అన్నా..! 2 ఏళ్లలో తెలుగు నేర్చుకున్న … జపాన్ లేడీకి ఎన్టీఆర్ ఫిదా..

జపాన్ లో దేవర ప్రమోషన్ రోజు రోజుకి సెన్సేషన్ అవుతోంది. ముందు ప్రివ్యూని 8 లక్షల మంది అభిమానులు చూసి షాక్ ఇస్తే, తర్వాత జపాన్ లో ఎన్టీఆర్ ల్యాండ్ కాగానే మతిపోగొట్టే వెల్ కమ్ చెప్పారు అక్కడి జనం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2025 | 04:53 PMLast Updated on: Mar 28, 2025 | 4:53 PM

Ntr Falls In Love With A Japanese Lady Who Learned Telugu In 2 Years

జపాన్ లో దేవర ప్రమోషన్ రోజు రోజుకి సెన్సేషన్ అవుతోంది. ముందు ప్రివ్యూని 8 లక్షల మంది అభిమానులు చూసి షాక్ ఇస్తే, తర్వాత జపాన్ లో ఎన్టీఆర్ ల్యాండ్ కాగానే మతిపోగొట్టే వెల్ కమ్ చెప్పారు అక్కడి జనం. దేవర కటౌట్ కి పూల, పాలాభిషేకాలతోపాటు, ఏ థియేటర్ వెల్లినా హౌజ్ ఫుల్ ఫ్యాన్స్ తో తారక్ సందడి అక్కడ మీడియాలో హైలెట్ అవుతూ వస్తోంది. ఐతే అంతకు మించి ఓ వీడియా ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది. ఓ ఎన్టీఆర్ అభిమాని, మ్యాన్ ఆఫ్ మాసెస్ కోసం ఏకంగా తెలుగు నేర్చుకుంది. అన్నా అని పిలిచింది. ఆటో గ్రాఫ్ తీసుకుంది. మరో అభిమాని తెలుగు సినిమా డైలాగ్ చెప్పాడు. ఇంతకి అభిమానం ఎన్టీఆర్ కి జపాన్ లో ఎలా సొంతమైంది? కేవలం త్రిబుల్ ఆర్ తో ఇది సాధ్యమైందనుకుంటే ఖచ్చితంగా పొరపాటే… కాకపోతే రోజు రోజుకి జపాన్ లోదేవర ప్రమోషన్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. బాలీవుడ్ లో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ కి ఎక్కడో మండేలా చేస్తున్నాయి… అదెందుకో చూసేయండి.

దేవర ఈ వీకెండ్ 28 కి జపాన్ లోరిలీజ్ కాబోతోంది. అనుకున్న దాని ప్రకారం 22నే జపాన్ వెళ్లిన ఎన్టీఆర్, వందలకొద్ద యూట్యూబర్స్ కి ఇంటర్వూలు ఇవ్వటమే కాదు, అక్కడ థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. దేవర ఆడే చాలా థియేటర్స్ కి వెళ్లి జపాన్ ఫ్యాన్స్ ని కలుస్తున్న ఎన్టీఆర్ కి, ఓ జపాన్ లేడీ ట్విస్ట్ ఇచ్చింది. ఊహించని ఝలక్ ఇచ్చింది.తను లేడీ ఫ్యాన్స్ కి ఆటోగ్రాఫులిస్తుంటే, అన్నా త్రిబుల్ ఆర్ చూసినప్పటి నుంచి తెలుగు నేర్చుకుంటున్నా,. రెండేళ్లలో తెలుగు నేర్చుకున్నా అంటూ క్యూట్ గా మాట్లాడింది. దీనికి షాకైన ఎన్టీఆర్ యూ ఆర్ గ్రేట్ ఇన్స్ పిరేషన్ అన్నాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇది ముందుగా కొద్ది వరకు మనదగ్గర వైరలైంది. కానిఇప్పుడు షాట్స్ లో, ఇన్ స్టాగ్రామ్ లో ఈ చిన్న వీడియో సునామీ క్రియేట్ చేస్తోంది.

మొన్నటికి మొన్న దేవర కటౌట్ కి మన తెలుగు స్టైల్లో పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసారు జపాన్ ఫ్యాన్స్. తర్వాత ఎన్టీఆర్ తో కలిసి థియేటర్స్ లో జపాన్ బోయ్స్ డాన్స్ చేస్తే, వాళ్లతో కలిసి చిందేశాడు తారక్. ఇక అక్కడి మల్టీప్లెక్స్ కి ఏకంగా 5 వేల మంది వరకు ఫ్యాన్స్ రావటం, అదక్కడ మీడియాలో పెద్దవార్తవటం విచిత్రమైతే, ఇప్పుడు జపాన్ లేడీ తెలుగులో అన్నా అనిపిలవటం మొత్తానికి హైలెట్.ఐతే ఈ వీడియో కి కామెంట్స్ ఎక్కడచూసినా పాజిటివ్ గానే వస్తున్నాయి. కాని హిందీ కామెంట్స్ లో నే సగం నెగెటీవ్ గా కనిపిస్తున్నాయి. ఇదంతా పీఆర్ స్టంట్ అని, జపాన్ ఫ్యాన్స్ అంత సీన్ లేదని రకరకాలుగా కొంతమంది హిందీలో కామెంట్స్ పెడుతున్నారు. కాసేపే కామెంట్సే నిజం అనుకున్నా, ఓ జపాన్ లేడీతో తెలుగు మాట్లాడించి ఇంత డ్రామా సాధ్యమా..

ఓ లేడీ ఫ్యాన్ రెండేళ్లతో తెలుగు నేర్చుకుని అన్నా అని పిలస్తూ, ఆటోగ్రాఫ్ కోసం దూసుకురావటం పీఆర్ స్టంట్ అనే అవకాశం ఉంది. అంతెందుకు, లాస్ట్ ఇయర్ త్రిబుల్ ఆర్ చూసి, ఎన్టీఆర్ కి ఫిదా అయ్యానన్నాడు జపాన్ మంత్రి. అసలు సింహాద్రి నుంచే తను అక్కడ ఫేమస్ అన్నాడంటే, అది కూడా పీఆర్ స్టంటేనా? అసలే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి తప్ప మరే ఇండియన్ కి జపాన్ లో ఫ్యాన్స్ లేరని అరవోళ్లు తెగ ఫీలయ్యారు. కాని బాహుబలితో ప్రభాస్ ఆ కాన్ఫిడెన్స్ ని కొల్లగొట్టాడు. ఎన్టీఆర్ అయితే ఏకంగా అందరిని మించి, జపాన్ ఫ్యాన్స్ ని తెలుగు ఫ్యాన్స్ లా మార్చేశాడు.. ఇదే చాలా మందికి మండుతున్నట్టుందనేది థీమ్ ఆఫ్ ద స్టోరీ.