బాలీవుడ్ హీరోలను మించిన క్రేజ్, సముద్రంలో దేవర కటౌట్
ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పెరిగింది. దేవరను బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడంతో అక్కడి జనాల్లో కూడా సినిమాపై పెద్ద చర్చే జరుగుతోంది. బాలీవుడ్ లో ఇప్పుడు విడుదల అయ్యే సినిమాలు కూడా ఏవీ లేకపోవడంతో దేవర డామినేషన్ భారీగా ఉంది.
ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పెరిగింది. దేవరను బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడంతో అక్కడి జనాల్లో కూడా సినిమాపై పెద్ద చర్చే జరుగుతోంది. బాలీవుడ్ లో ఇప్పుడు విడుదల అయ్యే సినిమాలు కూడా ఏవీ లేకపోవడంతో దేవర డామినేషన్ భారీగా ఉంది. సినిమా విడుదలకు ఇంకో రెండు వారాలు ఉండగా అక్కడ ప్రమోషన్స్ ని కూడా గ్రాండ్ గా చేస్తోంది చిత్ర యూనిట్. ఇందుకోసం పలువురు బాలీవుడ్ నటీ నటుల సహకారం కూడా తీసుకుంటున్నారు.
ముంబైలో సినిమా ప్రచారం కోసం సైఫ్ అలీ ఖాన్ కూడా గట్టిగానే కష్టపడుతున్నాడు. అటు జాన్వీ కపూర్ కూడా ఈ ప్రమోషన్ లో తన వంతు పాత్ర పోషిస్తోంది. ఈ నెల 27 న విడుదల కానున్న ఈ సినిమాలో విలన్ గా సైఫ్, జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ కూడా స్వయంగా ఎన్టీఆర్ చెప్పాడు. ట్రైలర్ కు అక్కడ కూడా మంచి స్పందన వచ్చింది. దీనితో సినిమా వసూళ్లు హిందీలో భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అక్కడ ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సినిమా క్రేజ్ పెంచే పనిలో పడ్డారు.
తాజాగా ముంబై సముద్ర తీరంలో… ఓ కటౌట్ ఏర్పాటు చేసారు ఫ్యాన్స్. సముద్రంలో కటౌట్ గతంలో ఏ బాలీవుడ్ హీరో కి ఏర్పాటు చేయలేదు. సముద్రం నేపధ్యంలో వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ సముద్రంలో కటౌట్ ఏర్పాటు చేసారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ కటౌట్ అక్కడి వాళ్లకు కనపడింది. కింద విడుదల తేదీని కూడా రాసారు. ఈ ఫోటోని దేవర చిత్ర యూనిట్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దేవర రేంజ్ ఇది అంటూ ఫ్యాన్స్ వైరల్ చేయడం మొదలుపెట్టారు.