NTR Devara : ఓవర్ సీస్ లో ఎన్టీఆర్ దేవర రికార్డు బిజినెస్..
యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా నెట్స్ లెవల్ కు వెళ్ళింది. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ దేవర అనే చిత్రంలో నటిస్తున్నాడు.

NTR Devara's record business in overseas
యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా నెట్స్ లెవల్ కు వెళ్ళింది. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ దేవర అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాతో తారక్ కు మంచి హిట్ ఇచ్చిన కొరటాల.. ఈసారి ఓ మాస్ మసాలా హిట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. తాజాగా దేవర కి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది.
దేవర (Devara) కి సంబంధించిన అన్ని ఏరియాల బిసినెస్ స్టార్ట్ అయ్యిందనే వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ మేరకు దేవర ఓవర్ సీస్ బిజినెస్ 27 కోట్లకి క్లోజ్ అయ్యిందని అంటున్నారు. రీజినల్ సినిమా స్థాయిలో చూసుకుంటే గత తెలుగు సినిమాలు కన్నా ఆ ఫిగర్ హయ్యెస్ట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వార్తలతో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత పెద్ద మొత్తం ఓవర్ సీస్ లో రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి .అలాగే నైజాం బిజినెస్ సుమారు 45 నుంచి 50 కోట్లు దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ అండ్ దిల్ రాజు దేవర హక్కుల కోసం పోటీపడుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే మరికొన్ని రోజుల్లో దేవర ఆల్ ఏరియాస్ లో జరుపుకునే బిజినెస్ మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది
కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర మీద ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. సుమారు 300 కోట్ల రూపాయిల వ్యయంతో నిర్యాణం జరుపుకుంటున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువ సుధా ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణలు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా బాలీవుడ్ హీరో (Bollywood hero) సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ రోల్ (villain role) పోషిస్తున్నాడు.