రంగస్థలంలో NTR డైరెక్టర్… బన్నీ హీరోయిన్… !
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో తీసిన సుకుమార్, తర్వాత చరణ్ తో రంగస్థలం తీశాడు... బన్నీ తో పుష్ప రెండు భాగాలు తీసి ట్రెండ్ సెట్ చేశాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో తీసిన సుకుమార్, తర్వాత చరణ్ తో రంగస్థలం తీశాడు… బన్నీ తో పుష్ప రెండు భాగాలు తీసి ట్రెండ్ సెట్ చేశాడు. ఇలా వరుస హిట్స్ తో దూసుకెళుతున్న సుకుమార్ సడన్ గా చరణ్ కి, బన్నీ హీరోయిన్ ని జోడీగా తీసుకుంటున్నాడు. తెలుగులో పాన్ ఇండియా సినిమా అంటే హిందీ హీరోయినే కనిపించాలి… హిందీలో పాన్ ఇండియా మూవీ అంటే సౌత్ హీరోయినేమెరవాలి… అలా అయితేనే నార్త్, సౌత్ రెండు మార్కెట్లతో జనాలకు సినిమా రీచ్ అవుతుంది. అంతవరకు బానే ఉంది. కాని చరణ్ తో రంగస్థలం తీసిన సుకుమార్, ఇప్పుడు పుష్పరాజ్ ఫేట్ మార్చిన శ్రీవల్లని రంగస్థంలోకి దింపుతున్నాడు. కాంబినేషనే మార్చాడు. అన్నీంటికి మించి ఫస్ట్ టైం సుకుమార్ రామ్ చరణ్ తో పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాకి సిద్దమయ్యాడు. పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత, చరణ్ కే ఇలాంటి ఆఫర్ దక్కిందట. అదేంటో చూసేయండి. పుష్ప, పుష్ప2 హిట్ల తో పాన్ ఇండియాని షేక్ చేసిన సుకుమార్, ఇప్పుడు చరణ్ తో ప్లాన్ చేసిన మూవీకి పుష్పరాజ్ దిల్ కి దడ్ ఖన్ శ్రీవల్లీని సీన్ లోకి తీసుకొస్తున్నాడు. ఇది ఫైనల్ అయ్యింది. 2026 లో ఏకంగా 100 రోజుల కాల్ షీట్స్ సుకుమార్ టీంకి రష్మికా ఇచ్చేయటం వల్లే, చరణ్ సరసన మెరవబోయే హీరోయిన్ తానే అని కన్ఫామ్ అయ్యింది.
గతంలో ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో మూవీ తీసిన వెంటనే చరణ్ తో రంగస్థలం లాంటి ప్రయోగం తీశాడు సుకుమార్. అలా గ్లోబల్ స్టార్ కి హిట్ పడింది. ఇప్పుడు సీన్ లోకి పుష్ప లాంటి హిట్ మూవీలో మెరిసిన శ్రీవల్లని రంగంలోకి దింపుతున్నాడు. దీనికి తోడు చరణ్ ని ఇందులో డ్యూయెల్ రోల్ లో చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ కథలు, ఎన్టీఆర్ హీరోయిన్లు, ఎన్టీఆర్ డైరెక్టర్లు ఇలా ఎవరిని టచ్ చేసినా, ఆ హీరోకి కాలం కలిసొస్తోంది. అందుకే బుచ్చి బాబు మేకింగ్ లో చరణ్ ఆల్రెడీ దేవర బ్యూటీతో డ్యూటీఎక్కాడు. తర్వాత ఎన్టీఆర్ డైరెక్టర్ సుకుమార్ తో, మరో రంగస్థలానికి సిధ్దమయ్యాడు. కాకపోతే ఈ రంగస్థలం సిటీలో ఉంటుందట. పక్కా మాఫియా యాక్షన్ డ్రామా..
వన్ నేనొక్కిడినే, నాన్నకు ప్రేమతో తర్వాత మళ్లీ సుకుమార్ స్టైలిష్ యాక్షన్ డ్రామాలు తీయలేదు. అందులో వన్ నేనొక్కిడినే పెద్దగా వర్కవుట్ కాలేదు. కాని నాన్నకుప్రేమతో మాత్రం అప్పట్లోనే 130 కోట్లు రాబట్టింది. ఇప్పుడు చరణ్ వంతొచ్చింది. మహా తెలివైన హీరో, మరీ మొరటు మాఫియా డాన్ ఈ ఇద్దరి పాత్రల్లో చరణ్ ని చూపించాబోతున్నాడట సుకుమార్.
అయితే ఏది ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా చర్చల దశల్లోనే ఈ ప్రాజెక్ట్ ఉందట. కాకపోతే నాన్నకు ప్రేమతో స్టైల్లో చరణ్ ని చూపించాలనేది సుకుమార్ ఆలోచణంటూ, లీకులు కిక్ ఇస్తున్నాయి. ఇక ఇంతవరకు తన ఏ సినిమాలో కూడా హీరోయిన్ ని కంటిన్యూ చేయని సుకుమార్, ఇప్పుడుమనసు మార్చుకున్నాడు. పుష్ప తర్వాత మరోసారి రష్మికకు ఛాన్స్ ఇస్తున్నాడు.