NTR WAR 2 : వార్‌-2 లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌

జూనియర్ ఎన్టీఆర్​, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్​ రోషన్ (Hrithik Roshan) కాంబినేషన్​లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'వార్ 2' (WAR 2).. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా (Pan India) మల్టీస్టార్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై హైఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2024 | 12:30 PMLast Updated on: Apr 08, 2024 | 12:30 PM

Ntr Dual Role In War 2

జూనియర్ ఎన్టీఆర్​, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్​ రోషన్ (Hrithik Roshan) కాంబినేషన్​లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘వార్ 2’ (WAR 2).. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా (Pan India) మల్టీస్టార్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై హైఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బీటౌన్​లో ఎన్టీఆర్ (NTR) ఈ సినిమాతోనే ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇవ్వడంతో.. యంగ్ టైగర్‌ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.. యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇండియన్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నట్లు సినీ వర్గాల టాక్.. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్ లకు మధ్య కీలక యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయట.. కాగా.. ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ బజ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ఓ కేజ్రీ గాసిప్ వినిపిస్తోది. ఇందులో ఒకటి నెగిటివ్ పాత్ర కాగా.. మరొకటి పాజిటివ్ పాత్ర అని తెలుస్తోంది. ఇంటర్వెల్ లో ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ రెండో పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ (NTR – Hrithik Roshan) కలయిక అంటేనే.. ఆడియన్స్ లో భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికితోడు ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అనడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.

మరోవైపు ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్‌లో ప్రజెంట్ బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్​టీఆర్ సరసన బీటౌన్ స్టార్ జాన్వీ కపూర్ నటిస్తోంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్గున్నాడు. మరో స్పెషల్ రోల్​లో శ్రీకాంత్‌ కనిపించనున్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్​లో విడుదల కానుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న ఈ మూవీ కోసం జూనియర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.