1,2 తో పాన్ ఇండియాని షేక్ చేసినా, సాహో తో ఆ స్థాయి రెస్పాన్స్ రాలేదు. రాధేశ్యామ్, ఆదిపురుష్ లో దర్శకుల ట్యాలెంట్ మరీ ఎక్కువై, కంటెంట్ తగ్గింది. అలా ప్రభాస్ మోసపోయాడనే కామెంట్ పెరిగింది… అలా తను కొన్ని ఫెల్యూర్స్ చూశాకే, సలార్, కల్కీ లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్లు పడ్డాయి. సో త్రిబుల్ ఆర్ తర్వాత వెంటనే దేవరతో పాన్ ఇండియాను షేక్ చేసి, వార్ 2 తో హ్యాట్రిక్ కి సిద్దపడుతున్నాడు ఎన్టీఆర్. అంతేకాదు సోలోగానే ఎన్టీఆర్ దేవరకు వెయ్యికోట్ల సీన్ తెస్తే, ఇద్దరు హీరోలున్ వార్ 2 కి వెయ్యికోట్లు విషయమే కాదు.
ఏదేమైనా, వార్ 2 కూడా వెయ్యికోట్ల క్లబ్ లో పడితే, పాన్ ఇండియా షేక్ అయితే, వరుసగా మూడు సార్లు పాన్ ఇండియాను షేక్ చేసిన రికార్డు ఎన్టీఆర్ ఎకౌంట్ లోపడుతుంది. ఇలా ఇండియన్ సినిమా హిస్టరీలోనే జరగలేదు. ప్రభాస్ కి బాహుబలి1, బాహుబలి 2 హిట్టైనా, పాన్ ఇండియా లెవల్లో మూడో హిట్ మాత్రం, మూడు సినిమాలతర్వాత సలార్ తో పడింది..
షారుఖ్ ఖాన్ కూడా పటాన్, జవాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టినా, వెయ్యికోట్ల వసూళ్లు రెండు సార్లు సొంతమైనా, మూడోసారి డంకీతో పంచ్ పడింది. అందుకే వార్ 2 హిట్టైనా, వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టినా, వరుస పాన్ ఇండియా హిట్స్ తో హ్యాట్రిక్ ని ఇలానేకాదు, వెయ్యికోట్ల వసూళ్ల విషయంలో కూడా ఆ రికర్డు ఎన్టీఆర్ కి సొంతమైనట్టే… అదే జరిగితే ఇండియాలోనే ఇలాంటి రికార్డు ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ అనాల్సి వస్తుంది.