దేవర డబ్బింగ్ స్ట్రాటజీ… పిచ్చెక్కిపోతున్న పాన్ ఇండియా స్టార్లు
దేవర సినిమా ఏ భాషలో చూసినా వినపడేది ఎన్టీఆర్ వాయిస్. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. సినిమా ఎక్కడ రిలీజ్ అయినా స్వయంగా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పి తొడకొట్టాడు. తమిళం, కన్నడం, హిందీలో కూడా స్వయంగా తనే డబ్బింగ్ చెప్పి... చాలా మందిని ఇప్పుడు డిఫెన్స్ లో పడేసాడు.

దేవర సినిమా ఏ భాషలో చూసినా వినపడేది ఎన్టీఆర్ వాయిస్. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. సినిమా ఎక్కడ రిలీజ్ అయినా స్వయంగా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పి తొడకొట్టాడు. తమిళం, కన్నడం, హిందీలో కూడా స్వయంగా తనే డబ్బింగ్ చెప్పి… చాలా మందిని ఇప్పుడు డిఫెన్స్ లో పడేసాడు. యంగ్ టైగర్ ను తక్కువ అంచనా వేసిన వాళ్ళు… దేవర సినిమా కంటే దేవర సినిమా ప్రమోషన్స్ చూస్తే ఓ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వేరే హీరోల సపోర్ట్ లేకుండా ప్రమోషన్స్ జరగడం లేదు. ఇదే కలెక్షన్ వ్యూహం అయిపోయింది.
అలాంటిది… అన్ని భాషల్లో ప్రమోషన్స్ ను తానే లీడ్ చేసాడు. ఇక డబ్బింగ్ తో లోకల్ ఇగోని కూడా కాంప్రమైజ్ చేసి… వసూళ్లు భారీగా సాధించాడు. ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. పాన్ ఇండియా స్టార్ లు అవ్వడానికి అందరూ ట్రై చేస్తున్నారు బాగానే ఉంది. కాని… ఎన్టీఆర్ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేసే దమ్ము ఉందా అనే చర్చ మొదలయింది. డబ్బింగ్ అన్ని భాషల్లో చెప్పడం అనేది అంత ఈజీ కాదు. కాని ఎన్టీఆర్ మాత్రం ఓ టైం ఫిక్స్ చేసుకుని ఫినిష్ చేయడం మనం చూసాం.
అందుకే ఇప్పుడు హీరోలు అందరూ… సౌత్ భాషలు నేర్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. హిందీ వస్తే నార్త్ మొత్తం మ్యానేజ్ చేయవచ్చు. కాని తెలుగు వస్తే సౌత్ మ్యానేజ్ చేయడం చాలా కష్టం. అందుకే ఇప్పుడు మాహేశ్ బాబు, రామ్ చరణ్ సహా పాన్ ఇండియా హీరోలు అందరూ తమ సినిమాకు తామే డబ్బింగ్ చెప్పే ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు… తమిళం కాస్త మ్యానేజ్ చేసినా కన్నడం మాట్లాడటం కష్టమే. అందుకే ఇప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ తో కన్నడం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్.
గేమ్ చేంజర్ సినిమాకు రామ్ చరణ్… కన్నడం డబ్బింగ్ చెప్పలేకనే… కన్నడలో రిలీజ్ చేయడం లేదనే టాక్ కూడా వస్తోంది. ప్రభాస్ కు ఈ ఇబ్బంది లేదు… భాష ఏదైనా ప్రభాస్ ఇమేజ్ తో మ్యానేజ్ చేసేయవచ్చు. అందుకే పెద్దగా దానిపై ఫోకస్ చేయడం లేదు ప్రభాస్. కాని ఇతర హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపాలి అంటే భాష ముఖ్యం అనే విషయాన్ని గ్రహించి జాగ్రత్త పడుతున్నారు. మరి ఫ్యూచర్ లో ఏం చేస్తారో చూడాలి. ఏది ఎలా ఉన్నా… ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రెండ్ ను ఫాలో కావడం ఇప్పుడు స్టార్ హీరోలకు కష్టమే.