నిజంగానే టైగర్ ని చూసి వాతలు పెట్టుకుంటే… అందరూ ఎన్టీఆర్లు కాదు..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2024 | 01:13 PMLast Updated on: Nov 04, 2024 | 1:13 PM

Ntr Domination In North India

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమౌతుంది… కాలిపోతుంది.. కాని అది తెలియక లేదంటే తెలిసే, ఇప్పుడు యంగ్ టైగర్ అలియాస్ పాన్ ఇండియా టైగర్ ఎన్టీఆర్ ని చూసి చాలా మంది వాతలు పెట్టుకుంటున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా, తనలోని టైగర్ ని ఎవరూ మర్చిపోరు. ఆరేంజ్ మాస్ ఇమేజ్ తన సొంతం… అయితే ఈ ఇమేజ్ కి, త్రిబుల్ ఆర్, దేవర హిట్ల వెనక ఒకే ఒక్క కామన్ ఎమోషన్ డార్క్ బ్యాగ్రౌండ్… ఇదే ఎన్టీఆర్ ఫేట్ ని మార్చేసిందా? అలా అనుకునే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దారిలో వెల్తానంటున్నారు ఇద్దరు హీరోలు. అలా చీకట్లోనే చితక్కొట్టాలనుకుంటున్నాడు హిందీ స్టార్ రణ్ వీర్ సింగ్. ఇప్పుడు ఎన్టీఆర్ ని మక్కీకి మక్కీ కాపీ కొట్టే పనిలో తనుంటే, కన్నడ మార్కెట్ లో ఎన్టీఆర్ బ్యాగ్రౌండ్ ని యాజ్ ఇట్ ఈజ్ దీంపేశాడు మరో హీరో.. కాని తనకి వర్కవుట్ కాలేదు. రణ్ వీర్ సింగ్ కి వర్కవుట్ అవుతుందనే గ్యారెంటీ లేదు… ఇంతకి టైగర్ ని చూసి వీల్లెలా వాతలు పెట్టుకున్నారు.. ఫైనల్ గా ఏమని తెలుసుకున్నారు..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి అలా ఎలా మాస్ ఫాలోయింగ్, సౌత్ తోపాటు నార్త్ లో భీభత్సంగా పెరిగిందనే ప్రశ్న హిందీ హీరోలను వెంటాడుతోంది. ఖాన్లు, కపూర్లకు కూడా సాధ్యం కాని మాస్ ఇమేజ్ నార్త్ లో పెరగటానికి కారణం ఎన్టీఆర్ ఎంచుకున్న కథలు, అందులో సామాన్యులని టచ్ చేసే పాత్రలు.. పుష్పలో బన్నీ, రంగస్థలంతో రామ్ చరణ్, బాహుబలిలో శివుడు ఇవన్నీ కామన్ ఆడియన్స్ కి మరీ ముఖ్యంగా శ్రమించే మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే పాత్రలు..

అలాంటి పాత్రల్లో పాతుకుపోయినా, కథ కనెక్ట్ అయినా చాలు హీరోల ఫేట్ మారిపోతుంది. కల్కీ, సలార్, బాహుబలి, త్రిబుల్ ఆర్, దేవర సినిమాలకు అదే అయ్యింది. పుష్పకు అదే కలిసొచ్చింది. ఐతే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. తన డాన్స్ మూమెంట్స్, మాస్ పెర్ఫామెన్స్ కి తోడు తన యాక్షన్ ఎపిసోడ్లు మాస్ లోకి చొచ్చుకెళ్లాయి

నార్త్ ఇండియాలో అయితే పుష్ప కంటే పదిరెట్లు ఎక్కువగానే దేవర దూసుకెళ్లింది. కారణం కూడా పాత్రలోని ఊర మాస్ అప్పియరెన్స్…దీనికి తోడు డార్క్ బ్యాగ్రౌండ్… త్రిబుల్ ఆర్ లో కూడా చరణ్ పాత్రకు లేని డార్క్ నెస్ కొమరం భీమంకి ఉందని ఇంటర్ వెల్ సీన్ తో తేలింది. సో ఇలాంటి డార్క్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తే, మరో ఎన్టీఆర్ అయిపోవచ్చా?

అలాంటి డౌటొచ్చే భగీరా మూవీతీశారు. సలార్, కేజీయఫ్, దేవర స్టైల్లో ఈ సినిమా డార్క్ బ్యాగ్రౌండ్ తో వచ్చింది. కాని కథ కత్తిలా ఉండాలి… అందులో కనిపించే హీరోకి మాస్ మతిపోగొట్టే ఇమేజ్ ఉండాలి.. కేవలం డార్క్ బ్యాగ్రౌండ్ తో వండర్స్ చేయలేరు.. అదే విషయం కన్నడ మూవీ భగీరా ఫ్లాప్ తో తేలింది.

దీనికి కేజీయఫ్, సలార్ ఫేం ప్రశాంత్ నీల్ కథ అందించినా ఉపయోగం లేకుండాపోయింది. సో కేవలం మాస్ హీరోలని చూసి, వాళ్ల సినిమాలను చూసి, వాతలు పెట్టుకుంటే వాతలే తప్ప, వసూళ్లు రావని తేలింది. కాని కన్నడ మూవీ భగీర విషయంలో ఆ టీం చేసిన తప్పే బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్చేస్తున్నాడు.

దేవర స్టైల్లో చేపల వేటకెల్లే పేదోల్ల నాయకుడిగా రణ్ వీర్ సింగ్ ఊర మాస్ మూవీ చేయబోతున్నాడు. సినిమా పేరు కూడా అధీర అంటూ ప్రచారం జరుగుతోంది. ముంబై బెస్త వాళ్ల జీవితాలే బ్యాక్ డ్రాప్ గా ఈ సినిమా రాబోతోందంటున్నారు.ఈ మ్యాటర్ బయటికి రాగానే, దేవర బ్యాక్ డ్రాప్ నే కాదు, మాస్ ఫార్ములాను కూడా యాజ్ ఇట్ ఈజ్ మక్కీకి మక్కీ దింపేస్తున్నారని అర్ధమౌతుంది. కాని దేవర బ్యాక్ డ్రాప్ తోనో, కొరటాల శివ క్రియేటివిటీతోనో ఈ సినిమా హిట్టైందా? అంటే అక్కడ ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ అనే మరో అంశం ఉంది. బేసిగ్గా తనని డైరెక్టర్ వాడుకుంటే, పాత్రలో తను ఆడుకుంటారంటారు.. అలాంటి మాస్ పెర్ఫార్మర్ ఉన్నాడు కాబట్టే దేవర కథకి, తను బలంగా మారాడు.. అది మర్చిపోయి, కేవలం సేమ్ స్టైల్ ని ఫాలో అయితే, మాస్ ఫ్యాన్ బేస్ పెరుగుతుందనే ప్రయత్నం అమాయకంగా ఉందనే మాట వినిపిస్తోంది.