ఎన్టీఆర్ డైరెక్టర్లని వదల్లేదు.. ఇప్పుడు తన కథలని వదలట్లేదా..?

ఎన్టీఆర్ దేవర తో ఏదో మ్యాజిక్ చేశాడనే అభిప్రాయం ఐకాన్ స్టార్ లో బాగా పెరిగినట్టుంది. నార్త్ బెల్ట్ కి ఏం కావాలో అది దేవరలో ఉందికాబట్టే, రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసేంత హిట్ తారక్ కి పడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2025 | 05:10 PMLast Updated on: Jan 28, 2025 | 5:10 PM

Ntr Didnt Leave The Directors Now He Wont Leave His Stories

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏ రూట్లో వెల్లినా, తనని బన్నీ వెంబడిస్తున్నాడా…? ఈ డౌట్ రావటానికి చాలా కారణాలున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వయసులో తారక్ కంటే చిన్న వాడు కాదు… ఐనా పనికట్టుకుని తననే ఫాలో అవ్వాల్సిన పరిస్థితొచ్చింది. కారణం పుష్ఫ రాజ్ గా తనకి దక్కిన ఇమేజ్. నార్త్ మార్కెట్ ని స్థిరపరుచుకోవాలంటే, దేవర లాంటి హిట్ పడాలి. అందులో ఆడియన్స్ కి ఏం నచ్చిందో అదే తన మూవీలో ఉండాలని పట్టుబట్టాడట బన్నీ. హిట్ మూవీ వస్తే అలాంటి సినిమా మరోకటి రావాలని కోరుకోవటం కామన్. హీరోల్లో కూడా అలాంటి ప్రాజెక్ట్ మీదకు మనసు మల్లటం చాలా కామన్.

ఐతే త్రిబుల్ ఆర్ తో పోలిస్తే దేవర ఆరేంజ్ మూవీ కాదు. కాని నార్త్ ఇండియా మాసెస్ కి ఈ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అంతగా ఎక్కేసింది. కాబట్టే అచ్చుగుద్దినట్టు అలాంటి మూవీ కోసం దర్శకుల వెంటపడ్డాడు బన్నీ. మొన్నటి వరకు ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివని, రీసెంట్ గా డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్ ని వెంటాడాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కథలను వెంటాడుతున్నట్టున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విన్న కథల్ని వింటున్నాడు బన్నీ.. అవేంటి? ఎందుకు తారక్ దారిలో బన్నీ మక్కీకి మక్కీ నడుస్తున్నాడు? దైవలోకంలో కూడా దేవర పూనకాలే కావాలంటున్నాడా? హావేలుక్

ఎన్టీఆర్ దేవర తో ఏదో మ్యాజిక్ చేశాడనే అభిప్రాయం ఐకాన్ స్టార్ లో బాగా పెరిగినట్టుంది. నార్త్ బెల్ట్ కి ఏం కావాలో అది దేవరలో ఉందికాబట్టే, రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసేంత హిట్ తారక్ కి పడింది. అందుకే కొరటాల శివ వెంటపడ్డాడు బన్నీ. కాని దేవర 2 అయ్యే వరకు తాను అందుబాటులో ఉండడు. డ్రాగన్, సలార్ 2 పూర్తయ్యే వరకు ప్రశాంత్ నీల్ అందుబాటులోకి వచ్చేఛాన్స్ లేదు

ఇవన్నీచూసే ఎన్టీఆర్ ఎవరితో సినిమా లు చేశాడో, చేస్తున్నాడో వాల్లనే బన్నీ టార్గెట్ చేశాడన్న ప్రచారం మొన్నటి వరకు జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు తారక్ విన్నకథలు, వదిలేసిన సినిమాల వెంటపడుతున్నట్టున్నాడు బన్నీ. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తను కమిటైన మూవీ కూడా ఎన్టీఆర్ ఒకప్పుడు విని, వదిలేసిన కథలే..

నిజానికి అరవింద సమేత వీరరాఘవ తర్వాత మరో ప్రాజెక్ట్ అనుకున్నారు త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ అప్పుడో మైతలజీ మీద ప్లాన్ చేశారు. ఫాంటసీ జోనర్ లో మాయలు మంత్రాల కథలుచేయాలనుకున్నారు. కాని కుదర్లేదు. త్రిబుల్ ఆర్ టైంలో కూడా ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య కథా చర్చాలు జరిగాయి. ఆరెండు కథలే ఇప్పుడు కలిపి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ ఫాంటసీ మూవీ ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్

బేసిగ్గా పవన్ నుంచి చరణ్ వరకు వాళ్లు వదిలేసిన సినిమాలు రవితేజ అండ్ కోకి ఎలా కలిసొచ్చాయో… అలా ఎన్టీఆర్ వదిలేసిన కథ బన్నీకి కలిసొస్తుందనుకుందాం… అలా చూస్తే గుంటూరు కారం మహేశ్ బాబుకి కలిసి రావాలి… కాని ఏమైంది..? ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఈప్రాజెక్ట్ మహేశ్ టేకప్ చేసి చేతులు కాల్చుకున్నాడు. కట్ చేస్తే బన్నీకి ఇదే పంచ్ పడుతుందా? చెప్పలేం

కాని పనికట్టుకుని ఎన్టీఆర్ తో సినిమాలు తీసిన దర్శకులు, లేదంటే తను విన్న కథల్నే టార్గెట్ చేశాడు బన్నీ. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్దమైంది. కథ పూర్తైంది. కాకపోతే పుష్పారాజ్ కి నార్త్ ఇండియా మార్కెట్ బలపడేంత మాసీగా త్రివిక్రమ్ కథ చెబుతాడా అన్నదే డౌటు… ఆ డౌటు వల్లే ఎన్టీఆర్ తోదేవర తీసిన కొరటాల,డ్రాగన్ ని తీస్తున్న ప్రశాంత్ నీల్ నే టార్గెట్ చేశాడు బన్నీ. అది కుదరకే, ఎన్టీఆర్ వదిలేసిన కథతో నార్త్ ఇండియాని టార్గెట్ చేయాలనుకుంటున్నాడు.