దేవర 243 కోట్లు, నైట్ మేర్ ఫర్ మెగా ఫ్యామిలీ, రికార్డులు ఎర్ర సముద్రంలో కలిపాడు …?

దేవర సినిమా ఎన్టీఆర్ కు అన్నీ భిన్న అనుభూతులే ఇచ్చింది. సినిమా ప్రకటన దగ్గర నుంచి నెగటివ్ పబ్లిసిటీ, సినిమా విడుదల తర్వాత అసలు ఏ మాత్రం బాగాలేదు అనే టాక్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 30, 2024 | 06:14 PMLast Updated on: Sep 30, 2024 | 6:14 PM

Ntr Cross Mega Family Records With Devara

దేవర సినిమా ఎన్టీఆర్ కు అన్నీ భిన్న అనుభూతులే ఇచ్చింది. సినిమా ప్రకటన దగ్గర నుంచి నెగటివ్ పబ్లిసిటీ, సినిమా విడుదల తర్వాత అసలు ఏ మాత్రం బాగాలేదు అనే టాక్. సోషల్ మీడియా వేదికగా సినిమాను అత్యంత దారుణంగా ట్రోల్ చేయడం, ఒకటి కాదు రెండు కాదు ఈ సినిమాతో ఎన్టీఆర్ మానసికంగా చాలా ఎదుర్కొన్నాడు. గతంలో ఏ సినిమాకు ఇలాంటి అనుభవం లేదు ఎన్టీఆర్ కు. ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా ఎన్టీఆర్ కు మంచి అనుభవాలను ఇచ్చాయి. ప్రీ బుకింగ్ మార్కెట్ గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగింది.

ప్రీ బుకింగ్ మార్కెట్ విషయంలో ఎన్టీఆర్ చాలా పక్కా లెక్కతో కొట్టాడు. స్టార్ హీరోలు ఎవరికి కూడా ఈ రేంజ్ లో ప్రీ బుకింగ్ అమెరికాలో జరగలేదు. ఇక సినిమా విడుదల తర్వాత నెగటివ్ టాక్ ఏ రేంజ్ లో వచ్చినా సినిమా వసూళ్లు మాత్రం ఏ విధంగా కూడా తగ్గలేదనే చెప్పాలి. ఒక్కో సెంటర్ లో గురి చూసి కొడుతుంది దేవర. ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి తన రికార్డులతో సమాధానం చెప్పాడు దేవర. మెగా ఫ్యామిలీలో స్టార్ హీరోల రికార్డులు అన్నీ ఇప్పుడు దేవర దెబ్బకు పూర్తిగా కనుమరుగయ్యాయి.

దేవర మొదటి రోజు 90.92 కోట్లు షేర్. పవన్ కళ్యాణ్ కు తొలి రోజు వచ్చిన షేర్ 87 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 4 కోట్లు ఎక్కువ దేవరకు. ఎన్టీఆర్ కంటే పవన్ కళ్యాణ్ కు ఫాలోయింగ్ ఎక్కువ. ఇక దేవర రెండు రోజుల గ్రాస్ చూస్తే 243 కోట్లు. చిరంజీవికి ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్… 225.7 కోట్లు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే 216 కోట్లు గ్రాస్. దాదాపు 20 కోట్లపైనే తేడా ఉంది. డివైడ్ టాక్ తో దేవర సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోయింది. దేవరను ఎక్కువగా టార్గెట్ చేసింది మెగా ఫ్యాన్స్. సినిమాలో ప్రతీ ఒక్కటి టార్గెట్ చేసారు.